ముఖ్యాంశాలు

 • TRS Chief Kalvakuntla Chandra Sekhar Rao Press meet at T Bhavan after Telangana Assembly Election Results 2018

  దేశానికే తెలంగాణ దిక్సూచి అవుతుంది: కేసీఆర్

 • EVMs manipulated in Telangana Assembly polls 2018 says TPCC President Uttam Kumar Reddy

  తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి

 • Telangana Assembly polls 2018 winners

  టీ అసెంబ్లీలో ఒక్కొక్కరుగా అడుగుపెట్టబోతున్న విజేతలు

 • Jagitial Congress Candidate Jeevan Reddy loss in Telangana Assembly polls 2018

  జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓటమి

 • TRS Leading in 89 seats Telangana Assembly polls 2018

  10 ఉమ్మడి జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం

తాజా వార్తలు

మరింత +
KTR tweets halchal in twitter with gunshot ట్రెండింగ్ లో కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో కొత్త ప్రొఫైల్‌ ఫొటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే వేల లైక్‌లు, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి. ఈ ఒక్క ఫొటో చాలు.. ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి అంటూ కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

KCR leading in Gajwel, Revanth Reddy leading in Kodangal in Telangana Assembly polls 2018 గజ్వెల్లో కేసీఆర్, కొడంగల్లో రేవంత్ రెడ్డి ఆధిక్యం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో గజ్వెల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 5వేల ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యం వచ్చింది. అయితే, ఈవీఎం లెక్కింపు ప్రారంభమయ్యాక రేవంత్‌కు ఆధిక్యం లభించింది. నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మనుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. నల్లొండలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల భూపాల్‌రెడ్డి, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. కూకట్ పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.
ఐదు రాష్టాల అసెంబ్లీ ఫలితాలలో.. 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు తమ ప్రత్యర్థులపై ఆధిక్యంలో ఉన్నారు. గజ్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డిపై ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

TRS Harish Rao leading in Siddipeta Constituency సిద్ధిపేటలో హరీష్, మునుగోడులో రాజగోపాల్ ఆధిక్యం

సిద్ధిపేటలో హరీష్ రావు మొదటి రౌండ్‌లో 6 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మునుగోడు రాజగోపాల్ రెడ్డి 1300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నిర్మల్లో కాంగ్రెస్, తుంగతుర్తిలో టీఆర్ఎస్, వర్ధన్నపేటలో కాంగ్రెస్ ముందంజ, జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఆధిక్యం, పరకాలలో చల్లా ధర్మారెడ్డి ఆధిక్యం, వరంగల్ ఈస్ట్ లో వినయ్ భాస్కర్ ఆధిక్యంలో ఉన్నారు.  రాజస్థాన్ లో వసుంధర రాజే ముందంజ, టోంక్ లో సచిన్ పైలట్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 30 స్థానాలు, కాంగ్రెస్ 30 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.  

రీల్ న్యూస్

మరింత +
Sara Ali Khan’s 'Kedarnath' banned in seven districts of Uttarakhand ఉత్తరాఖండ్‌లో 'కేదార్ నాథ్' మూవీ నిషేధం!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, నటి సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ తెరకెక్కించిన 'కేదార్ నాథ్' సినిమాను నిషేధించాలంటూ కేదార్ నాథ్ ఆలయ అర్చకులు డిమాండ్ చేశారు. సినిమాలో సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ సినిమాను నిషేధించకపోతే భారీగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సినిమా లవ్ జిహాద్ ను ప్రేరేపించేలా, తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా పోస్టర్‌లో ముస్లిం యువకుడు, హిందూ యువతిని మోసుకెళుతున్నట్లు చూపించారు. అసలు కేదార్ నాథ్ కు ముస్లింలే రారని వ్యాఖ్యానించారు. అలాంటిది వేలాదిమంది వరదల్లో కొట్టుకునిపోతుంటే మధ్యలో ముద్దు సీన్లను పెట్టారన్నారు విమర్శించారు. హిమాలయ పర్వతాల్లో ఉన్న కేదార్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని అతలాకుతలం చేసిన వరదలను, ఆలయం చూసేందుకు వచ్చిన ఓ హిందూ యువతి, స్థానిక ముస్లిం యువకుడితో ప్రేమలో పడటం, ఆపై వరదల్లో వారు ఎలా ఇబ్బందులు పడ్డారన్న ఇతివృత్తంతో కేదార్ నాథ్ చిత్రం రూపొందింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న సినిమాను ప్రదర్శించకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేదం విధించింది. కేదార్‌నాథ్, ఉదమ్‌ సింగ్ నగర్ సహా మొత్తం ఏడు జిల్లాల్లో ఈ చిత్రాన్ని తొలుత నిషేధించారు. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేదిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

Cine Stars caste their vote in Jubilee Hills for Telangana Assembly polls 2018 జూబ్లీహిల్స్‌లో సినీ ప్రముఖుల ఓటింగ్

సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సినీ ప్రముఖులు సామాన్య అందరిలాగే క్యూలైన్లో నిల్చుకొని తమకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, అల్లూ అర్జున్, నాగార్జున, బండ్ల గణేష్, పరుచూరిగోపాలకృష్ణ, సత్యంరామలింగరాజు ఉదయాన్నే తమ ఓటు వేశారు. పోలింగ్ బూత్ 151, 152 లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓబుల్ రెడ్డి స్కూళ్లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేశారు. జూబిలీ హిల్స్ కిడ్స్ స్కూళ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు విజయశాంతి.

Touched By Your Blessings : Priyanka Chopra Thanks PM Modi మోడీకి కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌ దంపతులకు ప్రధాని అధికారిక ఇన్‌స్టాగ్రాంలో శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన వివాహ విందు వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరై, ఆ జంటను ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు ప్రధాని అధికారిక ఇన్‌స్టాగ్రాం ఖాతాలో రిసెప్షన్ సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌. మీ వైవాహిక జీవితం సంతోషకరంగా సాగాలని కోరుకుంటున్నానని దానికి క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రియాంక కూడా మోడీ, నిక్‌ తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మీ మాటలు, ఆశీర్వాదం తమకు సంతోషాన్ని కలిగించిందని ప్రియాంక వెల్లడించారు.

జాతీయ వార్తలు

మరింత +
Rajasthan, Telangana, Madhya Pradesh, Chhattisgarh, Mizoram Election Results: Counting To Begin At 8 AM మినీ సంగ్రామం: 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు షురూ

మరికాసేపట్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ లో కౌంటింగ్ కేంద్రాల వద్ద వివిధ పార్టీల కార్యకర్తల సందడి కనిపించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణాలోని హైదరాబాద్ తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Supreme Court issues notices to five states on plea challenging amendments to Land Acquisition Act భూసేకరణ చట్టం-2013 ఆర్డినెన్స్‌లపై కోర్టు ఆగ్రహం

భూసేకరణ చట్టం2013లో సవరణలు చేయడంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, జార్ఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భూ సేకరణ చట్టం 2013లో సవరణలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.బలవంతంగా భూసేకరణ చేసేలా సవరణలపై సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలు..ఆర్డినెన్స్‌లు తేవడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.

BJP Ally Upendra Kushwaha Quits As Minister, Will Attend Opposition Meet కేంద్ర మంత్రి పదవికి ఉపేంద్రకుశ్ వాహా రాజీనామా

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో ఎన్డీఏకు షాక్ తగిలింది. కేంద్ర మంత్రి పదవికి, RLSP చీఫ్ ఉపేంద్ర కుశ్ వాహా రాజీనామా చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీతో జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ఆయన ఎన్డీఏ నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్డీఏ పక్షాల సమావేశానికి గైర్హజరవుతానని ప్రకటించిన కొంత సేపటికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

క్రీడా వార్తలు

మరింత +
India vs Australia, 1st Test: India beat Australia by 31 Runs on Day 5 in Adelaide ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు మ్యాచ్, మొదటిసారి గెలిచిన టీమిండియా

అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను టీమిండియా బౌలర్లు 291 పరుగులకు ఆలౌట్ చేశారు. టాప్ ఆర్డర్ వికెట్లు త్వరగా కోల్పోయిన ఆసీస్.. టెయిలెండర్లు పోరాటం చేశారు. కాని టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 291 పరుగులకు కుప్పకూలింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0తో ఆదిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 250 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టు బ్యాట్స్ మన్ అంతా విఫలమైన చోట పుజారా ఒక్కడే క్రీజ్ లో నిలబడి సెంచరీతో చెలరేగాడు. జట్టును ముందుండి నడిపాడు. జట్టు మొత్తం 250 పరుగులు చేస్తే అందులో 123 పరుగులు పుజారా ఒక్కడే చేశాడు. ఆసీస్ బౌలర్లు ఎంత ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ఆడాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 250 పరుగులకు కుప్పకూలింది. ఇటు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. 235 పరుగులకు ఆలౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో 15 పరుగుల ఆధిక్యంతో కలిపి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీ సేనను టాప్ ఆర్డర్ ప్లేయర్స్ ఆదుకున్నారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పుజారా మరోసారి హాఫ్ సెంచరీతో రాణించగా.. రహానె కూడా పట్టుదలగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. కాని వీరిద్దరు ఔట్ కాగానే... టెయిలెండర్లు వరుస పెట్టి పెవీలియన్ క్యూ కట్టడంతో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవరాల్ గా 322 పరుగుల టార్గెట్ ను ప్రత్యర్ధికి విధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. చివర్లో టెయిలెండర్లు పోరాటం చేసినా.. షమీ, బుమ్రా, అశ్విన్ అదిరిపోయే స్పెల్‌తో జట్టుకు విజయాన్ని అందించారు.

Telangana election: Jwala Gutta says her name is missing from voters' list బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, ఫ్యామిలీ ఓట్లు మిస్సింగ్

ఓట్ల గల్లంతులో సామాన్యులే కాదు సెలబ్రిటీలు చిక్కుకున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కుటుంబ సభ్యుల ఓట్లు కూడా మిస్ అయ్యాయి. ఓటేయడానికి వెళ్తే తన ఓటు లేదని తనతో పాటు తన చెల్లి, తండ్రి ఓట్లు కూడా మిస్ అయ్యాయని తెలిపారు. తన కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కరికి మాత్రమే ఓటు ఉందని మిగిలిన మూడు ఓట్లు లేవని నిరాశ వ్యక్తం చేసింది.

Ramesh Powar unlikely to get extension as women's team coach after Mithali Raj stand-off భారత్ మహిళల క్రికెట్‌ను కుదుపేసిన మిథాలీరాజ్ వివాదం

భారత్ మహిళల క్రికెట్లో మిథాలీరాజ్ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ నుంచి తప్పించి తనకు అన్యాయం చేశారంటూ మిథాలీరాజ్ మెయిల్, దానిపై కోచ్ రమేష్ పోవార్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనపై వచ్చిన ఆరోపణలపై మిథాలీ తీవ్రంగా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ నుంచి మిథాలీరాజ్‌ను తప్పించడంతో భారత మహిళల క్రికెట్లో వివాదం చెలరేగింది. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోచ్‌ రమేశ్‌ పవార్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీలపై ఆరోపణలు చేశారు. వారి వల్లే తనకు అన్యాయం జరిగిందంటూ మిథాలీ బీసీసీఐకి మెయిల్‌ పంపారు. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిసిన జట్టు కోచ్‌ రమేశ్‌ పొవార్‌ మిథాలీపై పలు ఆరోపణలు చేశారు. మిథాలీ ఓపెనింగ్‌లోనే ఆడతానని పట్టుబట్టిందని.. లేదంటే ప్రపంచకప్‌ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పొవార్‌ బోర్డుకు అందించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై మిథాలీ రాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘నాపై వస్తున్న ఆరోపణలతో ఎంతో వేదనకు గురవుతున్నా. ఈ దేశం కోసం 20ఏళ్ల పాటు ఎంతో నిబద్ధతతో ఆడాను. కానీ నా శ్రమకు తగిన ఫలితం దక్కలేదు. ఈ రోజు నా దేశభక్తిని అనుమానిస్తున్నారు. నా నైపుణ్యాలను ప్రశ్నిస్తున్నారు. ఇది నా జీవితంలో చీకటి రోజు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేవుడు నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మిథాలీ ట్వీట్‌ చేశారు.

అంతర్జాతీయం వార్తలు

మరింత +
UK court’s verdict on Vijay Mallya’s extradition case today మాల్యాను భారత్‌కు అప్పగించడంపై తీర్పు నేడే

విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించడంపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎమ్మా అర్బట్‌నాట్‌ నేడు తుది తీర్పు ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో ఈ కేసులో బ్రిటిష్‌ అధికారులకు అవసరమైన మరింత సమాచారం అందించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే లండన్‌ చేరారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం మాల్యా ఎస్‌బీఐతో సహా వివిధ భారతీయ బ్యాంకులకు 9,000 కోట్ల మేర టోపీ పెట్టారని ప్రభుత్వ ఆరోపిస్తోంది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మాల్యా బ్రిటన్‌కు పారిపోయారు. ఒకవేళ మాల్యాను భారత్‌కు అప్పగించాలని నేడు కోర్టు తీర్పు ప్రకటిస్తే 28 రోజుల్లోగా బ్రిటన్‌ విదేశాంగ మంత్రి దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మాల్యా కూడా ఆ తీర్పును 14 రోజుల్లోపు బ్రిటన్‌ హైకోర్టులో సవాల్‌ చేయవచ్చు. తీర్పు అప్పగింతకు వ్యతిరేకంగా వస్తే, భారత్‌ కూడా దీనిపై 14 రోజుల్లోగా అప్పీల్‌ చేయాల్సి ఉంటుంది.

Tsunami warning for Vanuatu and New Caledonia after 7.6 magnitude earthquake పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ భూకంపం

పసిఫిక్‌ మహాసముద్రంలోని వనౌటూ, న్యూ కలెడోనియా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో అస్ట్రేలియాకు తూర్పువైపున్న దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియాకు చెందిన లాయాలిటీ దీవులకు ఆగ్నేయంవైపున 155 కిమీటర్ల దూరంలో 10 కిమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో సునామీ ప్రభావం ఉండొచ్చని పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌​ హెచ్చరించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

France fuel protests: Tear gas fired in clashes in Paris ఉద్యమ బాట పట్టిన ఫ్రాన్స్ ప్రజలు

ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు చేపట్టిన ఉద్యమం తీవ్రంగా మారింది. రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు చేతుల్లో రాడ్లు, గొడ్డళ్లు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. కనిపించిన వాహనాలు, ఇళ్లను తగులబెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో ఈ ఆందోళనలను కట్టడి చేయడానికి ఎమర్జెన్సీ విధించే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తున్నది. YELLOW WEST పేరుతో ఈ ఉద్యమం నవంబర్ 17 నుంచి సాగుతుంది. ఈ ఆందోళనలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్.. ప్రధాని, మంత్రులతో నేడు ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించనున్నారు.

డెస్క్ నుండి

కేసీఆర్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు

మహబూబ్ నగర్ జిల్లా ప్రచారంలో కేసీఆర్ అసహనాన్ని ప్రదర్శించారు. సభకొచ్చిన ప్రజలపై నోరు పారేసుకున్నారు. నినాదాలు చేస్తున్న కార్యకర్తలను బేవకూఫ్ గాళ్లు అంటూ దూషణలకు దిగారు. ఇలాంటి అత్యుత్సాహమే పార్టీ కొంప ముంచుతుందని మండిపడ్డారు. సన్నాసులు కూసోవాలి అంటూ మాట్లాడారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలా చిటపటలాడుతున్నారని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
సహనం కోల్పోయిన కేసీఆర్..
కేసీఆర్ తన చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. అలంపూర్, గద్వాల్, మక్తల్, కొడంగల్ తో పాటు పొరుగునే ఉన్న వికారాబాద్ లో ప్రసగించారు. అయితే ఆయన వ్యవహర శైలి గతానికి భిన్నంగా ఉంది. గతంతో పోలిస్తే ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు కనిపించింది. అయితే తన జిల్లా పర్యటనలు ముగుస్తున్న సమయానికి గులాబీ పార్టీకి అనుకున్నంత సానుకూలత ప్రజల నుంచి వ్యక్తం కావడం లేదు. ప్రజా కూటమి గెలుపు అవకాశాలు రోజు రోజుకు మెరుగు పడుతున్నాయి. దీంతో తన శ్రమ అంతా వ్రుదా అయిపోతుంది అన్న ఆవేదన కేసీఆర్ లో వ్యక్తం అయింది. అందులో భాగంగా అలంపూర్ లో మొదటి సభ లో ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచే తన అసహనాన్ని బయట పెట్టారు. కేసీఆర్ ను చూసి నినాదాలు చేస్తున్నకార్యకర్తలను ఉద్దేశించి భేకూఫ్ గాల్లు అంటూ నోరు పారేసుకున్నారు. కొంప ముంచే ఉత్సహం పనికి రాదని దూషణలకు దిగారు. దీంతో ప్రజలతో పాటు జిల్లా ఎంపీ, ప్రజా ప్రతినిధులు షాక్ అయ్యారు. ఎంపీ జీతేందర్ రెడ్డి వారించేందుకు ప్రయత్నిస్తే రెట్టించిన కోపంతో కార్యకర్తలను అల్లరి మూకలని, భేకూఫ్ లని దూషించారు. 
అలంపూర్ జిల్లాకిచ్చిన 100 పడకల ఆసుపత్రి హామీ నెరవేర్చలేదు..
సీఎం ఇలా వ్యవహరించడంతో జిల్లా ప్రజలు ఒక్క సారిగా అవక్కయ్యారు. తమ అధినేతకు ఏమైంది..ఇలా నోరు పారేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. సభకొచ్చిన ప్రజలపై కేసీఆర్ నోరు పారేసుకోవడం ఆయన నియంత పోకడలకు నిదర్శనమని జిల్లా ప్రజలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. అయితే ఓటమి భయంతోనే కేసీఆర్ జిల్లా ప్రజలను దూషిస్తున్నారని విపక్షాలు అభిప్రాయ పడుతున్నాయి. జిల్లా ప్రజల డిమాండ్లను ఇంత కాలం పట్టించుకోని కేసీఆర్ ఎన్నికల కోసం అన్ని చేస్తామని మాత్రం హమీ ఇచ్చారు. అలంపూర్ జిల్లాగా ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా ఒక్క ఆసుపత్రిని కూడా మంజూరు చేయలేదు. అసెంబ్లీలో తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్ కూమర్ నిలదిస్తే త్వరలో నిర్మిస్తామని హమీ ఇచ్చి పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చాలా చిన్న విషయమని పార్టీ అభ్యర్ధిని గెలిపించిన మరుసటి రోజే ఆసుపత్రి ఏర్పాటుపై ఉత్తర్వులిస్తామని హమీ ఇచ్చారు. 
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై కేసీఆర్ కు శ్రద్ద లేదు..
మరోవైపు మిగిలిన అన్ని నియెజకవర్గాల్లోనూ కేసీఆర్ ఇలానే మాట్లాడారు.తమను గెలిపిస్తే అన్నీ చేస్తామని హామీలు గుప్పించారు. పనిలో పనిగా కార్యకర్తలను సన్నాసులు అంటూ విమర్శలు గుప్పించారు. పాలమూరు ను గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి చేయలేదని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. పాలమూరులో మొత్తం కొండలు, గుట్టలు, బీడు భూములే ఉన్నాయని అందుకే తమను గెలిపిస్తే అభివ్రుద్ది చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో కేసీఆర్ కు ఎన్నికల యావ తప్ప జిల్లా అభివృద్ధిపై శ్రద్ద లేదని విమర్శిస్తున్నారు ప్రజలు.

ఇంకా చదవండి7 Days Ago
ప్రచారంలో.. మాటలతో మాయ చేస్తున్న కేసీఆర్

కేసీఆర్ మాటల మాంత్రికుడు. తిమ్మిని బమ్మిని చేయడంలో ఆయన దిట్ట. కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనకు టీఆర్ఎస్ 4 సంవత్సరాల పాలను మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో విజ్ఞతతో ఓటేయాలని ప్రజలకు చెబుతున్నారు. అయితే ఇది సరైన పోలిక కానే కాదు. తెలంగాణకు అన్యాయం చేసిన సమైఖ్య పాలనతో.. తన పాలనను పోల్చమనడం అసంబద్ధమే అవుతుంది తప్ప సహెతుకం కాదంటున్నారు. 
సమైఖ్య పాలనలో...
సమైఖ్య పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. నీళ్ల, నిధులు నియామకాల్లో తీరని నష్టం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రులుగా ఉన్నా చేయగలిగిందేమి లేదు. సీమాంధ్ర లాభి ముందు తనతో సహా అందరు అణిగిమణిగి ఉండాల్సిందేనని, అందుకే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను తప్పుబట్టాల్సిన పని లేదని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు ప్రకటించారు. కాని అది మరిచి పోయి ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు, సమైఖ్య పాలన లక్షంగా విమర్శలు చేస్తున్నారు. 
పోలిక సరికాదు...
ఎన్నికల సభల్లో ఒకే మాట ఆయన పదే పదే చెబుతున్నారు. ప్రజలు గందగోళ పడాల్సిన పని లేదని, మీ ముందు తలపడుతున్న రెండు పక్షాలు ఒకరు 58 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ అయితే మరొకరు నాలుగున్నర ఏండ్లు పాలించిన టీఆర్ఎస్ అని కేసీఆర్ చెబుతున్నారు. ఇద్దరి పాలనలను పోల్చి విజ్ఞతతో ఓటేయాలని పిలుపునిస్తున్నారు. అయితే ఈ పోలిక సరికాదంటున్నారు. పోలిక అంటే సమఉజ్జిల మధ్య ఉండాలి. పండును పండుతోనే పోల్చాలి. కాయను కాయతోనే పోల్చాలి. అలా కాకుండా కాయను పండుతో పోలుస్తా అంటే అది అసంబద్ధ పోలికే అవుతుంది. కాని కేసీఆర్ మాత్రం అసంబద్ధ పోలికనే ప్రచార అస్త్రంగా చేసుకున్నారు. 58 ఏండ్ల సమైఖ్య పాలనతో నాలుగున్నర ఏండ్ల తన పాలన ను పోల్చమని పిలుపునిస్తున్నారు.  
నాడు తెలంగాణకు అన్యాయం...
సమైఖ్య పాలనతో తెలంగాణ పాలనను పొల్చడం సరికాదు. సమైఖ్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది. అది గుర్తించిన కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని ఏర్పాటు చేసింది. సమైఖ్య పాలనలో అంతా బాగుంటే తెలంగాణ అవసరమే ఉండేది కాదని స్వయంగా కేసీఆర్ ఎన్నో సార్లు ప్రకటించారు. అలాంటప్పుడు సమైఖ్య పాలనతో తెలంగాణ పాలనను సరిపోల్చడం శుద్ద దండగ. ఆ విషయం కేసీఆర్ తెలియంది కాదు. కాని ఓటర్లను తన వైపునకు తిప్పుకునేందుకే ఇలాంటి అసంబద్ధ పోలికలను ప్రచారం చేస్తున్నారు. 
ఆనాడు 23 జిల్లాలకు, నేడు 10 జిల్లాలకు...
తాను ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో లేవని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. అవును రాష్టం సమైఖ్యంగా ఉన్నప్పుడు అప్పటి ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులకు అనుగుణంగా పథకాల అమలు జరిగేది. ఆర్థిక పరిమితులకు లోబడి అప్పులు తెచ్చేవారు. కాని తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారింది. తెలంగాణకు వస్తున్న ఆదాయంలో హైదరాబాద్‌ది కీలక పాత్ర. 60 శాతం రెవిన్యూ ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది. దీన్నే ఉమ్మడి రాష్టంలో 23 జిల్లాలకు పంచేవారు. అదే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 10 జిల్లాలకు పంచుతున్నారు. దీంతో కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి. కేసీఆర్ కాదు తెలంగాణలో ఎవ్వరు అధికారంలోకి వచ్చినా ఇదే జరిగేది. కాని కేసీఆర్ మాత్రం ఇవి తమకే ప్రత్యేకమని... తాము ఓడితే అవన్ని బందవుతాయని బెదిరింపులకు దిగుతున్నారు.  
అప్పటి కంటే ఇవాళ్టి అప్పులు ఎక్కువ...
మరోవైపు అప్పు చేసి కేసీఆర్ పప్పు కూడా పెడుతున్నారు. ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు కోసం ఇబ్బిడి ముబ్బిడిగా అప్పులు చేసారు. 60 సంవత్సరాల సమైఖ్య పాలన 70 వేల కోట్లు అప్పులు చేస్తే..గత నాలుగున్నర ఎండ్లలో రెండు లక్షల కోట్ల అప్పులు చేసారు కేసీఆర్. ప్రస్తుత ప్రతి ఒక్కరి మీద 50 వేల అప్పు ఉంది. 
ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థం...
అప్పు పుట్టేందుకు ఆదాయాన్ని అధికంగా చూపారు. దీన్నిరాజ్యంగ బద్ద సంస్థ కాగ్ కూడా తప్పుపట్టి కేసీఆర్ సర్కార్ ను చివాట్లు పెట్టింది. ఆర్థిక క్రమ శిక్షణ లేకపోవడం భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించింది. అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అంటున్నారు. ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థంగా మారుతుందని తెలిసే, ఉన్న పళంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లరానే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే విపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తున్నాయన్న సాకు కేసీఆర్ చూపేస్తున్నారని అంటున్నారు.

ఇంకా చదవండి13 Days Ago
ప్రజాకూటమి మేనిఫెస్టో 2018 ముఖ్యాంశాలు ఇవే!

ప్రజా సంక్షేమం, ఉద్యోగాలే లక్ష్యంగా మహాకూటమి మేనిఫెస్టో సిద్ధమవుతోంది. పీపుల్స్‌ ఫ్రంట్‌ ఉద్యమ ఆకాంక్షల ఎజెండా పేరుతో మేనిఫెస్టోను విడదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ. ఉద్యోగాలను క్రమం తప్పకుండా భర్తీ చేయడానికి వార్షిక ప్రణాళిక ఒకేసారి ఒక్కో రైతుకు రెండు లక్షల రుణమాఫీతో పాటు పంటల కొనుగోలుకు 10 వేల కోట్ల రూపాయల నిధి ఏర్పాటు వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు కూటమి నేతలు. కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐల కూటమి రూపొందించిన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు రెడీ అయ్యారు. 
గంపెడు వరాలతో ప్రజాకూటమి మేనిఫెస్టో..
 ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మహాకూటమి సిద్ధమయ్యింది. ప్రగతీ భవన్‌లో బందీగా మారిన అధికారాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా ఉపాది ఉద్యోగ రంగంలో యువతకు పెద్ద పీట వేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీతో పాటు పోటీ పరీక్షలకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. రైతులకు బంధువులుగా ఉంటామని చెప్పారు. పంటరుణమాఫీ ఒకేసారి రెండు లక్షల రూపాయలు చేయడంతో పాటు సకాలంలో వడ్డీలేని రుణాలను అందిస్తామన్నారు. పంటలను మద్దతు ధరకు కొనేందుకు 10వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి ఏటా 10వేల రూపాయలతో పాటు సన్న, చిన్నకారు రైతులకు పంట బీమా ప్రీమియం చెల్లిస్తామన్నారు. 
సాగునీటి రంగానికి పెద్ద పీట..
  సాగునీటి రంగానికి పెద్ద పీట వేస్తున్నారు. భారీ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తామని మహాకూటమి నేతలు తెలిపారు. భూ సేకరణ బాధితులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగేళ్లలో జరిగిన భూసేకరణలపై సమీక్ష చేయడంతో పాటు 2016 భూసేకరణ చట్టంలోని అమానవీయ, రైతు వ్యతిరేక అంశాల తొలగింపుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై నమోదైన కేసుల ఎత్తివేస్తామన్నారు. ఏడాదిలోపు అమరవీరుల స్మృతివనం నిర్మాణం చేపడతామని అమరులు, వారి కుటుంబాలకు గుర్తింపు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశమున్నట్లు తలుస్తోంది. 
విద్య, వైద్య రంగాలను స్ట్రాంగ్‌గా మారుస్తాం ..
 పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు. విద్యారంగాన్ని స్ట్రాంగ్ గా మారుస్తామన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేయడంతో పాటు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన వైద్య పరిరక్షణ మిషన్‌ ను అమలు చేస్తామని చెబుతున్నారు. వంద యూనిట్లలోపు వాడేవారికి ఉచిత విద్యుత్తు ఇవ్వడంతో పాటు నిరుపేదలందరికీ సొంత ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నారు మహాకూటమి నేతలు.

ఇంకా చదవండి16 Days Ago
'తెలంగాణ పరిస్థితి చూసి ఆ అమ్మ గుండె పగిలింది'

ఓ మాతృమూర్తి కష్టనష్టాల్ని భరించి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువును పురిటి పొత్తిళ్లలో పడుకోబెట్టుకుని హత్తుకోవాలనుకుంది. అయితే అనివార్య పరిస్థితుల్లో ఆ నవ శిశువు ఆ మాతృమూర్తి నుంచి చేజారిపోయింది. నాలుగున్నరేళ్ళ పరాయి పెంపకంలో ఆ బిడ్డ ఆశలు ఆవిరయ్యాయి. అన్ని విధాలా జీవితం నాశనమైంది. బతుకు బండలైంది భవిష్యత్తు అంధకారమైంది. కాని అనుకోకుండా ఓ రోజు ఆ అమ్మకు తన బిడ్డ తారసపడింది. చాలా కాలం తర్వాత కన్నపేగును చూసి ఆ తల్లి ఉద్వేగానికి లోనయ్యింది. స్వహస్తాలతో దగ్గరకు తీసుకుని హత్తుకోవాలనుకుంది. అయితే బక్కచచ్చిన బిడ్డ పరిస్థితిని చూసి ఆ అమ్మ గుండె తరుక్కుపోయింది. అయ్యో నా బిడ్డకు ఎంత కష్టం వచ్చిందే అని దిగాలు చెంది పరాయి పెంపకంలో పడిన కష్టనష్టాలను విని చలించిపోయింది. బిడ్డ భవిష్యత్తుపై కలత చెంది పరాయి పెంపకం నుంచి విముక్తి కల్పిస్తానని భరోసా ఇచ్చింది. దీంతో ఆ బిడ్డ కళ్లల్లో ఆనందం చూసి ఆ అమ్మ నిజంగా పండగ చేసుకుంది. ఆ తల్లే సోనియా గాంధీ. ఆ బిడ్డే తెలంగాణ. వారిద్దరి కలయికకు వేదిక అయ్యింది మేడ్చల్ బహిరంగ సభ. మేడ్చల్ బహిరంగ సభలో సోనియా గాంధీ తెలంగాణ పరిస్ధితిని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. రాష్ట్రం ఏర్పాటు చేయడానికి పడిన వేదన అనుభవించిన భాద అంతా ఇంతా కాదంటూ విడమర్చి చెప్పింది. ఒక బిడ్డకు న్యాయం చేయాలంటే మరో బిడ్డకు అన్యాయం అవుతుందని దిగులు చెందిది. కాని తల్లి ఏ బిడ్డకు అన్యాయం జరగనివ్వదు, చేయదు. ఓ తల్లిగా అదే చేసింది సోనియా గాంధీ. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

ఇంకా చదవండి18 Days Ago
ఉమ్మడి జిల్లాల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ అమీతుమీ

తెలంగాణ జిల్లాల్లో బరిలోకి దిగిన వివిధ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఏ ఏ నియోజక వర్గాల్లో ఏ పార్టీ బలంగా ఉంది. ఏ పార్టీకి చెందిన అభ్మర్థి గట్టి పోటీ ఇస్తున్నారో తెలుసుకుందాం.  
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో..
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఎక్కువ చోట్ల త్రిముఖ పోటీ కనిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా పలు నియోజకవర్గాల్లో పోటీదారుగా ఉంది. బాల్కొండ, నిజామాబాద్‌లో తిరుగుబాటు అభ్యర్థుల్లో ఒకరు బీఎస్పీ, ఇంకొకరు ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలో ఉన్నారు. నిజామాబాద్‌ పట్టణం, రూరల్, జుక్కల్‌, కామారెడ్డి, బాల్కొండలో బీజేపీ మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.  
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో..
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 10 స్థానాలకు గాను ఎక్కువ నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీలే జరగనున్నాయి. ఇతర పార్టీల అభ్యర్థులున్నా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ జరగనుంది. దుబ్బాకలో మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ, టీజేఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ప్రజాకూటమిలోని రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి గట్టి పోటీదారుగా ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యం అవ్వనుంది. మిగిలిన చోట్ల బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థుల ప్రభావం ఎవరిమీద ఉంటుందో చూడాల్సి ఉంది.  
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలలో..
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలోని 29 స్థానాలకు 20కి పైగా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలు జరగనున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ప్రజాకూటమిలోని కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీజేఎస్ రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. మల్కాజిగిరిలో మహాకూటమి తరఫున టీజేఎస్ పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ, ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం బరిలో ఉంది. మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేస్తోంది. రాజేంద్రనగర్‌లో ఈ మూడు పార్టీలతో పాటు ఎంఐఎం కూడా ప్రధాన పోటీదారుగా ఉంది. హైదరాబాద్‌లో ఎంఐఎం పోటీ చేసే 7 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖపోటీ నెలకొంది.  
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 స్థానాల్లో టీఆర్ఎస్, మహాకూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే 5 నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ, ఒకచోట BLF గట్టి పోటీని ఇవ్వనున్నాయి. మహబూబ్‌నగర్‌లో TJS అభ్యర్థి రాజేందర్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి బరిలోంచి తప్పుకోవడంతో ఇక్కడ కూటమి నుంచి పోటీ చేస్తున్న ఎర్ర శేఖర్‌కు, టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌కు మధ్య గట్టి పోటీ జరగనుండగా, బీజేపీ కూడా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేయనుంది. ఇక్కడ బీజేపీ కూడా గట్టి ప్రయత్నం చేస్తోంది. మహబూబ్‌నగర్‌తో పాటు కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్‌, కొల్హాపూర్‌లోనూ బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ, బీఎల్‌ఎఫ్‌ గట్టిపోటీ ఇవ్వగలిగిన చోట్ల తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ముఖాముఖి పోటీ జరగనుంది. షాద్‌నగర్‌లో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి శంకర్‌ బీఎస్‌పీ తరఫున బరిలో ఉన్నారు. ఈయన కూడా ప్రధాన పార్టీలకు సవాల్‌ విసురుతున్నారు.  
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో మూడింటిలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇందులో ఆదిలాబాద్‌, ముథోల్‌లో బీజేపీ గట్టి పట్టు కలిగి ఉంది. ఈ రెండింటినీ ఎలాగైనా కైవసం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిర్మల్‌లో కూడా పోటీ ఇస్తున్నప్పటికీ ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి మధ్య నెట్టుకురావడం అంత సులభం కాదంటున్నారు. చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్దన్‌ బీఎల్‌ఎఫ్‌ తరఫున బరిలో ఉన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ముఖాముఖి పోటీలు నెలకొన్నాయి.  
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు పార్టీలు పోటీలో ఉన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో ముఖాముఖి పోరే జరగనుంది. 13 స్థానాలకు నాలుగుచోట్ల మినహా మిగిలిన అన్నిచోట్ల్ల ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంది. కరీంనగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వనున్నారు. రామగుండంలో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి ఫార్వర్డ్‌బ్లాక్‌ తరఫున పోటీ ఇస్తున్నారు. చొప్పదండిలో తాజా మాజీ ఎమ్మెల్యే శోభ బీజేపీ తరఫున బరిలోకి దిగారు. పెద్దపల్లిలో బీజేపీకి గట్టి అభ్యర్థి ఉన్నారు.  
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 స్థానాల్లో భూపాలపల్లి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ పశ్చిమ, తూర్పు, పరకాల నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. మిగిలిన నియోజకవర్గాలు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. త్రిముఖ పోటీలు ఉన్నచోట కూడా మూడో పార్టీ వల్ల రెండు ప్రధాన పార్టీల్లో ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందన్నదే ప్రధానాంశం. భూపాలపల్లిలో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఈయన నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. జనగామలో సీపీఎం, బీజేపీ పోటీలో ఉన్నాయి. వరంగల్‌ తూర్పులో కాంగ్రెస్‌, టీజేఎస్ అభ్యర్థులిద్దరూ పోటీలో ఉన్నారు. పరకాలలో బీజేపీ అభ్యర్థి గట్టిగా ఉన్నారు. వరంగల్‌ తూర్పులో మాజీ ఎమ్మెల్యేను బీజేపీ రంగంలోకి దింపింది. డోర్నకల్‌, మహబూబాబాద్‌, నర్సంపేట, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీ జరగనుంది.  
ఉమ్మడి నల్గొండ జిల్లాలో..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు గాను సూర్యాపేట, మునుగోడు, మిర్యాలగూడ, ఆలేరు నియోజకవర్గాలు త్రిముఖ పోటీలకు సిద్ధమవ్వగా, మిగిలిన నియోజకవర్గాల్లో ముఖాముఖి పోటీలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. దేవరకొండలో స్వతంత్ర అభ్యర్థి ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సూర్యాపేటలో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి పటేల్‌ రమేష్‌రెడ్డి విరమించుకోవడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. మిర్యాలగూడలో టీజేఎస్ అభ్యర్థి బరిలోంచి తప్పుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ, సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు ఉన్నప్పటికీ రెండు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ తీవ్రంగా ఉండే అవకాశముంది.  
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో త్రిముఖ పోటీలు ఎక్కువగా జరగనున్నాయి. రెండు ప్రధాన పార్టీలతోపాటు సీపీఎం, న్యూడెమోక్రసీ, బీఎల్‌ఎఫ్‌, కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్న అయిదారు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో టీఆర్ఎస్‌తో పాటు బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ టికెట్‌ దక్కకపోవడంతో ఈయన బరిలోకి దిగారు. భద్రాచలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌, సీపీఎం మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ములుగు మాజీ ఎమ్మెల్యే వీరయ్యకు కాంగ్రెస్‌ ఇక్కడ టికెట్‌ ఇచ్చింది. మిగిలిన అన్ని చోట్లా ముఖాముఖి పోటీలే జరగనున్నాయి.

ఇంకా చదవండి19 Days Ago
టీఆర్ఎస్‌కు రెబల్స్ బెడద

తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగుబాట్ల బెడద తప్పడంలేదు. టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు రెబెల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. రామగుండం, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు, బెల్లంపల్లి, కోదాడ, మక్తల్, రాజేంద్రనగర్, మహేశ్వరం స్థానాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు బరిలో నిలిచారు. నామినేషన్లు సైతం వేశారు. తిరుగుబాటు నేతల్లో ముగ్గురు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ తరఫున పోటీ చేస్తుండగా మరో ఇద్దరు బీఎస్పీ నుంచి బరిలో దిగారు. మిగిలిన వారు స్వతంత్రులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని పోటీ నుంచి తప్పించేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. నామినేషన్ల ఉపసంహకరణకు గడువు తక్కువగా ఉండటంతో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.  
రామగుండం నుంచి..
రామగుండం నుంచి టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత కోరుకంటి చందర్‌ ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో టికెట్‌ ఆశించి భంగపడిన గండ్ర సత్యనారాయణరావు కూడా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచే బరిలో దిగారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో తనకు టికెట్‌ దక్కకపోవడంతో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సైతం ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కేవలం 3 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.  
బెల్లంపల్లి నుంచి..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో మాజీ మంత్రి జి.వినోద్‌ బెల్లంపల్లి నుంచి బహుజన సమాజ్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. ఆయన గతంలో చెన్నూరు సెగ్మెంట్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే కోదాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి సైతం తిరుగుబాటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. మూడు రోజుల క్రితం టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం కోదాడ టికెట్‌ కేటాయించింది. దీంతో శశిధర్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.  
పలు నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు..
స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో రాజారపు ప్రతాప్‌ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మక్తల్‌లోనూ టీఆర్‌ఎస్‌ నేత ఎం. జలంధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మహేశ్వరంలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కొత్త మనోహర్‌రెడ్డి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా టి.శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌గా ఉన్నారు.

ఇంకా చదవండి22 Days Ago
ఆ 20 నియోజకవర్గాలపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న TRS అధినేత కేసీఆర్‌ 20 నియోజకవర్గాలపై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ అభ్యర్థుల అంతర్గత సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ 20 నియోజకవర్గాలే ఆయన మెయిన్ టార్గెట్ అంటున్నారు. అందుకే ఈ నియోజకవర్గాలకు సీనియర్‌ నేతలను ఇన్‌ఛార్జీలుగా నియమించి, వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.  

పార్టీ పరిస్థితులను అంచనా వేసేందుకు మొదటి నుంచి కేసీఆర్‌ అంతర్గత సర్వేలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజా సర్వే ఫలితాల ఆధారంగా 20 నియోజకవర్గాల్లో TRSకు 50 శాతం కన్నా తక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని గుర్తించారంట. వీటిలో ఎక్కువ విపక్ష సభ్యులకు చెందినవి కాగా, కొన్ని పార్టీ ప్రాతినిధ్యం వహించినవి. ఈ నియోజకవర్గాల్లోని అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో అభ్యర్థులు సఫలీకృతం కావడం లేదని భావించిన కేసీఆర్.. వారికి వెన్నుదన్నుగా ఉండటానికి కొందరు సీనియర్లను పంపించారు. వారు ఆ నియోజకవర్గాల్లోనే మకాం వేసి పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు.  

మరోవైపు టీఆర్‌ఎస్‌ మరో 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో టికెట్‌ ఆశిస్తున్న నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సోమవారమే ఈ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫారాలు కూడా పంపిణీ చేస్తారని ఆశావాహులు భావించారు. అయితే ఈ టికెట్లు ఖరారు కాకపోవడంతో వారు వెనుదిరిగారు.  

కేసీఆర్‌ మాత్రం ఈ 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారని, అయితే కూటమి అభ్యర్థులను ప్రకటించాకే వెల్లడించాలనే వ్యూహంతో ఉన్నారని తెలుస్తోంది. ప్రచార షెడ్యూల్‌ విషయంలోనూ కేసీఆర్‌ ఇదే వైఖరితో ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఆలస్యమవుతుండటంతో ప్రచార షెడ్యూల్‌ను రెండ్రోజుల్లో వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి29 Days Ago
కేంద్రం నిఘా: కేసీఆర్ కు ఓటమి తప్పదా?

తెలంగాణలో కేంద్ర నిఘా వర్గాలు సంచరిస్తున్నాయా..?ఎన్నికల పరిస్థితులపై ఆరా తీస్తున్నాయా..? టీఆర్ఎస్ పరిస్థితులపై డిల్లీకి ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్తున్నాయా..? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గులాబీ గ్రాఫ్ తగ్గుతూ కూటమి గ్రాఫ్ పెరిగిందనే ప్రచారంపై కేంద్రం ఆరా తీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.  
ఏ రాజకీయ పార్టీకి విజయం వరించేను..?
ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయముంది. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ విజయవకాశాలు ఎలా ఉన్నాయనేదానిపై కేంద్ర హోం శాఖా ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిసింది. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సుమారు 20 మంది అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తుందని ప్రచారముంది. వీరంత కేవలం ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎంత బలముంది.  
టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందా..?
ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై సమాచారం సేకరిస్తున్నారని అధికార వర్గాలు చెపుతున్నాయి. అసెంబ్లీ రద్దు తరువాత టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మెల్ల మెల్లగా తగ్గిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగాఉంది. అది నిజమేనా లేక కేవలం ప్రచారమా.. అనే కోణంలో కూడా కేంద్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయంటున్నారు.  
కేసీఆర్ కుటుంబ పాలనపై కూడా ఆరా..!
టీఆర్‌‌‌‌‌స్ పాలన ఎలా ఉంది కేసీఆర్ ఇచ్చే హామీలు, ఆయన చేసే రాజకీయ ప్రకటనలపై ప్రజలు ఏం అనుకుంటునరనే విషయంపై కూడా కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయట. అదే సమయంలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో పడ్డారట. కూటమి ఏర్పాటు వారి బలబలాలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే అసెంబ్లీ రద్దు తరువాత కెసిఆర్ ఈమెజీ కాస్తా తగ్గిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.  
కూటమి మేనిఫెస్టో కాపీ కొట్టారని గ్రామాల్లో చర్చ..
నెల రోజులుగా గులాబీబాస్ ప్రజలకు దూరంగా ఉండటంతో పాటు కాంగ్రెస్ ఎన్నికల హామీలను కాపీ కోట్టారనే చర్చ గ్రామ స్థాయి ప్రజల్లో ఉన్న విషయాన్ని కేంద్ర నిఘా అధికారులు పసిగట్టారని తెలిసింది.

ఇంకా చదవండి33 Days Ago
మరింత +