ముఖ్యాంశాలు

 • No Leadership in Congress says BJP Leader DK Aruna

  హస్తంలో ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది

 • Komatireddy Brothers fire on KCR and Modi over Operation Aakarsh

  కేసీఆర్, మోడీని కడిగిపారేసిన కోమటిరెడ్డి బ్రదర్స్

 • Nirav Modi Arrested In London, To Be Produced In Court Shortly

  లండన్‌లో నీరవ్ మోడీ అరెస్ట్

 • Nagababu Joins in janasena Party to contest from Narsapuram Lok Sabha Constituency

  జనసేన: నర్సాపురం నుంచి నాగబాబు పోటీ

 • Beauty Pageant Winner Now an Army Officer, Netizens Go Gaga Over Lt. Garima Yadav’s Life Journey

  ఆర్మీ ఆఫీసర్‌గా మాజీ మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్

తాజా వార్తలు

మరింత +
No Leadership in Congress says BJP Leader DK Aruna హస్తంలో ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోయందని తెలిపారు. హస్తంలో ప్రశ్నించే గొంతు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రక్షణ కల్పించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

Priest's shower colorful Holi water on revelers during Holi in Mathura బృందావన్‌లో హోలీ సంబరం: 6రోజుల ఉత్సవం

ఉత్తర ప్రదేశ్‌లోని శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మథుర బృందావన్‌లో హోలీ సంబరాలు అంబరాన్నిఅంటాయి. బృందావన్‌లో ప్రముఖ దేవాలయం బన్కే-బీహారి దేవాలయంలో జరిగిన హోలీ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్లొన్నారు. ఒకరపై మరొకరు రంగులు చల్లుకుంటు హోలీ సంబరాల్లో మునిగి తేలారు. హోలీ పురష్కరించుకొని మథురలో ఆరు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.

Hi-Tech City Metro Rail on tracks from 4 PM today హైటెక్ సిటీ మెట్రో రైల్‌ను ప్రారంభించిన గవర్నర్

హైదరాబాద్ నగర వాసులకు నేటితో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్ పేట్-హైటెక్ సిటీ‌ మెట్రో రైల్‌ మార్గాన్ని గవర్నర్ నరసింహన్‌ అమీర్ పేట స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి లేకుండా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీంతో నాగోల్ నుండి శిల్పారామం వరకు ఉన్న కారిడార్ 3 మొత్తం 27 కిలో మీటర్లు అందుబాటులోకి రానుంది.  

అమీర్ పేట-హైటెక్ సిటీ మధ్య 10 కిలో మీటర్ల మార్గంలో మొత్తం 8 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ మెట్రో స్టేషన్ల మెట్రో రైలు ఆగదని, కొన్ని వారాల తర్వాత ఈ స్టేషన్ల లో మెట్రో ఆగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి 9 నుంచి 12 నిమిషాలకు ఓ మెట్రో రైలు అందుబాటులో ఉంటుందని, ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

రీల్ న్యూస్

మరింత +
Nagababu Joins in janasena Party to contest from Narsapuram Lok Sabha Constituency జనసేన: నర్సాపురం నుంచి నాగబాబు పోటీ

జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేరారు. ఆయన్ను కండువా కప్పి జనసేనాని పార్టీలోకి ఆహ్వనించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని పవన్ అన్నారు. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని చెప్పారు. నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు తనకు అవకాశం దక్కిందని నాగబాబు అన్నారు.

Beauty Pageant Winner Now an Army Officer, Netizens Go Gaga Over Lt. Garima Yadav’s Life Journey ఆర్మీ ఆఫీసర్‌గా మాజీ మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్

మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్- 2017 కిరీటాన్ని సొంతం చేసుకున్న గరిమా యాదవ్ ఆర్మీ ఆఫీసర్‌గా.. సైన్యంలో చేరి లెఫ్టినెంట్‌గా బాధ్యతలు స్వీకరించింది. న్యూఢిల్లీలో సెయింట్ స్టిఫెన్స్ కళాశాలలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన అనంతరం కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పరీక్షలో గరిమా ఉత్తీర్ణత సాధించారు. అనంతరం చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో చేరి శిక్షణ తీసుకుంది. సైన్యంలో చేరాలన్న పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టింది.

Dear Comrade Movie Teaser: Vijay Deverakonda’s lip lock scene with Rashmika Mandanna creates rage on social media డియర్ కామ్రేడ్ టీజర్‌లో విజయ్‌దేవరకొండ లిప్‌లాక్

యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన మరో చిత్రం డియర్‌ కామ్రేడ్‌. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ టీజర్‌ పై హిట్ టాక్ వస్తోంది. విళ్లీద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి, లిప్ లాక్ సీన్ గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతకు ముందు గీత గోవిందం మూవీలో విజయ్‌, రష్మిక జంటగా నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

జాతీయ వార్తలు

మరింత +
Arunachal Pradesh: Eight BJP MLAs, including two ministers, switch to National People’s Party అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి భారీ షాక్

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఒకేసారి ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు భాజపాను వీడి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలో చేరారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌ప్రదేశ్‌ను ప్రేమ్ ఖండు నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభతోపాటు..అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. వివిధ రకాల ఆరోపణలు, గెలిచే అవకాశాలులేని సిట్టింగ్‌లను బీజేపీ అధిష్ఠానం పక్కనపెట్టింది. దీంతో వీరందరు మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎన్‌పీపీ తీర్థం పుచ్చుకుని బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు.

Transgender Bharati Kannamma files nomination papers from Madhurai Lok Sabha seat మధురై నుంచి పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ భారతీ

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల బరిలో ఓ ట్రాన్స్‌జెండర్ దిగింది. తమిళనాడులోని మధురై పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ట్రాన్స్‌జెండర్ భారతీ కన్నమ్మ తెలిపింది. మధురై కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి ట్రాన్స్‌జెండర్ భారతీ కన్నమ్మ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. తోటి ట్రాన్స్‌జెండర్లతో ఊరేగింపుగా వెళ్లి భారతి తన నామినేషన్ వేసింది. మధురై పార్లమెంటు స్థానం నుంచి ట్రాన్స్‌జెండర్ ఎన్నికల బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

Goa: New CM Pramod Sawant’s coalition government to face floor test in Assembly today బలపరీక్షలో నెగ్గిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ఇవాళ జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. మనోహర్ పారికర్ వారసుడిగా గోవా సీఎం పీఠాన్ని అధిరోహించిన ఆయన తనకు సంపూర్ణ మద్దతు ఉందని నిరూపించారు. 

ప్రస్తుత లెక్కల ప్రకారం బీజేపీకి సొంతంగా మెజార్టీ లేకపోయినా మిత్ర పక్షాల మద్దతుతో అధికారాన్ని కొనసాగించేందుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ముందుగానే మిత్రపక్షాలతో బీజేపీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎంజీపీ, జీఎఫ్‌పీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. బీజేపీకి మద్దతిస్తున్న జీఎఫ్‌పీకి చెందిన విజయ్‌సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్‌ ధవలికర్‌లకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకుంది. అందువల్ల బల నిరూపణలో బీజేపీ నెగ్గే అవకాశాలున్నాయి.  

గోవా అసెంబ్లీలో సీట్ల సంఖ్య 40 కాగా, మనోహర్ పారికర్ మరణానికి ముందు 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మనోహర్ మరణంతో ఖాళీ స్థానాల సంఖ్య 4కు చేరింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా గత నెల్లో చనిపోయారు. అంతకుముందు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం గోవా అసెంబ్లీలో స్థానాల సంఖ్య 36కు చేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ కనీసం 19 స్థానాల్లో మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది.

క్రీడా వార్తలు

మరింత +
As Sreesanth gets reprieve from SC, here’s what happened in 2013 IPL spot-fixing scandal క్రికెటర్‌ శ్రీశాంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్‌ శ్రీశాంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. శ్రీశాంత్‌పై విధించిన బ్యాన్‌ను బీసీసీఐ పునఃసమీక్షించాలని ఆదేశించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం బీసీసీఐ క్రమశిక్షణ కమిటీని ఆదేశించింది. ఇటు కోర్టు తీర్పుపై శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను 30 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా ఫిట్‌నెస్‌గా ఉన్నానని.. బీసీసీఐపై తనకు నమ్మకం ఉందన్నాడు. తనకు మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాన్ని బీసీసీఐ కల్పించాలని శ్రీశాంత్ కోరాడు.

India vs Australia | India Suffer Series Loss Against Australia 5వ వన్డేలో ఓడి సిరీస్ చేజార్చుకున్న టీమ్ ఇండియా

ఐదు వన్డేల సిరీస్ ను 3-2తో ఆసీస్ కైవసం చేసుకుంది. పిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన చివరి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50ఓవర్లలో 9వికెట్లకు 272పరుగులు చేసింది. ఖవాజా సెంచరీ, హ్యాండ్స్ కాంబ్ అర్థ సెంచరీతో రాణించారు. అనంతరం 273పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తాకింది. ధావన్, కోహ్లీ, రిషబ్ పంత్, జడేజా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో రాణించినప్పటికీ చివరి వరకు నిలవలేకపోయాడు. ఇక చివర్లో భువనేశ్వర్ 46, కేదార్ జాదవ్ 44పరుగులతో రాణించినప్పటికీ విజయాన్ని అందించలేకపోయారు. దీంతో 50ఓవర్లలో భారత్ 237పరుగులకు ఆలౌట్ అయింది. సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో భారత్ గెలవగా చివరి మూడు వన్డేల్లో ఆసీస్ విజయం సాధించింది. దీంతో సీరిస్ ఆసీస్ సొంతమైంది.

India vs Australia, 5th ODI : Australia won toss and choose to Bat టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా

భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న ఐదో వన్డే మొదలైంది. ఈ చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు దేశాల జట్లు 2-2 పాయింట్లతో సమ ఉజ్జీగా ఉన్నా విషయం తెలిసిందే. సిరీస్ ను ఎలాగైనా దక్కించుకోవాలని ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నది. షాన్ మార్ష్ స్థానంలో స్టాయినిస్, బెహ్రండార్ఫ్ స్థానంలో నేథన్ లయన్ లను టీమ్‌లోకి తీసుకుంది. ఇటు టీమిండియా కూడా చాహల్ స్థానంలో జడేజా, రాహుల్ స్థానంలో షమిని టీమ్‌లోకి తీసుకుంది జట్టు.

అంతర్జాతీయం వార్తలు

మరింత +
Nirav Modi Arrested In London, To Be Produced In Court Shortly లండన్‌లో నీరవ్ మోడీ అరెస్ట్

బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్ లో అరెస్ట్ చేశారు. భారత్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండో రోజుల్లోనే నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యారు. 17నెలల క్రితం నీరవ్ మోడీ భారత్ ను విడిచి యూకేకు పారిపోయారు. అయితే గత ఏడాదే నీరవ్ ను అప్పగించాలని బ్రటిన్ ను భారత్ కోరింది. వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలతో నీరవ్ మోడీని అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయన్ని లండన్ కోర్టులో హాజరుపర్చనున్నారు.

Cyclone Idai: Fears for 500,000 people as 90% of Mozambique city destroyed, aid officials say ఇదాయ్ సైక్లోన్‌తో మొజాంబికా సిటీ అతలాకుతలం

ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్‌, జింబాంబ్వే, మలావిలను ఇదాయ్ సైక్లోన్ అతలాకుతలం చేస్తోంది. భారీవర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య ఈ మూడు దేశాల్లో 215 కు చేరింది. మొజాంబిక్‌లో ఇప్పటి వరకు 84 మంది మ‌ృతి చెందారని మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసి తెలిపారు. జింబాబ్వేలో 89, మాలవిలో 42 మంది మృతిచెందినట్టు అధికారులు ధృవీకరించారు. ఇంకా వరదల్లో వందాలాది గల్లంతైయ్యారు. వరద ప్రభావానికి మూడు దేశాల్లో కలిపి దాదాపు 1.3 మిలియన్ల నిరాశ్రయులయ్యారు. దీంతో ఆర్మీతో పాటు రెడ్‌క్రాస్‌, ఇతర స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో ముమ్మరంగ పాల్గొంటున్నాయి. ఇదాయ్ కారణంగా 53 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమతి వెల్లడించింది. మూడు దేశాలను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

21 soldiers killed in terrorist attack on army camp in Mali ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి:21 మంది సైనికులు మృతి

ఉగ్రవాదులు మాలిలో మరోసారి రెచ్చిపోయారు. మధ్య మాలిలోని ఓ సైనిక స్థావరంపై కొంత మంది ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. బైకులు, కార్లలో వచ్చిన దుండగులు దియౌరాలోని ఆర్మీ క్యాంపుపై ఒక్కసారిగా కాల్పులకు దిగారని స్థానిక అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో 21 మంది సైనికులు చనిపోయినట్లు అక్కడి సైనిక వర్గాలు ప్రకటించాయి. ఓ మాజీ సైనికాధికారి నేతృత్వంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే దాడికి తెగబడినట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశప్రజలంతా ఏకమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్‌ కీట పిలుపునిచ్చారు.  

గత కొన్ని సంవత్సరాలుగా మాలిలో ఐసిస్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. 2012లో వీరు ఉత్తర ప్రాంతంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ 2013లో ఫ్రెంచ్‌ బలగాలు వారిని తరిమికొట్టాయి. అనంతరం ఐరాస అక్కడ శాంతి పరిరక్షక దళాల్ని మొహరించింది. భారీ సంఖ్యలో ఫ్రెంచ్‌ భద్రతా బలగాలు సైతం ఇక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 2015లో మాలి ప్రభుత్వానికి తీవ్రవాద ముఠాలకు మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ హింసాత్మక ఘటనలు మాత్రం ఆగడం లేదు.

డెస్క్ నుండి

భువనగిరిలో ఎంపీ రేసులో మాస్ లీడర్ కోమటిరెడ్డి

భువనగిరి పార్లమెంట్ స్థానం పై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈసారి భువనగిరి స్థానం నుండి పోటీకి రెడీ అయ్యారు. లోక్‌సభ పరిధి లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నాయి. ఇక మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాల్లో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉన్న ఆదరణ కాంగ్రెస్‌ గెలుపుకు కలిసివచ్చేలా ఉన్నాయి.  

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ స్థానం కోసం పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారు అయ్యారు. పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిద్ధమయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగాం, ఇబ్రంహీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపకొని 2009 లో కొత్తగా ఈ లోక్ సభ స్థానం ఏర్పడింది. మొదటి సారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. యువకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు.  

ఈసారి కూడా భువనగిరి నుంచి సిట్టింగ్ ఎంపీగా బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీకి రెడీ అయ్యారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉంది. ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న మాజీమంత్రి కోమటిరెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాస్ లీడర్ గా జిల్లా వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. దానికితోడు గతంలో ఎంపీగా పనిచేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ అలాగే ఉంది. ఇద్దరు సోదరులకు జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ ఉంది.  

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతూనే ఉంది. తొలిసారి 2009 ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి భారీ విజయం సాధించగా.. నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. నాలుగు సార్లు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘకాలం మినిస్టర్‌గా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు ఒకవైపు ఫ్లోరైడ్ తో , మరో వైపు కరువు తో అల్లాడిపోతున్న జనం గోస చూసి చలించి నాటి ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్సార్ తో కొట్లాడి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఉదయసముద్రం నుండి ఎత్తిపోతల ద్వారా సుమారు లక్ష ఎకరాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది.  

ఇటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ సింహంలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ పోరాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం వెంకట్ రెడ్డి తృణప్రాయంగా వదులుకున్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్గొండలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. 1999 నుంచి వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోమటిరెడ్డి గెలుస్తూ వచ్చారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో మంచి అనుబంధం, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు.  

ఎదిగిన కుమారుడు ప్రమాదంలో మరణించడం వెంకట్ రెడ్డికి జీవితంలో మరిచిపోలేని బాధను విగిల్చింది. అలాంటి బాధను మరెవరూ అనుభవించరాదని ఆ తర్వాత కాలంలో ఆయన కుమారుడు ప్రతీక్ పేరుతో ఫౌండేషన్ స్థాపించారు. 2012 ప్రతీక్‌ రెడ్డి మరణానంతరం కోమటి రెడ్డి ప్రతీక్‌ మెమోరియల్‌ ప్రభుత్వ జూనియర్‌ బాలుర కళాశాలగా మార్చారు. 3.5 కోట్లను వెచ్చించి బాలికల వొకేష్‌నల్‌ జూనియర్‌ కళాశాలను పుననర్నిర్మాన పనులు చేపట్టారు. ఫౌండేషన్ తరఫున ప్రతిఏటా టాపర్స్‌కు బంగారు పతకాలు, నగదు ప్రోత్సాహకాలు, జాబ్‌ మేళాలు, నిరుద్యోగులకు ఉపాది కల్పన, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి వైద్య, రక్తదాన సేవలనందించటం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపడుతున్నారు.  

భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పనిచేసిన కాలంలో మూసీ పరివాహక ప్రాంతానికి సాగు నీరందించడానికి బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువలను తీసుకొచ్చారు. ప్రభుత్వం నుండి సరైన నిదులు విడుదలకానపుడు తన సొంత నిధులతో కాలువల పనులు చేయించి రైతులను ఆదుకున్నారు. తన తల్లి సుశీలమ్మ పేరుమీద జనగామలో కార్పోరేట్ స్థాయిలో కోట్ల రూపాయలు వెచ్చించి వ్రుద్దాశ్రమం కట్టిస్తున్నారు. ఇద్దరు బ్రదర్స్ ఒక వైపు రాజకీయాలలో ఉంటూనే సామాజిక కోణంలో ఎంతో మందికి జిల్లా వ్యాప్తంగా సహాయం చేశారు చేస్తున్నారు. ప్రాంతం, నియోజకవర్గం అనే తేడా లేకుండా ఆపద ఉన్నవారిని అక్కున చేర్చుకుని సహాయం అందిస్తున్నారు.  

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిదిలోని మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలలో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే నాలుగు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండడం ఈసారి కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం. మరో వైపు టీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న సిట్టింగ్ ఎంపి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ కు స్థానికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు సరైన సఖ్యత లేకపోవడం కూడా ఈసారి కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.  

ఏది ఏమైనా మంత్రిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, తెలంగాణా ఉద్యమంలో ప్రత్యేక రాష్టం కోసం మంత్రి పదవిని సైతం వదలుకున్నారనే పేరును కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ప్రజలతో మమేకమై మాస్ లీడర్ గా పేరుండడం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఇవన్నీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కలిసొచ్చేఅంశాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇంకా చదవండి1 Days Ago
ప్రజాస్వామ్య భారతంలో 17వ లోక్‌సభ నిర్మాణం

ఓట్ల పండగ వచ్చేస్తోంది. రాజకీయ పార్టీల హడావుడి, రంగురంగుల జెండాలు, హోరెత్తించే ప్రచారాలతో ఎన్నికల పండగ సంతరించుకుంది. ప్రపంచంలో మరే దేశంతోనూ పోల్చడానికి వీల్లేని విధంగా మన పార్లమెంటు ఎన్నికలు ఎప్పటికప్పుడు కొత్త పోకడలు పోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా సాగుతూ వచ్చిన ఎన్నికల ప్రక్రియ 17 లోక్‌సభ నిర్మాణం కోసం మరో అడుగు వేయబోతోంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో తొంభై కోట్ల మంది ఓటర్లు తమ నేతలను ఎన్నుకోవడానికి రంగం సిద్ధమయింది.  
మొదటి సార్వత్రిక ఎన్నికలు..
తొలి ఎన్నికల నుంచే నిర్దిష్టమైన అవగాహనతో, ప్రజాస్వామిక స్ఫూర్తితో ముందడుగు వేసిన భారతావని ప్రపంచంలో ఏ దేశం చేయని సాహసం చేసింది. తొలి ప్రయత్నంలోనే వయసు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి ఓటు వేసే హక్కును కల్పించింది. 1951లో జరిగిన తొలి ఎన్నికలతో మొదలైన ఎన్నికల ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ 1951 అక్టోబర్‌ నుంచి 1952 ఫిబ్రవరి వరకు నాలుగు నెలల పాటు కొనసాగింది.  
ఎమర్జెన్సీ పీరియడ్ లో కూడా...
అప్పట్నుంచి 2014 వరకు మొత్తం పదహారు సార్లు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసన సభలకు కూడా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంత వరకు దేశంలోని 29 రాష్ట్రాల్లో మొత్తం 357 సార్లు శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఒక్కోసారి అత్యంత ప్రముఖులను కూడా ఓడించి ఇంటి దారి పట్టించారు. మరికొన్ని సార్లు అనామకులకు కూడా అఖండ విజయం కట్టబెట్టారు. 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి, పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో జరిగిన యుద్ధాలతోనూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎటువంటి విఘాతం కలగలేదు.  
130 కోట్ల మంది జనాభాలో... 
ప్రజాస్వామ్య భారతంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బృహత్తర కార్యక్రమం. దాదాపు 130 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది ఓటర్లు.. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 543 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ భారీ వ్యయ ప్రయాసలు, మానవ వనరులతో కూడుకొన్నది. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు అమలు అయ్యాయి. మొదటి ఎన్నికల సమయంలో దేశ జనాభా 36 కోట్లు. వారిలో 17.30 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.  
ఒక్క భారత దేశమే...
అప్పట్లో పార్లమెంటులో 489 సీట్లు ఉండేవి. కాలక్రమంలో దేశంలో రాష్ట్రాల సంఖ్య పెరగడం, దానికి అనుగుణంగా పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగడంతో ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియలో అవసరమైన మార్పులు చేస్తూ వస్తోంది. ఎలాంటి బేధం చూపకుండా నిర్దిష్ట వయస్సు వచ్చిన వారందరికీ ఒకే సారి ఓటు హక్కు కల్పించింది ప్రపంచంలో ఒక్క భారత దేశమే. చాలా దేశాలు మొదట ధనికులకు, తర్వాత విద్యావంతులకు ఇలా దశల వారీగా పౌరులకు ఓటు హక్కు కల్పించాయి. ఆయా దేశాల్లో మహిళలకయితే దశాబ్దాలు పోరాడితే కాని ఓటు హక్కు రాలేదు.  
73వ రాజ్యాంగ సవరణతో...
ప్రజలందరికీ అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు కొన్ని నియోజకవర్గాలను ప్రత్యేకించడం భారత్‌లోనే జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తింపచేశారు. పరాయివాళ్లకి ముఖం చూపించడానికి ఇష్టపడని, తమ పేరు చెప్పడానికి ముందుకురాని మహిళలను ఓటర్ల జాబితాలో చేర్చడం దగ్గర నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను ప్రవేశపెట్టడం వరకు ఈ 70 ఏళ్లలో పటిష్టమైన దేశ ప్రజాస్వామిక సౌధాన్ని నిర్మిస్తూ వస్తున్నాం.  
ప్రతి ఐదేళ్లకోసారి...
అయితే రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి పార్లమెంటుకు, శాసన సభలకు ఎన్నికలు నిర్వహిస్తూ భారతదేశం ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఓటరు నమోదు నుంచి మొదలు పెట్టి ఎన్నికల అక్రమాలను గుర్తించడం, సకాలంలో నివారించడం, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించడం, ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తతతో వ్యవహరించడం ఎన్నికల సంఘం సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.  
గత ఏడు దశాబ్దాలుగా... 
మనతో పాటే స్వాతంత్య్రం పొందిన పాకిస్తాన్‌ అనతి కాలంలోనే ప్రజాస్వామ్యం నుంచి సైనిక పాలనకు మళ్లిపోయింది. ప్రజాస్వామ్యం అక్కడ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. అలాగే, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో కూడా ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగడం లేదు. మన దేశంలో గత ఏడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇంకా చదవండి9 Days Ago
పంచాయతీ రాజ్ చట్టం 2018: జిల్లా పరిషత్తులకు అధికారాలు

తెలంగాణలో కొత్తగా తీసుకువచ్చిన పంచాయతీ రాజ్ చట్టం -2018 పై ఆసక్తి పెరుగుతోంది. చట్టంతో కొత్త నిబంధనలను అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో జడ్పీ స్థానాల సంఖ్య 9 నుంచి 32 చేరనుంది. దీంతో త్వరలో పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో కొత్త నిబంధనల ప్రకారం పాలకమండళ్లు ఏర్పాటు కానున్నాయి. అయితే కొత్త చట్టం ప్రకారం జిల్లా పరిషత్‌ సమావేశాలను ఇక ప్రతి మూడు నెలలకు కనీసం ఒకసారైనా కచ్చితంగా నిర్వహించి తీరాలి. లేదంటే జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి ఊడినట్టేనని చట్టంలో పొందుపరిచారు. అంతేకాకుండా మరో ఏడాది పాటు ఛైర్‌పర్సన్‌గా ఎన్నిక కాకుండా అనర్హత వేటునూ ఎదుర్కొనే అవకాశం ఉంది.  

ప్రతి 90 రోజుల వ్యవధిలో ఒకసారైనా జడ్పీ సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించాలి. ఒకవేళ సమావేశాన్ని నిర్వహించకుంటే మరో 30 రోజుల సమయం ఇస్తారు. అప్పటికీ ఛైర్‌పర్సన్‌ ఉదాసీనంగా ఉన్నట్టు తేలితే కలెక్టర్‌ చర్యలకు ఉపక్రమిస్తారు. సమావేశాన్ని నిర్వహించటంలో విఫలమైనందుకు ఛైర్‌పర్సన్‌ తన పదవిని కోల్పోవడంతో పాటు మరో ఏడాది పాటు ఆ పదవి చేపట్టేందుకు అర్హత ఉండదు. మరోవైపు జిల్లా పరిషత్‌ ఎన్నికలను పార్టీ ప్రాతిపాదిక నిర్వహిస్తారు. ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక సమయంలో ఆయా పార్టీలు జారీచేసే విప్‌ను ఎవరైనా సభ్యులు వ్యతిరేకిస్తే వారి పదవులు పోతాయి. అలా ఏర్పడే ఖాళీలను సాధారణ ఖాళీలుగా పరిగణించి 6 నెలల్లోగా ఎన్నికలను నిర్వహించనున్నట్టు చట్టం చెబుతోంది.  

చట్టం ప్రకారం జిల్లా పరిషత్‌లో కొత్త అధికారాలనూ అప్పగించింది. ఉపాధి హామీ కింద మండలాల వారీగా రూపొందించే బడ్జెట్ల ఆధారంగా పనులను జడ్పీ పర్యవేక్షించే అధికారం కల్పించింది. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలను ఇస్తున్న తీరును, అక్కడి స్వయం ఉపాధి, జీవనోపాధి పథకాల అమలును పరిశీలించే అధికారం అప్పగించనున్నారు. అంకుర కంపెనీలు, మధ్య, చిన్న, సూక్ష తరహా పరిశ్రమల ఏర్పాటును పర్యవేక్షించవచ్చు. జడ్పీలకు నిధులు ఏయే మార్గాల్లో వచ్చేది పంచాయతీరాజ్‌ చట్టం వెల్లడించింది. ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్‌లపై విధించే రుసుములు, ప్రభుత్వం ఏటా ఇచ్చే తలసరి గ్రాంటు జడ్పీలకు ఆదాయ వనరులుగా నిలవనున్నాయి.

ఇంకా చదవండి15 Days Ago
యుద్ధరంగంలోకి మన సైన్యం అడుగుపెడితే...!

భూమైనా..? ఆకాశమైనా..? సముద్రమార్గమైనా..? పవర్‌ఫుల్ మిసైల్స్, వండర్ గన్స్, అపాచీ హెలికాఫ్టర్స్..! ఒక్కటేంటి..? హైటెక్ టెక్నాలజీకి అనుగుణంగా ఆసియాలోనే సూపర్ పవర్‌గా ఎదిగింది ఇండియన్ ఆర్మీ. అమ్ములపొదిలో అస్త్రాల భాండాగారాన్ని నింపుకుంది. బోర్డర్‌లో శత్రుదేశాల చొరబాట్లు, అలజడులకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది.  

భారత సైన్యం చేతుల్లో అధునాతన అస్త్రాలున్నాయి. యుద్ధరంగంలోకి మన సైన్యం అడుగుపెడితే విజయం తథ్యమే. అందుకే ఎప్పుడైనా..? ఏక్షణమైనా..? సమరానికి సిద్ధమంటోంది భారత్. ఇండియన్‌ ఆర్మీ గురించి, ఆయుధ సామాగ్రి గురించి ఇన్నాళ్లు ఇష్టమొచ్చినట్లు వాగిన చైనా, పాక్‌లకు చుక్కలు చూపిస్తోంది. భారతదేశం పేరు తలుచుకోవాలన్నా భయపడేంతగా సైన్యం ధృడంగా ఎదిగింది.  

పుల్వామా ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే అనేకసార్లు ఇటు పాకిస్థాన్, అటు చైనా దేశాలు చొరబాటుకు యత్నిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత సైన్యం సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దీంతో ఏ క్షణమైనా శత్రుదేశం దుందుడుకు చర్యలకు దిగే అవకాశం ఉంది. వాటికి ధీటుగానే సమధానమివ్వగల సత్తా మన సైన్యానికి ఉంది. భారత వాయు, నౌక, మిలిటరీ సైన్యాలు రోజురోజుకు శక్తివంతంగా మారుతున్నాయి.  

అదరగొట్టే అపాచీ హెలికాప్టర్స్ ఆసియాలోనే సూపర్ పవర్ ఆర్మీని తన సొంతం చేసుకుంది భారత సైన్యం. శత్రువుల దూకుడుకు కళ్ళెం వేసి చైనా, పాక్‌కు చుక్కలు చూపించేందుకు సిద్ధంగా ఉంది. బోర్డర్‌లో ఎలాంటి కదలిక వచ్చినా ఒక్క మిసైల్‌తో అలజడికి చెక్ పెట్టేందుకు అవసరమైన అన్ని ఆయుధాలను తన అమ్ములపొదిలో భద్రంగా ఉంచింది. అగ్రరాజ్యం అమెరికాకు సైతం లేని ఎన్నో ఆయుధాలు తన దగ్గర పదిలంగా దాచుకుని టైగర్ ఇండియా గర్జిస్తోంది.  

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ఆర్మీ కల నెరవేరబోతోంది. ఉపరితల నుంచి గాలిలోకి ప్రయోగించే అత్యాధునిక మధ్యతరహా క్షిపణులు 2020 నాటికి సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా క్షిపణుల సాయంతో 70 కిలోమీట్లర పరిధిలోని బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను సూనాయాసంగా ఛేదించవచ్చు. భార‌త ఆర్మీ అమ్ముల‌పొది మ‌రింత బ‌ల‌ప‌డ‌నుంది. అమెరికాకు చెందిన యుద్ధ ఆయుధాలు ఇప్పుడు భార‌త ఆర్మీలో చేరాయి. M777 అల్ట్రా లైట్ గ‌న్స్ ఆర్మీ బాండాగారంలోకి వచ్చాయి.  

దేశంలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మానవ వనరులు అపారంగా ఉన్నాయి. భారత రక్షణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తూ అత్యంత శక్తివంతమైన మిసైల్స్‌, యుద్ద ట్యాంకర్లను రక్షణ రంగ సంస్థలు BDL, మిథానీ సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. భారతీయులు విదేశాల్లోనూ తమ సేవలను అందిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రక్షణ రంగంలోనూ వినియోగిస్తున్నారు.

ఇంకా చదవండి21 Days Ago
తెలంగాణ-2019: మంత్రివర్గంలోని మంత్రుల ప్రస్థానం..

1. ఈటల రాజేందర్...  

ఈటల రాజేందర్.. టీఆర్ఎస్‌లో అతి ముఖ్యమైన నేతల్లో ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న ఈటల టీఆర్ఎస్‌లో తనదైన శైలిలో స్పెషల్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నారు. తొలిసారి 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో హుజురాబాద్ నుంచి విజయాన్ని అందుకున్నారు. అనంతరం 2010లో రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో కూడా గెలుపొందారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోను తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 1964 మార్చి 20న కరీంనగర్‌లో ఈటెల రాజేందర్ జన్మించారు. 14 ఏళ్లలో ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన అతికొద్ది మంది నేతల్లో ఈటల కూడా ఒకరుగా నిలిచారు. 2008లో టీఆర్ఎస్ తరుపున అసెంబ్లీలో ఎల్పీ లీడర్‌గా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు అసెంబ్లీలో పార్టీ ఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలో ఈటల రాజేందర్ ముందుండి నిలిచారు. అన్ని పార్టీలను ఏకం చేయడంలో విజయం సాధించారు.ఇటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ఆర్ధిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తూనీకలు కొలతలు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండోసారి కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ దక్కడంతో ఈటెలకు ఏ శాఖ అప్పగిస్తారనే దానిపై అందరిలోను ఉత్కంఠ నెలకొంది. 

2. సీహెచ్ మల్లారెడ్డి...

మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న మల్లారెడ్డి అసెంబ్లీకి కూడా తొలిసారి ఎన్నిక అయ్యారు. 2014లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మల్లారెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ తరుపున గెలిచిన ఏకైక ఎంపీగా మల్లారెడ్డి రికార్డు సాధించారు. ఆ తరువాత 2016లో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.2018 ఎన్నికల్లో అనూహ్యంగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి 87వేల 900 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. అనంతరం ఎంపీ పదవీకి రాజీనామా చేశారు. 1953 సెప్టెంబర్ 9న మల్లారెడ్డి హైదరాబాద్‌లో జన్మించారు. అయితే మల్లారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల పేరుతో అనేక కాలేజీలను ఏర్పాటు చేశారు.అర్ధబలం, అంగబలం ఉన్న మల్లారెడ్డి మేడ్చల్‌లో బలమైన నేతగా ఎదిగారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మల్లారెడ్డికి కేసీఆర్ కెబినెట్‌లో బెర్త్ దక్కినట్లుగా తెలుస్తోంది. ఇటు కేసీఆర్‌, కేటీఆర్‌కు మల్లారెడ్డి అత్యంత సన్నిహితుడని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 

3. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కేసీఆర్ కేబినెట్‌లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బెర్త్ దక్కించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డిపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో చిన్నారెడ్డి చేతిలో ఓడిపోయిన నిరంజన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం తొలి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. వనపర్తిలో 1958 అక్టోబర్ 4న జన్మించారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిరంజన్ రెడ్డి బలమైన లీడర్‌గా ఎదిగారు. 1995 పీఏసీ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆ తరువాత 1999లో ఆంధ్ర ప్రదేశ్ ఖాదీ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్‌గా ఉన్నారు. 2001 నుంచి కేసీఆర్ వెంట ఉండి.. టీఆర్ఎస్‌లో వివిధ పదవులు అధిరోహించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కొన్ని సమీకరణాల ద్వారా మంత్రి వర్గంలో నిరంజన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న ఆయన సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. పార్టీలోను, ప్రభుత్వంలోను నిరంజన్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటాడని.. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాని నేతలు చెబుతున్నారు.

4. ఇంద్రకరణ్ రెడ్డి... 

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మెస్ట్ సక్సెస్‌ఫుల్ పొలిటిషన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి మంత్రి పదవి చెపడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ విజయం సాధించారు. ప్రత్యర్ధి మహేశ్వర్ రెడ్డిపై 9వేల 271 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన 2014 ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి విక్టరీ కొట్టారు. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరి సీఎం కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టారు. దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1949 ఫిబ్రవరి 16వ తేదీన చిన్నమ్మ - నారాయణ రెడ్డి దంపతులకు ఇంద్రకరణ్ రెడ్డి జన్మించారు. నిజామాబాద్ లోని గిరిరాజ కాలేజీ నుంచి బీకాం పట్టా అందుకున్న ఇంద్రకరణ్.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 1980 రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన.. 1987లో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1991లో తొలిసారి ఆదిలాబాద్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున పార్లమెంట్‌లోకి అడుగు పెట్టారు. ఆ తరువాత వరుసగా 1999, 2004 లో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగి గెలిచారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి నిలిచారు. ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేతగా ఇంద్రకరణ్ రెడ్డికి మంచి పేరు ఉంది. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు వరుసగా గెలిపిస్తూ వచ్చారు. అంతే కాకుండా అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారనే నమ్మకంతో సీఎం కేసీఆర్.. రెండోసారి ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇటు జిల్లాలో ఇతర నేతల నుంచి గట్టి పోటీ ఉన్నా.. సీనియర్ లీడర్‌గా అల్లోలనే మంత్రి పదవీ వరించింది. 

5. జగదీష్ రెడ్డి... 

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వరుసగా రెండోసారి సీఎం కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన జగదీష్ రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో ఎడ్యుకేషన్, విద్యుత్, షెడ్యూల్డ్ క్యాస్ట్ శాఖలను నిర్వర్తించారు. 1965లో సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలంలోని నాగారం గ్రామంలో రామచంద్రారెడ్డి, సావిత్రి దంపతులు జన్మించారు. 2001లో తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న జగదీష్ రెడ్డి... తొలిసారి 2009 ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో బరిలో నిలిచి విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపించడంతో పాటు.. ప్రభుత్వంలోను కీలక పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న జగదీష్ రెడ్డి.. మరోసారి మంత్రి పదవీ సంపాదించారు. రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

6. కొప్పుల ఈశ్వర్...

కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కూడా కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవీ దక్కించుకున్నారు. 1959 జనవరి 20న గోదావరి ఖనిలో జన్మించిన కొప్పుల బీఏ వరకు చదివారు. సింగరేణి కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన.. సింగరేణి కార్మిక సంఘాల నేతగా నిలిచారు. 2004లో తొలిసారి మేడారం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో మళ్ళీ తెరాస తరఫున ధర్మపురి నుంచి గెలిచి నిలిచారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల సమయంలోనే కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవీ ఖాయం అని జిల్లాలో జోరుగా చర్చ సాగింది. అందరూ అనుకున్నట్లుగా ఈసారి మంత్రి వర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ ప్రారంభం నుంచి టీఆర్ఎస్‌లోనే ఉన్న కొప్పులకు ఎన్నేళ్లకు మంత్రి పదవీ వరించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. 

7. ఎర్రబెల్లి దయాకర్ రావు...

ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన అతికొద్ది లీడర్లలో ఒకరిగా నిలిచారు. వరంగల్ జిల్లాలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్లలో ముందు వరుసలో ఉన్న ఎర్రబెల్లి దాయాకర్ రావు కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. అంతకు ముందు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఈసారి అసెంబ్లీలో మోస్ట్ సీనియర్ లీడర్లలో ఒకరిగా ఎర్రబెల్లి దాయకర్ రావు నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్పూర్తితో 1980లో రాజకీయాల్లోకి దయాకర్ రావు అడుగు పెట్టారు. 1983లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1987లో వరంగల్ డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి టీడీపీ తరుపున పొటీ చేసి గెలిచారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 2008లో జరిగిన పార్లమెంట్ బై ఎలక్షన్స్‌లో సిట్టింగ్ ఎంపీ రవీంద్ర నాయక్‌ను ఓడించి ఎంపీగా తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి కాకుండా పాలకుర్తి నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. 2014, 18 ఎన్నికల్లోను గ్రాండ్ విక్టరీ కొట్టారు. వరంగల్ జిల్లాకు చెందిన పర్వతగిరిలో జగన్నాథరావు, ఆదిలక్ష్మీ దంపతులకు 1956 ఆగస్టు 15న ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మించారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే వ్యక్తిగా ఎర్రబెల్లి దాయకర్ రావుకు వరంగల్ జిల్లాలో మంచి పేరు ఉంది. టీడీపీతో రాజకీయ జీవితం మొదలు పెట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు 2016లో బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొన్ని సమీకరణాల వల్ల ఈసారి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. 

8. శ్రీనివాస్ గౌడ్‌...

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌ తొలిసారి మంత్రి పదవి చెపబుతున్నారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. మహబూబ్ నగర్ నుంచి పోటి చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత 2018లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కోటాలో శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి దక్కింది. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీనివాస్ గౌడ్ చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. దాంతో పాటు టీ జేఏసీ కో చైర్మన్‌గా ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ 1969 మార్చి 16న మహబూబ్ నగర్ జిల్లా రాచాల గ్రామంలో జన్మించారు. బీఎస్సీ పీజీడీసీజే పూర్తి చేసి 1998లో ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. 

9. తలసాని శ్రీనివాస్ యాదవ్...

మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు మరోసారి రెడీ అయ్యారు తలసాని శ్రీనివాస్ యాదవ్. 2018లో సిట్టింగ్ స్థానం సనత్ నగర్ నుంచి గెలుపొందిన ఆయన గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కమర్షియల్ ట్యాక్సెస్, సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత ఫిషరీస్, డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ శాఖలను నిర్వహించారు. 1965 అక్టోబర్ 6న సికింద్రాబాద్‌లో జన్మించిన తలసాని.. హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యమైన నాయకుల్లో ఒకరిగా నిలిచారు. మొదట సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున బరిలోకి దిగి 1994 ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన ఆయన 1999 ఎన్నికల్లోను విజయం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో టీడీపీ తరుపున సనత్ నగర్ నుంచి పోటీ చేసి విక్టరీ కొట్టారు. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలోకి చేరి మంత్రి పదవీ సంపాదించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ 1995లో తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. చంద్రబాబు కేబినెట్‌లో లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో టూరిజం, కల్చరర్ శాఖ మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్‌లో చేరిన తరువాత కూడా మంత్రి పదవీ దక్కించుకున్నారు. 

10. వేముల ప్రశాంత్ రెడ్డి...

నిజామాబాద్ నుంచి కేబినెట్‌లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. 2014లో తొలిసారి బాల్కొండ నుంచి పోటీ చేసిన ప్రశాంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు సన్నిహితుడనే పేరుంది. అంతే కాకుండా జిల్లాలో ప్రశాంత్ రెడ్డికి బలమైన వర్గం ఉండటంతో పాటు.. నిత్యం ప్రజల్లో ఉంటాడనే మంచి పేరు కూడా ఉంది. ఎన్నికల సమయంలోనే ప్రశాంత్ రెడ్డికి ఈసారి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు నిజం అయ్యాయి.

ఇంకా చదవండి29 Days Ago
రోజుకు 150ml కంటే ఎక్కువ మద్యం తాగితే మీ కాలేయం పాడవుతున్నట్టే!

మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన మద్యపానం కాలేయ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఆసుపత్రికి వస్తున్న వారిలో ఈ తరహా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాలేయం పూర్తిగా చెడిపోయి మార్పిడి కోసం ఒక్క ఉస్మానియాలోనే 100 మందికి పైగా రోగులు ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. వీరిలో 60 శాతం మంది మితిమీరిన మద్యాపానంతోనే ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. గాంధీ, నిమ్స్‌ ఆసుపత్రుల్లోనూ ఈ తరహా బాధితుల సంఖ్య ఎక్కువే.  

నగరమంటే ఉరుకులు పరుగుల జీవితం. ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. అధిక కొవ్వుతో కూడిన ఆహారం ఎక్కువ మంది తీసుకుంటున్నారు. చాలామంది స్నేహితులతో సరదాగా ప్రారంభిస్తున్న మద్యపానం అలవాటు క్రమంగా వ్యసనంగా తయారవుతోంది. కొన్నాళ్ల తర్వాత ఆ ప్రభావం కాలేయంపై పడుతోంది. ప్రస్తుతం కాలేయ వ్యాధితో చికిత్స పొందుతున్న వారిలో 40నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న వారే అధిక సంఖ్యలో ఉంటున్నారు.  

కాలేయ సమస్యను ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతో నయమవుతుంది. కానీ, చాలామంది పరిస్థితి చేజారిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారు.అధిక మద్యపానం, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేమి ఇత్యాది కారణాల వల్ల తొలుత ఫ్యాటీలివర్‌గా మారుతుంది. నిర్లక్ష్యం చేస్తే హెపటైటిస్‌ అనంతరం క్రానిక్‌ హెపటైటిస్‌ చివరి దశలో సిరోసిస్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ స్థాయిలో కాలేయ మార్పిడి ఒక్కటే శరణ్యం. అవయవ దాత లభించడంతో పాటు కాలేయం మార్చాలంటే తక్కువలో తక్కువ 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తర్వాత మందుల కోసం నెలకు మరో 20 వేల వరకు అవసరం. ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది ఇంత డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.  

ఒక వ్యక్తి నిత్యం 150-180 మిల్లీలీటర్ల మద్యం తీసుకున్నారంటే అతని ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. మద్యంతో కాలేయం కచ్చితంగా దెబ్బ తింటుంది. ప్రస్తుతం వైద్యం కోసం వస్తున్న బాధితుల్లో 60 శాతం ఈ తరహా కేసులే ఉంటున్నాయి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, అపరిశుభ్ర నీరు, ఆహారం, హెపటైటిస్‌-బి, సి కూడా కాలేయంపై ప్రభావం చూపుతాయి. మిగతా అవయవాల కంటే కాలేయం ప్రత్యేకమైనది. కొంతభాగం కోల్పోయినా మళ్లీ పుంజుకుంటుంది. కానీ అదే పనిగా కాలేయానికి ఇబ్బంది కలిగితే మాత్రం మొరాయించి పనిచేయడం మానేస్తుంది.  

ఆల్కాహాల్‌ తీసుకొని మంచిగా భోజనం చేస్తే కాలేయానికి ఏమీ కాదనేది అపోహ మాత్రమే. మద్యపానంతో కాలేయమే కాకుండా క్లోమగ్రంథి దెబ్బ తింటుంది. శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయడంలో కాలేయానిదే కీలక పాత్ర. కడుపులో నొప్పి, రక్తంతో కూడిన వాంతులు, కామెర్లు, నలుపు రంగులో మలవిసర్జన, ఆకలి లేకపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటె కాలేయ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. కాలేయ సమస్యలు ఉన్న వారికి బతికున్న వ్యక్తులు కొంత భాగం దానం చేయవచ్చు. దాతల నుంచి 30 శాతం కాలేయాన్ని తీసి పాడైన వారికి అమర్చుతారు. దాతకు 3 నుంచి 6 నెలల్లో కాలేయం తిరిగి పూర్వ స్థితికి చేరుతుంది.  

అనారోగ్యం కొని తెచుకుంటున్న పద్దతులకు వెంటనే స్వస్థి పలకడం మంచిది. ఇప్పటికే కలుషిత ఆహారం, కలుషిత నీరు, కలుషిత పర్యావరణం అన్ని కాలిసి మనిషి ఆయుష్షుని వేగంగా తగించేస్తున్నాయి. దీనికి తోడు చెడు వ్యాసనాలు కూడా ఉంటే ఇంకా త్వరగా జీవితం ముగిసిపోతుంది. అందుకే ఆరోగ్యానికి కీడు చేసే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇంకా చదవండి36 Days Ago
భరత్ దాడి: మృత్యువుతో పోరాడుతున్న మధులిక

తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ వ్యవహారంలో దాడులు రోజురోజుకు మితిమిరిపోతున్నాయి. బర్కత్‌పురలో ప్రేమించట్లేదనే కోపంతో యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడితో యువతి తీవ్రంగా గాయపడి మృత్యువతో పోరాడుతోంది. ఇటు దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

బర్కత్‌పురాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించట్లేదనే కోపంతో మధులిక అనే యువతిపై భరత్ అనే యువకుడు కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశారు. గత కొంత కాలంగా ప్రేమించాలంటూ మధులికను భరత్ వేధింపులకు గురి చేస్తున్నాడు. అయినా మధులిక ఒప్పుకోకపోవడంతో.. తనకు కానిది మరొకరికి దక్కొద్దనే కోపంతో కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ దాడితో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.  

భరత్ దాడిలో గాయపడిన యువతి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువకుడి దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. యశోద ఆసుపత్కి డాక్టర్లు మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సుమారు 14, 15 సార్లు దాడి చేసినట్లుగా గాయాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం పేషెంట్‌ను వెంటిలేటర్ పై వుంచామని.. 48 నుంచి 72 గంటలు దాటితేనే ఏమైనా చెప్పగలమని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  

తన కూతురి పై దాడి చేసిన భారత్ ను కఠినంగా శిక్షించాలని మధులిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు. అల్లారు ముందుగా చేసుకున్న తన కితురి పై దాడి దారుణం అని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రావొదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు అంటే ప్రేమోన్మాది భారత్ కు కచ్చితంగా ఉరిశిక్ష వేయాలని మధులిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  

ప్రస్తుతంఈ ఘటనకు పాల్పడ్డ భరత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసి ఇంట్లో కత్తి పడేసి మూసి నది దగ్గరకి వెల్లాడు భరత్. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా మధులికను భరత్ ఇదే తరహాలో వేధిస్తే షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు యువతి బంధువులు. దీంతో పోలీసులు ఇరువురుని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఆ తర్వాత కూడా భరత్ లో ఎలాంటి మార్పూ కనిపించలేదు. రెండు రోజుల క్రితమే మధులిక పై దాడి చేసేందుకు ప్లాన్ చేసుకుని కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు. మధులిక స్పృహలోకి వచ్చాక స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తామని డీసీపీ రమేష్ రెడ్డి చెప్పారు.  

ప్రేమ పేరుతో నిత్యం అమ్మాయిలుకు వేధింపులు తప్పడం లేదు. కొంత మంది పైశాచికంగా ఆలోచించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని.. నిందుతులను కఠినంగా శిక్షిస్తే.. మిగిలిన వాళ్లకు భయం పుడుతుందని పోలీస్ శాఖను ప్రజలు కోరుతున్నారు.

ఇంకా చదవండి41 Days Ago
జయరాం హత్య కేసులో కొత్త మలుపు

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ జయరామ్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని నందిగామ సీఐ కార్యాలయానికి తరలించి పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు సాయంత్రంలోపు శిఖా చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. శిఖా చౌదరితో పాటు ఆమె సోదరిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే శిఖా చౌదరి రాకేష్ అనే వ్యక్తి నుంచి నాలుగున్నర కోట్లు అప్పు తీసుకున్నట్టు, ఆ అప్పును జయరామ్ తీరుస్తానని హామీ ఇచ్చినట్టు విచారణలో తెలిశాయి.  

జయరామ్‌ది హత్యే అని నిర్ధారించిన పోలీసులు హత్య ఎవరు చేశారు? ఎలా చేశారు..? అనే దానిపై నాలుగు పోలీస్‌ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నందిగామ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని జయరామ్ ఇంటికి చేరుకుని స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు.  

జయరామ్‌ను హైదరాబాద్‌లోనే హత్య చేసి మృతదేహాన్ని నందిగామ వద్దకు తరలించారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన వారే దీన్ని రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తి ఎవరన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.  

జయరామ్ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ సీసీ పుటేజ్ లను కూడా పరిశీలించారు. జనవరి 31న ఫార్మా కంపెనీ సమావేశాన్ని ఈ హోటల్లో నిర్వహించారు. సమావేశ అనంతరం వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తితో జయరామ్ వెళ్లినట్లు సీసీ పుటేజ్‌లో రికార్డైంది. దీంతో ఆ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరు అన్న దాని కోసం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.  

జయరామ్ హత్యకు ఆస్తి తగాదాలు కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండేళ్ల క్రితం జయరాం తల్లి చనిపోయింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబసభ్యుల మద్య ఆస్తి గొడవలు తలెత్తాయి. ఈ తగాదాలు కూడా జయరామ్ హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.  

మరో వైపు జయరాం పోస్ట్‌మార్టంపై ఉత్కంఠ నెలకొంది. జయరాంపై విషప్రయోగం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరాం తలపై ఉన్న బ్లడ్‌ అతని ముక్కు నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. శరీరం రంగుమారడంతో జయరాంపై విషప్రయోగం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంకా చదవండి46 Days Ago
మరింత +