క్రీడా వార్తలు

India T20I Series Win Over Windies: Shikhar Dhawan, Rishabh Pant Star As India Seal 3-0 Whitewash vs Windies

టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన రోహిత్ సేన

చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. విండీస్‌ నిర్ధేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని చేధించిన భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌ విజయంతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్‌లో 13 పరుగుల వద్ద ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పాల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ కూడా17 పరుగులు చేసి థామస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి ధావన్‌ విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో పంత్‌, ధావన్‌ వికెట్లు కోల్పోయినప్పటికీ ఇన్నింగ్స్ చివరి బంతికి భారత్‌ విజయం సాధించింది. ధావన్ 62 బంతుల్లో 92 పరుగులు, పంత్ 38 బంతుల్లో 58 పరుగులు చేశారు. అంతకు ముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 13 ఓవర్లలో 95 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశంలో విండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, బ్రావో చెలరేగి ఆడారు. ముఖ్యంగా నికోలస్ 25 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఇద్దరూ అజేయంగా నిలవడంతో టీమిండియా ముందు కరేబియన్ జట్టు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. భారత బౌలర్లలో చాహల్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.

మరింత +
China Open: PV Sindhu, Kidambi Srikanth Knocked Out In Quarterfinals

చైనా ఓపెన్‌ వరల్డ్ టోర్నీలో పీవీ సింధు ఓటమి

చైనా ఓపెన్‌ బీడబ్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. సింధు 17-21, 21-17, 15-21 తేడాతో హిబింజియో చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో ఓటమి పాలైన సింధు.. రెండో గేమ్‌లో తేరుకుని స్కోరును సమం చేశారు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు మరోసారి తడబడటంతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. 69 నిమిషాల పాటు జరిగిన పోరులో చైనా క్రీడాకారిణి ఆద్యంతం దూకుడుగా ఆడారు. ఇది బింజియో చేతిలో వరుసగా మూడో ఓటమి. అంతకుముందు వీరిద్దరి జరిగిన రెండు మ్యాచ్‌లు రెండు గేమ్‌ల్లోనే ముగిస్తే.. ఈ మ్యాచ్‌ మూడో గేమ్‌ వరకూ వెళ్లడం గమనార్హం.

మరింత +
The Women's World T20 2018 is scheduled to take place between 9 to 24 November in the West Indies

మహిళల టీ20 ప్రపంచ కప్‌‌కు సర్వం సిద్ధం

మహిళల క్రికెట్ లో మళ్లీ పరుగుల పండుగ మొదలయ్యింది. కరీబియన్‌ దీవుల్లో ఇవాళ్టి నుంచి ధమాకాకు రంగం సిద్ధమైంది. పది దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్న టీ20 ప్రపంచ కప్‌ మొత్తం 16 రోజుల పాటు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ గడ్డమీద ఈ టోర్నీ జరుగుతుండటంతో హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగుతోంది. స్టార్ టీమ్ ఆస్ట్రేలియాతో పాటు వన్డే విజేత ఇంగ్లండ్, అండర్ డాగ్ న్యూజిలాండ్ అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇటు భారత్ కూడా మరో హాట్ టీమ్ గా టోర్నీలోకి అడుగు పెట్టింది.  
ప్రపంచ విజేతగా నిలిచేందుకు...
మహిళల ప్రపంచ కప్ ముగిసి 15 రోజులే గడిచింది. కాని అప్పుడే మరో విశ్వవిజేత టోర్నీకి సర్వం సిద్ధమయ్యింది. మహిళా క్రికెట్ లో ఇది ఆరో ప్రపంచ కప్ కాగా 8 ఏళ్ల తరువాత విండీస్ గడ్డపై ఈ టోర్నీ జరుగుతోంది. గత ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ విజేత ఆస్ట్రేలియాను ఓడించి తొలిసారి కరేబియన్ గర్ల్స్ టోర్నీని దక్కించుకున్నారు. మరోసారి టోర్నీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. మరోవైపు పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాలని కంగారూలు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ విజేత హోదాను టి20ల్లోనైనా దక్కించుకోవాలని టీమిండియా లెక్కలు వేసుకుంటోంది.  
న్యూజిలాండ్ తో భారత్ తొలి మ్యాచ్...
పేరుకు 10 జట్లు పోటీకి దిగుతున్నా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్‌లను మాత్రమే సెమీఫైనల్‌ చేరే సత్తా ఉన్నవిగా అంచనా వేస్తున్నారు. దక్షిణాఫ్రికా మహిళల జట్టు అంత స్ట్రాంగ్ గా లేదు. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌ టీమ్స్ మరింత పేలవంగా ఆడుతున్నాయి. సంచలనాలు నమోదైతే తప్ప ఇవి ముందడుగు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా నాలుగో సెమీస్‌ స్థానానికి వెస్టిండీస్, భారత్‌ మధ్య పోటీ నెలకొనే అవకాశముంది. గ్రూప్ బీలో ఉన్న భారత్ జట్టు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో ఫైట్ చేయనుంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది.

మరింత +
India vs West Indies: 4th ODI: Rohit, Rayudu star as India post biggest win against West Indies

ముంబైలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

వెస్టిండీస్ తో ముంబైలో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 224 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. మిడిలార్డర్ ప్లేయర్ అంబటి రాయుడు సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. చివర్లో ధోని ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ ను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. ఓపెనర్లతో పాటు.. మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ను తక్కువ స్కోర్ కే ఔట్ చేశారు. కెప్టెన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో పరువు కాపాడే ప్రయత్నం చేశాడు. కాని అతనికి మిగిలిన బ్యాట్స్ మన్ నుంచి సహకారం లభించకపోవడంతో 36.2 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది. హమీద్, కుల్దీప్ చెరో మూడు వికెట్లు తీశారు. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మరింత +
India vs West Indies, 4th ODI:  Rohit Sharma scored century, Ambati Rayudu Half Century as on now

రోహిత్ సెంచరీ, రాయుడు హాఫ్ సెంచరీ

ఇండియా, వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న 4వ వన్డేలో భారత జట్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 100 బంతుల్లో 101 రన్స్ చేసి అద్భుతంగా ఆడుతున్నాడు. మొత్తం 13 ఫోర్లు, ఒక 6 కొట్టి 21వ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు రోహిత్. ముంబై ప్రేక్షకులకు కనువిందు చేశాడు. ఈ సిరీస్‌లో అతడికిది రెండో శతకం కావడం విశేషం. తొలి వన్డేలో 150 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు 51 బాల్లో హాఫ్ సెంచరీ చేసి దూకుడుగా ఆడుతున్నాడు. రెండు వికెట్ల నష్టానికి ప్రస్తుత భారత్ స్కోరు 37 ఓవర్లలో 234 రన్స్ తో ఆడుతున్నారు.

మరింత +
India vs West Indies 4th ODI in Mumbai today

నేడు ముంబైలో భారత్-వెస్టిండీస్ నాలుగో వన్డే

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్-వెస్టిండీస్ మధ్య నాలుగో వన్డే జరగనుంది. ముంబైలో జరగనున్న ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఐదు వన్డేల సిరీస్‌ ప్రస్తుతం 1-1గా ఉన్న నేపథ్యంలో ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అందుకే ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మంచి సమతూకంతో బరిలోకి దిగాలని భారత్‌ వ్యూహం రచిస్తోంది. మూడో వన్డేలో కోహ్లీ మినహా ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనపరుస్తోంది. ప్రపంచకప్‌కు ముందు ఎంతో సమయం లేని స్థితిలో జట్టు బ్యాటింగ్‌ లోపాలు సరిదిద్దుకోవడంలో మెరుగుదల కనిపించడం లేదు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే మిడిలార్డర్‌లో ఆదుకునే ఆటగాడు కనిపించడం లేదు. దీంతో ఈసారి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.

మరింత +
IND vs WI 3rd ODI: India search for the perfect blend against resurgent Windies

భారత్ vs వెస్టిండీస్: ఇవాళ పూణెలో మూడో వన్డే

మూడో వన్డే కోసం టీమిండియా రెడీ అయ్యింది. రెండో వన్డే డ్రా కావడంతో మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్ లో మరింత ఆధిక్యం పెంచుకోవాలని చూస్తోంది. తొలి వన్డేలో గెలిచిన భారత్ రెండో వన్డేలో ఓటమి అంచునుంచి బయటపడి డ్రాతో గట్టెక్కింది. పూణేలో జరగనున్న మూడో మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా మరోసారి అదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఓపెనర్ రోహిత్, కెప్టెన్ కోహ్లీతో పాటు తెలుగు ప్లేయర్ రాయుడు కూడా ఫామ్ లో ఉన్నాడు. అయితే గత రెండు వన్డేల్లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. కాని మూడో వన్డేకు టాప్ బౌలర్లు బుమ్రా, భువి జట్టులో చేరడంతో బౌలింగ్ దళం మరింత పదునెక్కింది. ఇటు విండీస్ జట్టు కూడా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో మూడు వందలకు పైగా స్కోర్లు చేసిన కరేబియన్లు మూడో మ్యాచ్ లోను అదరగొట్టాలని చూస్తున్నారు. సూపర్‌ఫామ్‌లో ఉన్న హెట్‌మయరే ఆ జట్టుకు పెద్ద బలం. తొలి మ్యాచ్‌లో శతకం బాదిన అతడు రెండో మ్యాచ్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో 94 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌ షై హోప్‌ ఫామ్‌ కూడా ఆ జట్టుకు అండగా మారాడు. సీనియర్‌ ఆటగాళ్లు శామ్యూల్స్‌, కీరన్‌ పావెల్‌, చందర్‌పాల్‌ హేమ్‌రాజ్‌ కూడా సత్తా చాటాలని విండీస్‌ కోరుకుంటోంది. అయితే బౌలింగ్ లో భారీగా పరుగులు ఇస్తుండటంతో జట్టుకు మైనస్‌గా మారింది.

మరింత +
MS Dhoni snubbed from Australia tour - as India reveals Test and T20 squads

ఆసీస్‌తో జరగనున్న టీ20 సిరీస్ జట్టులో ధోనీ లేడు!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టీ20 కెరీర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో విండీస్, ఆస్ట్రేలియా జట్లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించిన సెలక్టర్లు అందులో ధోనీకి చోటివ్వకపోవడం హాట్ టాఫిక్ గా మారింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. విండీస్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌తోపాటు ఆసీస్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించింది. అలాగే, న్యూజిలాండ్-ఎ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు కోసం కూడా జట్టును ప్రటించారు. ఓపెనర్ మురళీ విజయ్, రోహిత్ శర్మ, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌లకు జట్టులో స్థానం కల్పించిన సెలక్టర్లు టీ20 సిరీస్‌లకు ధోనీని పక్కనపెట్టారు. దీంతో ఇక ధోనీని ఒక్క వన్డేలకే పరిమితం చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆసియాకప్‌కు దూరమైన కోహ్లీ విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ నిర్వర్తిస్తాడు. ధోనీని ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. రెండు టీ20 సిరీస్‌లలోనూ ధోనీ ఆడబోవడం లేదన్నాడు. అంతమాత్రాన అతడి కెరీర్ ముగియలేదన్నారు. రెండో వికెట్ కీపర్‌ను పరీక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.

మరింత +
India vs West indies, 2nd ODI: Virat Kohli fastest 10,000 ODI runs, breaks Sachin Tendulkar's record

మ్యాచ్ టై: కానీ కోహ్లీ సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు

క్రికెట్ అభిమానులంతా ఊపిరి బిగపట్టుకొని చూసిన క్రికెట్ మ్యాచ్ చివరకు టై అయింది. భారత్, వెస్టిండీస్ మధ్య జరుగిన రెండో వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 321 పరుగులు చేసింది. మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 322 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ కు నిర్ధేశించింది. ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ 4 పరుగులు, ధావన్ 29 పరుగులు చేసి హ్యాండిచ్చినా కోహ్లి, రాయుడు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. రాయుడు 73 పరుగులు చేసి ఔటవగా కోహ్లి మాత్రం తనదైన స్టయిల్లో రెచ్చిపోయి ఆడాడు. సెంచరీ వరకూ కాస్త ఆచితూచి ఆడినా మూడంకెల స్కోరు అందుకోగానే జోరు పెంచాడు. సెంచరీ తర్వాతే నాలుగు కళ్లు చెదిరే సిక్స్‌లు బాదాడు. చివరికి 129 బంతుల్లో 157 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో 150, అంతకన్నా ఎక్కువ పరుగులు చేయడంలో కోహ్లికిది నాలుగోసారి. ఈ సెంచ‌రీతో స‌చిన్ 49 సెంచ‌రీల రికార్డుకు 12 అడుగుల దూరంలో నిలిచాడు. ఈ ఏడాది ఆడిన 11 మ్యాచుల్లో ఏకంగా 1,060 ప‌రుగులు చేశాడు విరాట్ కోహ్లి. అంటే దాదాపు వంద స‌గ‌టుతో ప‌రుగులు చేయ‌డం విశేషం. 2018లో అటు టెస్టులు, ఇటు వ‌న్డేల్లో రెండింట్లోనూ కోహ్లియే టాప్ స్కోర‌ర్‌గా ఉన్నాడు.

మరింత +
Indian Cricket Team to play 2nd ODI against Windies in Vishakapatnam

రోహిత్, ధావన్, కోహ్లీలు వైజాగ్‌లో రికార్డులు సాధించేనా?

విశాఖలో క్రికెట్ సమరానికి సర్వం సిద్ధమయ్యింది. విండీస్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన కోహ్లీ సేన రెండో వన్డేలో సత్తా చాటాలని చూస్తోంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ ఫుల్ ఫామ్ లో ఉండటంతో విశాఖలో పరుగుల వరద పారించాలని చూస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్, విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లో సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్ లో కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. అచొచ్చి విశాఖలో అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  
వైజాగ్‌లో భారత్ జోరు కొనసాగేనా...
వన్డే క్రికెట్‌ మ్యాచ్‌కు ఏర్పాట్లు పక్కాగా పూర్తయ్యాయి. ఇక్కడి వైఎస్‌ఆర్‌ స్టేడియంలో ఇరుజట్లు రెండు సార్లు తలపడగా చెరో విజయం లభించిన సంగతి తెలిసిందే. ఒక మ్యాచ్‌ తుపాను కారణంగా రద్దయింది. ఇప్పుడు సిరీస్‌లో రెండో వన్డేలో ఇరు జట్లూ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చూపించాలన్న పట్టుదలతో ఉన్న వెస్టిండీస్‌ జట్టు నెట్స్‌లో గట్టిగా కసరత్తు చేసింది. భారత్‌ జట్టు మధ్యాహ్నం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసినా అంత సీరియస్‌నెస్‌ కనిపించలేదు. తొలి మ్యాచ్‌లో సెంచరీ వీరులు విరాట్‌కోహ్లి, రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టేశారు. అయితే ధోనీ మాత్రం సీరియస్‌గానే ప్రాక్టీస్‌ చేసాడు. ఉమేష్, షమి, చాహాల్, ఖలీల్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తే శిఖర్, రవీంద్ర బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు.  
కోహ్లీకి అడుగు దూరంలో మరో రికార్డు ...
స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ అతివేగంగా పదివేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. 204 ఇన్నింగ్స్‌లో విరాట్‌ ఇప్పటికే 9919 పరుగులు చేసేశాడు. మరో 81 పరుగులు చేస్తే ఈ రికార్డు సొంతం కానుంది. విశాఖ వేదికపై హాట్రిక్‌ సెంచరీల రికార్డును కోహ్లీ గతంలో వెంట్రుక వాసి తేడాలో చేజార్చుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు చేసిన రికార్డు సాధించేందుకు శిఖర్‌ ధావన్‌ మరో 173 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్‌ మరో సిక్స్‌ కొడితే వన్డేల్లో తెండుల్కర్‌ బాదేసిన 195 సిక్స్‌ల రికార్డు సమం చేయనున్నాడు.  
వైఎస్ ఆర్ స్టేడియంలో భారీ బందోబస్తు...
రెండో వన్డే మ్యాచ్‌ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా మ్యాచ్‌ నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు. మొత్తం 1400 మంది పోలీసు సిబ్బందిని నియమించగా.. లా అండ్‌ ఆర్డర్‌ నుంచి 600 మంది, ట్రాఫిక్‌ విభాగం నుంచి 600 మంది, హోమ్‌ గార్డులు 200 మంది బందోబస్తు నిర్వహించనున్నారు. స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.

మరింత +
IND vs WI Indies 1st ODI: Kohli, Rohit centuries take India to victory

వన్డేల్లో టిమిండియా దూకుడు

భారత్ వెస్టిండీస్ ల మధ్య జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును చిత్తుగా కోహ్లీ సేన ఓడించింది. విండీస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 42.1 ఓవర్లలోనే ఛేదించింది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 107 బంతుల్లో 21 ఫోర్లు, రెండు సిక్సులతో 140 పరుగులు, ఓపెనర్ రోహిత్ శర్మ 117 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సులతో152 పరుగులతో చెలరేగిపోయారు. మొదట భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ రెండో ఓవర్ చివరి బంతికి శిఖర్ ధవన్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ అందించిన సహకారంతో చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.భారత బ్యాట్స్‌మెన్‌ ధాటికి విండీస్‌ విలవిలలాడిపోయింది. విండీస్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ రోహిత్ తన కెరియర్ లో 20వ సెంచరీ.. కోహ్లీ 36వ సెంచరీ బాదారు. కోహ్లీ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అంబటిరాయుడు అదే స్పీడ్ తో 22పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

మరింత +
West Indies coach Stuart Law suspended for 2 ODIs for breaching ICC Code of Conduct

వెస్టీండీస్ క్రికెట్ జట్టుకోచ్‌పై ఐసీసీ కఠిన చర్యలు

వెస్టీండీస్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన కింద కోచ్ స్టువర్ట్ లాపై రెండు వన్డే మ్యాచ్‌ల నిషేధం విధించింది. దీంతో పాటు 100శాతం జరిమానా కట్టాలని చెప్పింది. అతడికి మూడు డీమెరీట్ పాయింట్లు వేసింది. 24నెలల కాలంలో ఆయన ఖాతాలో నాలుగు డీమెరీట్ పాయింట్లు చేరడంతో రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోవలసి వచ్చింది స్టువర్ట్ లా. హైదరాబాద్ వేదికగా జరిగిన తాజా మ్యాచ్ లో కరీబియన్ జట్టు రెండో టెస్టు మ్యాచ్ భారత్తో తలపడిన విషయం తెలిసిందే. ఈ ఆటలో విండీస్ బ్యాట్స్‌మ‌న్‌ కీరన్ పావెల్ ఔటైన తర్వాత స్టువర్ట్ లా టీవీ అంపైర్ గదిలోకి వెళ్లి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ వేటు పడింది. దీంతో పాటు ఫోర్త్ అంపైర్ ఉండే ఏరియాలోకి వెళ్లి ఆటగాళ్ల సమక్షంలోనే ఫోర్త్ అంపైర్ అఫీషియల్స్ వద్ద అదే రకంగా విమర్శలు చేశాడు. లాను వివరణ అడుగగా త‌న త‌ప్పును అంగీక‌రించాడు. అతడి చర్యలను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్‌బ్రాడ్ కోచ్‌పై వేటు వేశాడు.

మరింత +
India vs West Indies, 2nd Test Day 1: Kuldeep Yadav Strikes Again As Windies Lose 4th Wicket

టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా భారత్

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టులో రికార్డు విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు, విండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.

మరింత +
India vs West Indies 2nd Test match at Uppal Stadium in Hyderabad

రేపు ఉప్పల్లో భారత్-వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్

ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. భారత్, స్టేడియంలో సాధన కూడా ప్రారంభించారు. రాజ్‌కోట్‌ టెస్ట్‌లో సాధించిన ఘన విజయంతో ఉత్సాహం మీదున్న టీమిండియా  వెస్టిండీస్‌ను కూడా ఓడించేందుకు బరిలోకి దిగబోతుంది. మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది.

మరింత +
Under-19 Asia Cup: India Beat Sri Lanka By 144 Runs To Clinch Title, Team India,

ఆసియా అండర్ 19: విజయం మనదే

ఆసియా అండర్ 19 క్రికెట్ టోర్నీలో టీమిండియా సత్తా చాటింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 144 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కుర్రాళ్లు లంకేయిలను చిత్తు చేసి టైటిల్ ను దక్కించుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. జశ్వాల్, అంజూ రావత్, మంచి ఓపెనింగ్ ఇవ్వగా చివర్లో కెప్టెన్ సిమ్రాన్ సింగ్, బదోని ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ స్కోర్ లక్ష్యంగా బరిలోకి దిగిన లంక హర్ష్ త్యాగి దాటికి 160 పరుగులకే కుప్పకూలింది. త్యాగి ఆరు వికెట్లతో చెలరేగగా దేశాయ్ రెండు వికెట్లు తీశాడు.

మరింత +