వీడియోలు

KCR to Campaign 3 constituency per day, targets 100 meetings in 50days from November 6th

రోజుకు మూడు నియోజక వర్గాల్లో కేసీఆర్ ప్రచారం

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ప్రచారానికి రెఢీ అవుతున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఈసారి వంద అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి షెడ్యూల్‌ ప్లాన్ చేస్తున్నారు. తొలుత ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించి ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రచార సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఈ బహిరంగ సభలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. నిజానికి అక్టోబర్‌లోనే బహిరంగసభలను పూర్తి చేయాలని మొదట అనుకున్నా మహాకూటమిపై స్పష్టత రాకపోవడంతో వచ్చే వారానికి వీటి నిర్వహణ వాయిదా వేశారు. మూడు ఉమ్మడి జిల్లాల బహిరంగ సభల తేదీలను రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం నియోజకవర్గాల వారీగా ప్రచార షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతిరోజూ కనీసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కొద్దిరోజుల పాటు రోజుకు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం ప్రచారం చేసేలా షెడ్యూల్‌ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రచార నిర్వహణ షెడ్యుల్ పై మంగళవారం ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కేసీఆర్‌ పలువురు పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. దశలవారీగా ప్రచారం నిర్వహించే నియోజకవర్గాల జాబితాను రూపొందించారు. మహాకూటమిని లక్ష్యంగా చేసుకోని చేయనున్న ఈ ప్రచారంలో స్థానికంగా ప్రజలను ఆకట్టుకునే అంశాలు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు.

మరింత +
Raj News Comment: Raj News Special Report on Attack on YS Jagan

ప్రతిపక్ష నాయకుడి భద్రత.. పాలకులకు పట్టదా..?

ఒక్క దాడి... ఒకే ఒక్క దాడి... అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఒక్కో పొలిటికల్ కామెంట్... హద్దులుదాటి అగ్గిరాజేస్తోంది. ఇంతకీ ప్రజల రక్షణ బాధ్యత... ప్రభుత్వానిది కాదా..? ప్రతిపక్ష నాయకుడి భద్రత... పాలకులకు పట్టదా..? తమ నాయకుడిపై జరిగే కుట్రను పసిగట్టడంలో వైసీపీ నాయకత్వం విఫలమైందా..? తప్పెవరిది..? నీచమైన కుట్రకు పాత్రదారి శ్రీనివాస రావు. మరి సూత్రదారులు ఎవరు..? జగన్‌పై దాడి వెనుక ఉన్నదెవరు..? వెంటాడుతున్న ప్రశ్నలపై రాజ్‌న్యూస్ కామెంట్.

మరింత +
BJP leader GVL Narasimha Rao fires on KCR for arresting Hindu Women at old city

పాతబస్తీని.. ఓవైసీకి రాసిచ్చాడా.. కేసీఆర్: GVL

సీఎం కేసీఆర్, ఎంపీ కవితపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. బతుకమ్మ ఆడటానికి పాతబస్తీలో పర్మిషన్ తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఓల్డ్ సిటీ రాష్ట్రంలో భాగం కాదా.. ఓవైసీకీ ఏమైనా రాసిచ్చారా అంటూ నిలదీశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు కేసీఆర్, కవిత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మరింత +
Bank manager seeks sex for granting loan; beaten up by woman in full public view

కోరికతీర్చమన్న బ్యాంకుమేనేజర్‌కు మహిళ చెప్పుదెబ్బ

ఓ బ్యాంకు మేనేజర్‌ను మహిళ చెప్పుల‌తో చితకబాదింది. ఈ సంఘటన కర్ణాటకలోని దేవనాగరిలో సోమ‌వారం(అక్టోబ‌ర్ 15న) జ‌రిగింది. దేవనాగరికి చెందిన ఓ మహిళ లోన్ కోసం స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. అయితే లోన్ కావాలంటే తన కోరిక తీర్చాలని బ్యాంక్ మేనేజర్ డిమాండ్ చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు మహిళ బ్యాంకు మేనేజర్‌ను నడి బజార్లోకి ఈడ్చుకొచ్చి కట్టెతో చితకబాదింది. అక్క‌డితో వ‌ద‌ల‌క‌ చెప్పుతో కొట్టి అత‌డికి బుద్ధి చెప్పింది. బ్యాంకు మేనేజర్‌ను మహిళ చితకబాదే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది.

మరింత +
Hyderabad Metro Train stops at Balanagar Station over loss of power supply

ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు

హైదరాబాద్‌లో సాంకేతిక లోపం తలెత్తండంతో మెట్రో రైలు నిలిచిపోయింది. మియాపూర్ నుంచి అమీర్ పేట వెళ్తున్న ట్రైన్ బాలానగర్ అంబేద్కర్ స్టేషన్లో ఆగిపోయింది. అయితే కరెంట్ సప్లై లేకే ట్రైన్ నిలిచిపోయిందని మెట్రో సిబ్బంది చెబుతున్నారు. కరెంట్ వైర్లు తెగిపోవడంతో ఈ సమస్య తలెత్తిందని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలియజేశారు. దీంతో మియాపూర్ నుంచి ఎర్రగడ్డ స్టేషన్ వరకు మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే అసహనానికి గురైన ప్రయాణికులు గొడవకు దిగారు.

మరింత +
DK Aruna Reacts Strongly on KCR Comments in Palamuru TRS Meeting

'సంస్కారవంతంగా మాట్లాడటం నేర్చుకో కేసీఆర్'

పాలమూరు సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత డీకే అరుణ మండిపడ్డారు. ముందు సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోమని కేసీఆర్‌కు హితవు పలికారు. దమ్ముంటే నా బండారం ఏందో బయటపెట్టు అని సవాల్ విసిరారు. నువ్వు ఓ శక్తితో పెట్టుకున్నావ్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

మరింత +
If you vote KCR, he will cheat again says Congress Star Campaigner Vijaya Shanti

కేసీఆర్‌కు ఓటేస్తే మళ్లీ మోసపోతారు: విజయశాంతి

తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలబ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలోనూ పూజలు చేశాక టీపీసీసీ ముఖ్యనేత ఎన్నికల శంఖారావం పూరించారు. అనంతరం కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ విజయ్ శాంతి ప్రజావేదిక మీద నుంచి ప్రసంగించింది. కేసీఆర్ కు మళ్లీ ఓటేస్తే మోసపోతారని తెలిపింది. 

మరింత +
7-Year-Old Kid Escapes Unhurt After Car Runs over his Body

కారు మీద పోయినా బాబు బతికాడు

ముంబయిలో ఓ యువతి నిర్లక్ష్యంగా కారు నడపడంతో ఓ బాలుడు గాయాలపాలయ్యాడు. రాత్రి సమయంలో చిన్నారులందరూ గల్లీలో ఫుట్‌బాల్ ఆడుతోన్న సమయంలో ఓ బాలుడు షూ లేస్‌ కట్టుకుంటూ కారు పక్కనే రోడ్డుపై కూర్చున్నాడు. అదే సమయంలో కారు ఎక్కిన యువతి ముందు చూసుకోకుండా కారును బాలుడి మీదకు పోనిచ్చింది. అదృష్టం కొద్ది బాలుడు కారు మధ్య భాగంలోకి జారాడు. కారు మీద నుంచి వెళ్లిన తరవాత లేచి ఏడుస్తూ బాలుడు స్నేహితుల దగ్గరకు పరుగులు పెట్టడం సమీపంలోనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బాలుడికి ప్రాణాపాయం ఏమీ లేకున్నా స్వల్ప గాయాలయ్యాయి.

మరింత +
Telangana Congress asks SEC deleted duplicate voters list

'నకిలీ ఓట్ల తొలగింపుపై వివరణ ఇవ్వండి'

ఎన్నికల ప్రక్రియలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. 31 లక్షలకుపైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని ఆయన ఆరోపించారు. విభజన తర్వాత ఇక్కడి వాళ్లు ఏపీలో ఓటు హక్కు కోరుకున్నారని, ఇక్కడ వద్దనుకున్నారని ఈసీ చెప్పిందని కానీ ఏపీలో ఓట్లు ఎందుకు పెరగలేదని ఆయన ప్రశ్నించారు. 2015 నుంచి 2018 మధ్య తొలగించిన ఓటర్ల వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరింత +
Nalgonda MLC Komatireddy Raj Gopal Reddy Express Deep Anger over High Command

కుంతియా తెలంగాణ కాంగ్రెస్‌కు 'శని'

కాంగ్రెస్ ఎన్నికల కమిటీలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. వార్డ్ మెంబర్ గా గెలవలేని వారికి కమిటీలో ప్రాధాన్యతనిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైళ్లకు వెళ్లిన వారికి, తెలంగాణ ఉద్యమంలో లేని వారికి, బ్రోకర్లకు, పైరవీకారులకు కమిటీల్లో పెద్ద పీఠవేశారని ఆరోపించారు. కమిటీల్లో తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీలను తక్షణమే రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి. 

మరింత +
Vayalpad CI Dirty Phone call Talks with Woman in Tirumala

ఫోన్‌కాల్లో బయటపడ్డ వాయల్పాడు సీఐరాసలీలలు

చిత్తూరు జిల్లా వాయల్పాడు సిఐ తేజోమూర్తి ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ కేసు విషయంలో కలిసేందుకు వచ్చిన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంయుక్త అనే మహిళ ఆరోపించింది. గరుడసేవరోజు తిరుమలకు రమ్మని పిలిచాడని.. ఏకాంతంగా గడుపుదామని వేధించినట్లు మహిళా పేర్కొంది. వాట్సాప్ లో చాటింగ్‌లు, అసభ్యంగా మెస్సేజ్‌లు చేస్తున్నాడని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. అయితే తాను మహిళా సంఘాల నేతలతో కలిసి వస్తున్నానని తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నట్లు బాధితురాలు చెబుతోంది.

మరింత +
Seats Allocation in Mahakutami Finally Revealed?

మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి

మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు పెద్ద స‌మస్య‌గా మారేలా క‌న‌బ‌డుతోంది. మిత్రప‌క్ష పార్టీల‌న్ని త‌మ‌కు ఇన్ని సీట్లు కావాలంటే.. త‌మ‌కు అన్ని సీట్లు కావాల‌ని చాంతాడంత లీస్ట్‌ను కాంగ్రెస్ నేత‌ల‌ ముందు పెడుతున్నార‌ట‌. అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేయనున్నట్లు తెలుస్తుంది. హస్తం పార్టీ బ‌లంగా ఉన్న చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో మిత్ర‌ప‌క్షాలు సీట్లు అడుగుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. మీరు కూట‌మి పెట్టండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాని మా ఒక్క సీటును కాంగ్రెస్ కే కేటాయించాల‌ని కోరుతున్నార‌ట. దీంతో సీట్ల స‌ర్ద‌ుబాటు చేయ‌లేక సొంత‌ పార్టీ నేత‌ల విన్న‌పాలు విన‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట కాంగ్రెస్ పెద్ద‌లు. : ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేత‌ల‌కు పొత్తులు, సీట్ల విష‌యంలో పార్టీ అధినేత క్లారీటి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే స్థానాలను వదులుకోవద్దని నేతలకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్ధానాల‌లో.. పాతబస్తీలో ఉన్న7 అసెంబ్లీ స్థానాలు MIMకు కంచుకోట. ఈ సీట్లను కాంగ్రెస్ లెక్క‌లోకి తీసుకోవ‌ట్లేదు. వాటిని మినహాహిస్తే మిగిలిన 112 స్ధానాల‌లో 90 స్ధానాల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్దులు బరిలో ఉండాల‌ని రాహుల్ దిశానిర్దేశం చేయడంతో.. మిగిలిన 22 స్ధానాల‌లో TDPకి ప‌ది స్థానాలు, టీజేఏస్ కు 8 నుండి 10 స్థానాలు, సిపిఐకి 2 నుండి 4 స్థానాలు కేటాయించేట‌ట్లు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు స‌మాచారం. అయితే మిత్రప‌క్షాల‌కు కేటాయించే 22 స్ధానాల‌లో కూడా కాంగ్రెస్ అభ్య‌ర్దులు బ‌లంగా ఉన్న చోట మిత్రప‌క్షాల అభ్య‌ర్దులపై స‌ర్వే చేయించాల‌ని నిర్ణ‌యించినట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌కు స‌ర్వేలో రెండు, మూడు శాతం అనుకూలంగా ఉన్న కూడా రాజీ పడి మిత్రపక్షాలకు కేటాయించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అంతకంటే ఎక్కవగా తేడా ఉంటే మాత్రం అ స్థానాలను కూడా కాంగ్రెస్ వదులుకోవడానికి సిద్ధంగా లేదని సమాచారం. కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ఫ‌స్ట్ లీస్ట్ అభ్య‌ర్దులను ప్ర‌కటించ‌నున్నార‌ని స‌మాచారం. 

మరింత +
Heavy rain in Hyderabad, GHMC Commissioner reviews and alert rescue teams

నగరంలో రోడ్లపైకి భారీగా వరద నీరు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరింత +
For Chennuru TRS Ticket, Nallala Odelu self house arrest with family

స్వీయ గృహ నిర్భంధంలోకి వెళ్లిన నల్లాల ఓదేలు

చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కుటుంబసభ్యులతో సహా గృహ నిర్బందంలోకి వెళ్లారు నల్లాల ఓదేలు. 24 గంటల్లోగా టికెట్ ఇవ్వకపోతే ఎవరికి ఏం జరిగిన కేసీఆరే బాద్యత వహించాలి ఆయన అన్నారు. కేసీఆర్‌ను దేవుడు కంటే ఎక్కువగా నమ్మానని.. ఇప్పటికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఓదేలు 24 గంటల్లో గా కేసీఆర్ నుండి పిలుపు రాకపోతే కుటుంబసభ్యులతో సహా కఠిన నిర్ణయం తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఆరు నుండి గృహ నిర్బంధంలో కి వెళ్లిన నల్లాల ఓదేలు కుటుంబం కేసీఆర్ నుండి కబురు వచ్చేంత వరకు బయటకు వచ్చేదిలేదని స్పష్టం చేశారు.

మరింత +
DK Aruna comments on KCR's early Assembly dissolution

రాష్ట్రానికి శని వదిలింది: డీకే అరుణ

అసెంబ్లీ రద్దుతో తెలంగాణకు పట్టిన కేసీఆర్ పీడ వదిలిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పకుండా...అసెంబ్లీ రద్దు చేయడం అప్రజాస్వామికమని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ 100 సీట్లు గెలుస్తామని చెప్పడం బూటకమన్నారు డీకే అరుణ. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.

మరింత +