ముఖ్యాంశాలు

Karnataka govt declares 3-day mourning as mark of respect to Ananth Kumar

అనంతకుమార్‌ కుటుంబానికి ప్రముఖుల సంతాపం

కేంద్ర మంత్రి అనంతకుమార్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అనంతకుమార్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతకుమార్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలాసీతారామన్‌ తదితరులు అనంతకుమార్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. అనంతకుమార్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతకుమార్‌ పార్థీవదేహాన్ని బెంగుళూరులోని ఆయన నివాసంలో ఉంచారు. అనంతకుమార్‌ను కడసారి చేసేందుకు సన్నిహితులు, అభిమానులు తరలివస్తున్నారు. కర్నాటక గవర్నర్ రాజుభాయ్ వాలా అనంత్ కుమార్ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు.

మరింత +
Congress Common Minimum Programme will be released tomorrow said Mallu Bhatti Vikramarka

రేపు కాంగ్రెస్ ఉమ్మడి ప్రణాళిక విడుదల

మల్లు భట్టి విక్రమార్క నివాసంలో కూటమి నేతల భేటీ అయ్యారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. కోదండరాం, ఎల్.రమణ, గద్దర్ తో పాటు ఇతర నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చించామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తెలిపారు. కూటమి ఉమ్మడి ప్రణాళికను రేపు విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం ఒకవైపు, తెలంగాణ ప్రజలు మరోవైపు ఉన్నారని భేటీ అనంతరం కోదండరాం చెప్పారు.

మరింత +
Election Commission to issue gazette notification for Telangana assembly polls

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్డ్

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ సీఈసీ విడుదల చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రాష్ట్ర శాసనసభ పరిధిలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 19తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 19 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 22తో ముగియనుంది. ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా అదే రోజు వెల్లడికానుంది.

మరింత +
CPI gives ultimatum to Congress over Mahakutami alliance for  5 seats in Telangana

కాంగ్రెస్‌కు సీపీఐ డెడ్ లైన్

హైదరాబాద్ ముఖ్దుం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు ఐదు సీట్లు కావాలని సీపీఐ పట్టుబడుతోంది. కొత్తగూడెం, హుస్నాబాద్, మంచిర్యాల, మునుగోడు, వైరా కోరుతున్నామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కుంతియా చెబితే మేం పోటీ చేయాలా అంటూ కూనంనేని ప్రశ్నించారు. 11 స్థానాలు కోరితే 9 ఇస్తారనుకున్నాం కానీ 3 అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత +
KCR to meet 15K Gajwel TRS Party workers and leaders at Erravalli farm house in Medak district on Nov 11

ఈనెల 11న 15వేల మంది కార్యకర్తలతో కేసీఆర్ భేటీ

నవంబర్ 11న గజ్వేల్ కార్యకర్తలతో తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మద్యాహ్నం 12 నుండి 3 వరకు కార్యకర్తలతో టీఆర్ఎస్ అధినేత సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశానికి దాదాపు 15 వేల మంది కార్యకర్తలు హాజరుకానున్నారని సమాచారం. ఇక అదే రోజు టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందించనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు టీఆర్ఎస్ భవన్‌లో అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే అభ్యర్థులందరికి ఆహ్వానాలు అందాయి.

మరింత +
State Election Commission to meet 9 Telangana Political Parties over Election Notification soon

ఇవాళ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ భేటీ

ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇవాళ గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నది. దీనిపై అన్ని పార్టీల ఆఫీసులకు సమాచారం ఇచ్చిందన సీఈవో కార్యాలయం పార్టీలకు కొన్ని సూచనలు చేయనుంది. కాగా డిసెంబర్ 7న జరిగే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని సీఈవో రజత్‌కుమార్ పార్టీలను కోరనున్నారు.

మరింత +
Former MLA Durgam Chinnaiah gets threatening letter from Maoists in Mancherial

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు బెదిరింపు లేఖ

మంచిర్యాల జిల్లాలో.. మావోయిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు బెదిరింపు లేఖ వచ్చింది. కామ్రేడ్ చార్లెస్ పేరు మీద వచ్చిన ఈ లేఖలో ఆక్రమిత భూములను వెంటనే పేదలకు పంచిపెట్టాలని, లేదంటే కిడారి సర్వేశ్వరరావు, సోమలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. దొరల గూటి నుంచి బయటకు రావాలని, దళితుడని పేరు చెప్పుకుని సామ్రాజ్యవాద పెత్తనం చేస్తే మావోయిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని లేఖలో పేర్కొన్నారు. ఇకనైనా బుద్ధిగా నడుచుకోకపోతే చంద్రబాబునాయుడు మాధవరెడ్డి ఘటన బెల్లంపల్లిలో పునరావృతం అవుతుందని హెచ్చరించారు. జిల్లాలోని బెల్లంపల్లి నగరంలో మావోయిస్టుల అనుబంధ కార్మిక సంఘం పేరుతో పోస్టర్లు వెలిశాయి. సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ పేరుతో పోస్టర్లలో పేర్కొన్నారు. బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పోస్టర్లు, లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాజీ మావోయిస్టు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు పొరండ్ల సత్యవతిని విచారించారు. సత్యవతి ఇంటిని సోదా చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.

మరింత +
Unknown man suicides at Ameerpet Metro Station

అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మెట్రో రైల్ స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీర్‌పేట్-మైత్రీవనం మెట్రో స్టేషన్‌పై నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత +
Telangana Deputy CM Mahamood Ali narrow escape at Sadar celebrations in Hyderabad

మహమూద్ అలీకి అతిపెద్ద ప్రమాదం తప్పింది

ముషీరాబాద్ సత్తార్ బాగ్ లో నిర్వహించిన సదర్ వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తృటిలో ప్రమాదం తప్పింది. మహమూద్ అలీ హర్యానా నుంచి తెచ్చిన దున్నపోతులను తిలకిస్తుండగా రెండు దున్నపోతులు పోటీ పడి జనాలపైకి దూసుకొచ్చాయి. దీంతో పార్కింగ్ చేసిన డిప్యూటీ సీఎం వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు అతి కష్టం మీద వాటిని అదుపు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం అక్కడనుండి సురక్షితంగా వెనుదిరిగారు.

మరింత +
Telangana Mahakutami alliance seats finalised: TDP 14, TJS 8, CPI, 4

పొత్తులు ఖరారు: టీడీపీకి 14, టీజేఎస్ 8, సీపీఐ 4

తెలంగాణ మహాకూటమిలో పొత్తులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలైన టీడీపీకి 14, టీజేఎస్ 8, సీపీఐ 4 స్థానాలు ఖరారయ్యే అవకాశం ముంది. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని సమాచారం. ఇప్పటికే పొత్తులపై రాహుల్‌కు వివరాలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందించారు. ఇటు రేపు ఉదయం 11 గంటలకు సోనియా నివాసంలో సెంట్రల్ కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ప్రకటించకుండా మిగిలిన అభ్యర్థులపైనా సమావేశంలో చర్చించే అవకాశముంది. రేపు సాయంత్రం రాహుల్‌గాంధీ ఆమోదంతో 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరింత +
PM Narendra Modi inaugurates 'The Statue of Unity' in honour of Sardar Patel

'ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ని ఆవిష్కరించిన మోదీ

భారత చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. భారత తొలి ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఐక్యతా దినంగా అశేష భారతావని నేడు జరుపుకుంటోంది. ఆయన సేవలకుగాను ‘సర్దార్‌’గా నిలిచిన ఉక్కు మనిషికి భరత జాతి సమున్నతంగా నివాళులర్పించింది. సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 143వ జయంతి సందర్భంగా పటేల్‌ భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కేవడియాలో జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా ఇవాళ రికార్డుల కెక్కింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు  విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

మరింత +
Talasani Srinivas Yadav controversial comments on intelligence officers

యాదవుల ఆత్మీయ భేటీలో తలసాని వివాదాస్పద వ్యాఖ్యలు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గజ్వేల్‌లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటలిజెన్స్ ఆఫీసర్లు ఎవరైనా కనిపిస్తే వారిని తన్నండని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఏదైనా జరిగితే తాము చూసుకుంటామని తెలిపారు. ఒక రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నికల్లో పక్క రాష్ట్రాల ఆఫీసర్లు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.

మరింత +
Sania Mirza, Shoaib Malik blessed with baby boy

మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా

భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ షోయెబ్‌ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఆశీసులు అందించిన అభిమానులకు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2010లో సానియా, షోయెబ్‌ల వివాహం జరిగింది. ఏడాదిన్నర నుంచి ఆమె టెన్నీస్ ఆటకు దూరంగా ఉంది. 2020లో మళ్లీ రీఎంట్రీ ఇస్తుందని సమాచారం.

మరింత +
Congress Leader Madhu Yashki fire at KCR and KTR over asking settlers votes

ఓటమి భయంతోనే.. కేటీఆర్ ఆంధ్రులకు గాలం

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ విమర్శలు గుప్పించారు. మహాకూటమి విజయం తధ్యమని సర్వేలు చెబుతుండటంతో.. కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు కంటి వెలుగు ఆపరేషన్లు చేయిస్తున్న కేసీఆర్.. తన కంటి ఆపరేషన్ కోసం మాత్రం ఢిల్లీ వెళ్లారంటూ మండిపడ్డారు. అక్రమ ఆస్తులలో కవిత.. తెలంగాణ శశికళలా మారిందంటూ ఆరోపించారు. బామ్మర్దిని బినామీగా పెట్టి కేటీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే ఆంధ్రులకు అండగా ఉంటామంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

మరింత +
Cantonment TRS leaders demand candidate change, opposing former TDP MLA G Sayanna

గులాబీకి సెగ: కంటోన్మెంట్ టికెట్ సాయన్నకు వద్దు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగలు ఎగసిపడుతున్నాయి. సాయన్నకు తిరిగి టికెట్ ఇవ్వద్దని గులాబీ నాయకులు అంటున్నారు. గతంలో టీఆఎస్ తరపున స్వల్ప తేడాతో ఓడి పోయిన గజ్జెల నాగేష్ ఒక వైపు.. మార్కెట్ కమిటీ చైర్మన్ల సంఘం మాజీ అధ్యక్షుడు ముప్పిడి గోపాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన నాగేష్ కు టికెట్ ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన సాయన్నకు టికెట్ ఇవ్వడాన్ని వారు నిరసిస్తున్నారు. అదే విధంగా సమైక్య రాష్ట్రంలో మార్కెట్ చైర్మన్ల సంఘము అధ్యక్షుడిగా ఉన్న తాను టీఆర్ఎస్‌లో చేరానని, అప్పుడే కేసీఆర్ తనకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని ముప్పిడి గోపాల్ చెబుతున్నారు. ఇప్పుడు తప్పకుండా బి ఫార్మ్ తనకే ఇస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత +