ఆంధ్రప్రదేశ్ వార్తలు

Jana Sena Party to contest all Assembly, Lok Sabha seats in Andhrapradesh in coming General Elections

పార్లమెంట్ ఎన్నిక కమిటీలను పూర్తి చేసిన జనసేన

2019లో జరగబోయే జనరల్ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. జనసేన నేతలు, కార్యకర్తలను ఎన్నికల పోటీకి సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటరీ కమిటీల ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. 25 పార్లమెంట్ స్థానాల నియోజకవర్గ నేతలకు స్థానం కల్పిస్తూ తుది జాబితాను రెడీ చేశారు. తుది జాబితాను పరిశీలించి, 20న కమిటీలను ప్రకటించనున్నారు. నేతలు, కేడర్‌కు విడివిడిగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు పవన్ కల్యాణ్.

మరింత +
AP Police Denies to Handover YS Jagan's Attack Case details to NIA

జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక మలుపు

వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏ బృందం కేసుకు సంబంధించిన ఆధారాల్ని ఇవ్వాలంటూ విశాఖ పోలీసుల్ని కోరింది. అందుకు పోలీసులు తిరస్కరించారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ఇన్వెస్టిగేషన్ రిపోర్టుల్ని ఇవ్వమని తేల్చిచెప్పారు. దీంతో ఎన్ఐఏ అధికారులు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు సిట్ అధికారులు ఇవ్వడం లేదనీ పిటిషన్ లో అధికారులు తెలిపారు. విచారణ చేపట్టిన కోర్టు నేటికి వాయిదా వేసింది. మరో వైపు కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించటంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత +
TRS not contesting in AP elections, only campaigning to supporters says YCP MP Vijay Sai Reddy

ఏపీలో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదు: విజయసాయి రెడ్డి

రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిలుస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇది ఒక్క టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో వారికి మద్దతుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రచారం నిర్వహిస్తోందన్నారు.

మరింత +
AP Minister Devineni Uma responds on KTR and YS Jagan meet in Hyderabad

కేసీఆర్‌ది ఫెడరల్ ఫ్రంట్ కాదు.. మోడీ ఫ్రంట్

టీఆర్‌ఎస్ నేత కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భేటీ‌పై మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కేసీఆర్ ఏర్పాటు చేసేది ఫెడరల్ ఫ్రంట్‌ కాదని, మోడీ ఫ్రంట్‌ అని ఎద్దేవా చేశారు. ఇది ముగ్గురు మోడీల జగన్నాటకమని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఏపీ వాళ్లు కిరాయిదారులే అన్నారని, ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు కూడా రావని తిట్టారని దేవినేని గుర్తుచేశారు. లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షసులేనని కేసీఆర్‌ తిట్టలేదా ? అని  దేవినేని ఉమ ప్రశ్నించారు.

మరింత +
Chittoor people celebrates Sankranthi festival with Jallikattu

చిత్తూరు జిల్లాలో ఘనంగా జల్లికట్టు వేడుకలు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని తమిళనాడుతో పాటు సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జల్లికట్టులో పాల్గొనేందుకు యువత ఉత్సహం కనబరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జలికట్టు వేడుకలకు భారీగా జనాలు తరలివచ్చారు. పోటీలో భాగంగా పశువులను పట్టుకునేందుకు యువకులు రంగంలోకి దిగుతున్నారు. జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన యువత కేరింతలు కొడుతూ ఉత్సహంగా గడుపుతున్నారు. మరోవైపు తమిళనాడులో పొంగల్‌ వేడుకల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జల్లికట్టు నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. జల్లికట్టు వేడుకలను వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. పుదుకొట్టే జిల్లా తసంగుర్చిలో తొలి జల్లికట్టు పోటీలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్‌ ప్రారంభించారు. జల్లికట్టు పోటీలో భాగంగా 300 ఎద్దులను అదుపు చేయడానికి 400 మంది యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మరింత +
2 Youngsters tried to kidnap young girl at Bapatla in Guntur, Sister voiced loudly to save her

గుంటూరు జిల్లాలో యువతి కిడ్నాప్‌కు యత్నం

గుంటూరు జిల్లా బాపట్లలో ఓ యువతిని కిడ్నాప్‌ చేసేందుకు ఇద్దరు యువకులు యత్నించడం కలకలం రేపింది. స్థానిక కోళ్లపూడి వీధిలో తెల్లవారుజామున ఓ యువతి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ యువకుడు బలవంతంగా ఎత్తకువెళ్లేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న యువతి సోదరి గట్టిగా అరవడంతో ఆ యువకుడు పారిపోయేందకు యత్నించాడు. వెంటనే స్థానికులు తేరుకొని ఆ యువకుడితోపాటు వచ్చిన మరో యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్‌నకు యత్నించిన యువకుడిని స్థానిక చాకలిపాలేనికి చెందిన కాకుమాను గోపీనాథ్‌గా పోలీసులు గుర్తించారు.

మరింత +
Sankranthi Festival 2019:  Illegal cock, sheep fights organised in Vijayawada and Krishna District

సంక్రాంతి పండుగలో పొట్టేళ్ల పందేలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా కృష్ణా జిల్లాలో కోడిపందేలతో పాటు పొట్టేళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. బాపులపాడు మండలం అంపాపురంలో జరిగిన పందేలు చూడటానికి, స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోడి పందేల మాదిరిగానే పొట్టేళ్ల పందేలు సయితం అధ్యాంతం ఆసక్తిగా సాగాయి. నువ్వా-నేనా అన్న రీతిలో పొట్టేళ్లు తలపడుతున్నాయి.

మరింత +
Sankranthi Festival 2019: Traditional Bommala Koluvu in East and West Godavari

ఉభయ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా బొమ్మల కొలువు

సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాల్లోని కోడిపందాలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు. అయితే పశ్చిమ గోదావరి జిలాలోని కొవ్వలి గ్రామంలో భోగి పండుగ సందర్భంగా చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బొమ్మలు కొలువుతో చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత +
AP CM N Chandrababu Naidu to lay foundation for Iconic Bridge today

కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్‌కు బాబు నేడు శంకుస్థాపన

నేడు ఏపీలో రెండు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇబ్రహీంపట్నం - ఉద్దండరాయపాలెంను కలుపుతూ నిర్మించే ఈ వంతెనను భారతీయ యోగముద్ర ఆకారంలో ఉండేలా డిజైన్ చేశారు. అలాగే అమరావతి తాగునీటి అవసరాల కోసం 750 కోట్ల రూపాయలతో నిర్మించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నారు.

మరింత +
Police hunt for play card holders took  2 lives in Krishna District

పోలీసుల దాడితో ఇద్దరు పందెం రాయుళ్లు మృతి

కృష్ణా జిల్లాలో కోడి పందాలపై పోలీసుల దాడి విషాదాన్ని నింపింది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు పందెం రాయుళ్లు బావిలో పడి మరణించారు. మృతులు శ్రీనివాసరావు, కేశవరావుగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన చట్రాయి మండలం చిత్తపూరు గొట్టగూడెంలో చోటు చేసుకుంది.

మరింత +
AP assembly session starts from January 30

ఈనెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

జనవరి 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక ఫిబ్రవరి రెండో వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వస్తుండటంతో ముందుగానే సమావేశాల నిర్వహించనుంది.

మరింత +
AP CM Chandrababu Naidu to inaugurate Damavaram Airport in Nellore today

నెల్లూరు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జన్మభూమి -మా ఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం దామవరంలో 1360 ఎకరాల్లో 334 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేస్తారు. అలాగే బోగోలులో ఒకేసారి 60వేల మందికి సిజేఎస్ఎఫ్ భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. జన్మభూమి -మా ఊరు ఆరవ విడత కార్యక్రమం నేటితో ముగియనుంది. ఎన్నికలకు ముందు చివరి జన్మభూమి కావడంతో జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు చంద్రబాబు నెల్లూరు జిల్లాకు చేరుకుంటారు. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణతో పాటు 110కోట్లతో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలకి సీఎం శంకుస్థాపన చేస్తారు.జువ్వల దిన్నెలో ఉప్పలేరు వాగును సీఎం ప్రారంభించనున్నారు.

మరింత +
Municipality officials removed YS Jagan's Flexis in Tirupathi

జగన్ టూర్: తిరుపతిలో ఫ్లెక్సీల రగడ

తిరుపతిలో వైసీపీ నేతలకు మున్సిపల్‌ అధికారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చారు. తమ పార్టీ అధినేతపై అభిమానం చాటుకునేందుకు తిరుపతిలో రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో అధికారులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వైఎస్ జగన్ జనాదరణ చూసి ఓర్వలేక టీడీపీ కక్షసాధింపు చర్యలకు పూనుకుంటోందని వారు ఆరోపించారు. కమీషనర్ ఆదేశాల మేరకు ఫ్లెక్సీలు తొలగించామని చెప్పి అధికారులు వెనుదిరిగారు.

మరింత +
YCP MLA Roja fire on AP Minister Somireddy Chandra Mohan Reddy over comments on Jagan

మంత్రిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇచ్ఛాపురంలో జరిగిన సభకు వచ్చి ఉంటే జనం కాళ్ల కింద వేసి తొక్కేసేవారని అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభపై మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సభలో జనమే లేరని విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఓడిపోయి మంత్రి పదవి స్వీకరించారంటూ సోమిరెడ్డిని రోజా ఎద్దేవా చేశారు.

మరింత +
Adani Group to put Rs 70,000 cr in Andhra Pradesh data centres

ఆంధ్రప్రదేశ్‌లో డేటా పార్క్‌కు బీజం

ఆంధ్రప్రదేశ్‌లో డేటా పార్క్‌, సోలార్‌ పార్క్‌ల ఏర్పాటుకు 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది. ఏపీ ఐటీ శాఖ, అదానీ గ్రూప్‌ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీల సమక్షంలోనే ఇందుకు బీజం పడింది. ఒప్పందంలో భాగంగా విశాఖ నగరంలో పర్యావరణ హిత డేటా పార్క్‌ను అదానీ గ్రూప్‌ ఏర్పాటు చేయనుంది. రాబోయే 20 ఏళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు వీలుగా 70వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో ఒక గిగా వాట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. 5 గిగా వాట్స్‌ సోలార్‌ పార్క్‌ను కూడా నెలకొల్పుతుంది. ఈ డేటా కేంద్రాన్ని ఇంటర్నెట్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌తో అనుసంధానించడం ద్వారా మెరుగైన ఇంటర్నెట్‌ సేవలు అందించే కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్‌వేర్‌ సప్లయర్స్‌, సాఫ్ట్‌వేర్‌, స్టార్టప్‌ కంపెనీలు, టెలీకాం కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ఐటీ శాఖ భావిస్తోంది.

మరింత +