తెలంగాణ వార్తలు

Pocharam Srinivas Reddy elected as Telangana Assembly Speaker

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి పోటీకి దింపనందుకు సీఎం కేసీఆర్ అన్ని పార్టీల అధినేతలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్పీకర్ కుర్చీలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ కూర్చోబెట్టారు. అటు పిమ్మట అధికార, ప్రతిపక్షనేతలు, సభికులందరూ ఆయనకు అభినందనలు తెలిపారు. సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో తనకు గల అనుబంధాన్ని సీఎం కేసీఆర్ పంచుకున్నారు.

మరింత +
Rahul will decide who is CLP Leader in Telangana, resolution passed by 19 Congress MLAs today

సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని ఎంపిక చేయాలి

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కొత్తవారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని నియమించాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ఇక పార్టీలో కీలక పదవులలో ఉన్న చాలా మంది నేతలకు.. వాళ్ల కుటుంబసభ్యులే ఓట్లు వేయలేదని పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో చెప్పారు. సీఎల్పీ నేత ఎంపికలో రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. CLP నేత ఎంపిక కోసం ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. సీఎల్పీ నేత ఎంపికను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు.

మరింత +
Suspension on 3 Congress MLCs Bhupathi Reddy, Ramulu Nayak and Yadava Reddy in Telangana

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు

తెలంగాణలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈ ముగ్గురిపై సప్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డిలపై ఈ అనర్హత వేటు పడింది. గతంలో గులాబీ నేతలు మండలి చైర్మన్ స్వామి గౌడ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మరింత +
Panchayat 3rd phase elections nominations starts from today in Telangana

పంచాయతీ ఎన్నికల 3వ విడత నామినేషన్లు షురూ

ఇవాళ్టి నుంచి మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నేటి నుంచి 18 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 19న నామినేషన్ల పరిశీలించనున్నారు. 30న మూడోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. మరోవైపు రేపటితో రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అటు మొదటి విడత పంచాయతీలకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి.

మరింత +
Congress MLA Mallu Bhatti Vikramarka fire on CM KCR over not taking oath from elected representatives to Assembly

ఎన్నికై నెల అయినా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం లేదెందుకో?

శాసనసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల చేత నేటి వరకు ప్రమాణ స్వీకారం చేయించకపోవడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. ఎన్నికలు పూర్తయ్యి నెల దాటినా శాసనసభను సమావేశపరచకపోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు .

మరింత +
Vice President Venkaiah Naidu inaugurates Kite and Sweet festival in Parade Ground in Hyderabad

నోరూరిస్తున్న అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ కు వేదికైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వేడుకలను ప్రారంభించారు. ఈనెల 15వరకు జరగనున్న ఈ వేడుకల్లో ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు సందర్శించారు. ఓ వైపు నోరు తీపిచేసే స్వీట్లు మరోవైపు ఆనందాన్ని పంచే గాలి పటాలు అందరినీ ఆకర్షించనున్నాయి.  
మన దేశ సంస్కృతిని చాటే విధంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. స్వీట్ ఫెస్టివల్ లో 22 దేశాలకు చెందిన 1200 రకాల వెరైటీలను ప్రదర్శిస్తారు. మూడు రోజులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శణ, సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు 25 రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల కళా ప్రదర్శణ చేయనున్నారు.  
హైదరాబాద్‌లో నివసించే వివిధ రాష్ట్రాల, దేశాల ప్రజల ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే వేదికగా ఈ అంతర్జాతీయ స్వీట్‌ ఫెస్టివల్‌ను తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన స్వీట్లను ఒకే వేదికపై ప్రదర్శించడంతో ప్రజల మధ్య సాన్నిహిత్యం, పరస్పర గౌరవం పెరుగుతాయని పర్యాటక శాఖ అధికారుల ఆశాభావం వ్యక్త చేస్తున్నారు. దాదాపు లక్ష మంది ఈ ఫెస్టివల్‌కు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరింత +
Telangana State Election Commission to review Panchayat Nominations today

నేటి నుంచి పంచాయితీ నామినేషన్ల పరిశీలన

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యింది. మొత్తం 8,900 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 27,940 నామినేషన్లు దాఖలు కాగా 4,711 తిరస్కరించారు. వార్డు స్థానాలకు 97,690 నామినేషన్లు రాగా 4,189 తిరస్కరణకు గురయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 23,229, వార్డు స్థానాలకు 93,501 నామినేషన్లు అర్హత సాధించాయి. నామినేషన్లపై ఇవాళ్ల విచారణ జరుపనున్నారు.ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. తుది జాబితాను ఆదివారం సాయంత్రం విడుదల చేసి, అదే రోజు గుర్తులను కేటాయించడంతో పాటు ఏకగ్రీవ పంచాయతీలను అధికారికంగా ప్రకటించనున్నారు.  

మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ప్రచార గడువును ఆరు రోజులకే పరిమితం చేశారు. అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించిన తర్వాత ప్రచారాన్ని ప్రారంభించి, పోలింగ్ సమయానికి 38 గంటల ముందు నిలిపివేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. తొలివిడుతకు సంబంధించి సోమవారం నుంచి ప్రచారం ప్రారంభం కానుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారపర్వం ముగుస్తుంది. 21న ఉదయం ఏడు గంటల నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభం అవుతుంది.  

మరోవైపు తొలి విడుతలో 11 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. పరిశీలన అనంతరం నామినేషన్లు మిగలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు చేయకపోగా, మరికొన్నిచోట్ల వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీటిపై పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు 4,137 సర్పంచ్ స్థానాలు, 36,620 వార్డు స్థానాలకు రెండో విడుత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 4,850, వార్డు స్థానాలకు 9,198 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న పోలింగ్ జరుగుతుంది.

మరింత +
About-AquaEx India 2019. 31st January - 2nd February

హైదరాబాద్‌‌లో ఆక్వా ఎక్స్‌పో–2019

హైదరాబాద్‌‌లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఆక్వా ఎక్స్‌పో–2019 జరగనుంది. ఆక్వా ఎక్స్ పోకు సంబంధించిన బ్రోచర్‌ను మత్స్యశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ సుల్తానియా ఆవిష్కరించారు. ప్రపంచ దేశాల నుంచి 52 ఆక్వారంగ సంస్థలు ఈ ఎక్స్‌‌పోలో పాల్గొనన్నట్లు తెలిపారు. మత్ప్యరంగం అభివ‌ృద్దితో పాటు రైతులు, కొనుగోలుదారులు, సరఫరా దారులనూ, పరిశ్రమ నిపుణులనూ ఒక గొడుగు కిందకు తీసుకురావడమే ఎక్స్‌పో ఉద్దేశమని సందీప్ సుల్తానియా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆక్వారంగం అభివృద్దికి ప్రభుత్వం క‌ృషి చేస్తుందన్నారు.

మరింత +
TS RTC arranged Special Buses for Pongal Holidays on extra fair

సంక్రాతి సెలవులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాతి సెలవులు నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసింది. తెలంగాణ, ఏపీలకు వెళ్లేందుకు 5వేల 252 బస్సులను అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రయాణికుల సేవల కోసం 24 గంటలూ అధికారులు అందుబాటులో ఉంటారని, స్పెషల్ బస్ లకు అదనపు చార్జీలు 50 శాతం ఉంటాయని అధికారులు తెలిపారు. ఏపీ నుండి 1,592 బస్సులు తెలంగాణకు, తెలంగాణ నుండి 3వేల 670 బస్సులను నడపనున్న ఆర్టీసీ తెలిపింది.

మరింత +
We must welcome EBC Bill brought by Modi says Telangana BJP Leader Indrasena Reddy

ఈబీసీ బిల్‌‌ను అందరూ స్వాగతించాలి

ఈబీసీ బిల్‌ అనేది అందరూ స్వాగతించాల్సిన అంశం అని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి అన్నారు. పేదలు, బడుగు వర్గాల గురించే బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని చెప్పారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. డబ్బులు లేక చాలా మంది తమ పిల్లలకు మంచి విద్యను అందించలేక పోతున్నారని అన్నారు.

మరింత +
Old Govt School Building students in danger due to Singareni opencast mining bomb blasts  near by schools in Bhadradri Kothagudem District

ప్రభుత్వ పాఠశాలలకు సింగరేణి బ్లాస్ట్ ముప్పు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెనగడపలోని ప్రభుత్వ పాఠశాలలు శిధిలావస్థకు చేరుకుంది. ఇక్కడి జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలను 1970 సంవత్సరంలో నిర్మించారు. వీటి నిర్మాణం జరిగి 50 సంవత్సరాలు గడుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. అదీగాక ఈ పాఠశాలకు కూత వేటు దూరంలో సింగరేణి గౌతమ్ ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. నిత్యం ఈ గనుల్లో బొగ్గు బ్లాస్టింగ్ జరగుతుండటంతో ఆ పాఠశాల తరగతి గదులు, స్లాబ్‌‌లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ గోడ కూలుతుందోనని విద్యార్థులు,టీచర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాల గదుల్లో విద్య నేర్చుంటున్నారు విద్యార్థులు. అయితే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో మద్యం బాబులకు అది అడ్డాగా మారింది. అందుకని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత +
Shops shutdown for demand for Atmakur Mandal as Revenue division in Wanaparthy District

ఆత్మకూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని బంద్

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని రెండు రోజుల బంద్‌కు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంఘాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందగా మూసివేశారు. ఆత్మకూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

మరింత +
Bhadradri Kothagudem Collector Rajath Kumar Saini inaugurates State level sports meet at Bhadrachalam in Telangana

భద్రాచలంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఐటీడీఎ ప్రథమ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పమేళ సత్పతి ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనడమంటేనే విజేతగా నిలిచినట్టని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ తెలిపారు. మిగతా రంగాల్లో గెలుపు ఓటములు ఉంటాయని ఆటల పోటీల్లో ఓటమి అనేది ఉండదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు కలెక్టర్ రజత్‌‌‌‌‌‌‌కుమార్ శైనీ.

మరింత +
MLA Mumtaz Ahmed Khan appoints as Telangana Assembly Pro-tem Speaker

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్‌

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారని సమాచారం.

మరింత +
Former Union Minister Sarve Satyanarayana fire on TPCC Chief Uttam Kumar Reddy

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సర్వే తీవ్ర విమర్శలు

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను సస్పెండ్ చేయాలంటే ఉత్తమ్, కుంతియాకు ప్రోసీజర్ తెలుసా అని ప్రశ్నించారు. పార్టీ ఓడిపోతే రాజీనామా చేయాల్సిన ఉత్తమ్ సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఇచ్చిన ఫండ్ ఏం చేశారని ఉత్తమ్‌ను ప్రశ్నించారు. లూపోల్స్ బయటపెడతాననే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని..ఉత్తమ్, కుంతియా హఠావో.. కాంగ్రెస్ బచావో అని పిలుపునిచ్చారు. కేసుల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని సర్వే సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

మరింత +