డెస్క్ నుండి

Central Home Secrete team fact findings in Telangana Villages over KCR's graph, winner or looser

కేంద్రం నిఘా: కేసీఆర్ కు ఓటమి తప్పదా?

తెలంగాణలో కేంద్ర నిఘా వర్గాలు సంచరిస్తున్నాయా..?ఎన్నికల పరిస్థితులపై ఆరా తీస్తున్నాయా..? టీఆర్ఎస్ పరిస్థితులపై డిల్లీకి ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్తున్నాయా..? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గులాబీ గ్రాఫ్ తగ్గుతూ కూటమి గ్రాఫ్ పెరిగిందనే ప్రచారంపై కేంద్రం ఆరా తీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.  
ఏ రాజకీయ పార్టీకి విజయం వరించేను..?
ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయముంది. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ విజయవకాశాలు ఎలా ఉన్నాయనేదానిపై కేంద్ర హోం శాఖా ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిసింది. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సుమారు 20 మంది అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తుందని ప్రచారముంది. వీరంత కేవలం ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎంత బలముంది.  
టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందా..?
ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై సమాచారం సేకరిస్తున్నారని అధికార వర్గాలు చెపుతున్నాయి. అసెంబ్లీ రద్దు తరువాత టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మెల్ల మెల్లగా తగ్గిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగాఉంది. అది నిజమేనా లేక కేవలం ప్రచారమా.. అనే కోణంలో కూడా కేంద్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయంటున్నారు.  
కేసీఆర్ కుటుంబ పాలనపై కూడా ఆరా..!
టీఆర్‌‌‌‌‌స్ పాలన ఎలా ఉంది కేసీఆర్ ఇచ్చే హామీలు, ఆయన చేసే రాజకీయ ప్రకటనలపై ప్రజలు ఏం అనుకుంటునరనే విషయంపై కూడా కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయట. అదే సమయంలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో పడ్డారట. కూటమి ఏర్పాటు వారి బలబలాలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే అసెంబ్లీ రద్దు తరువాత కెసిఆర్ ఈమెజీ కాస్తా తగ్గిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.  
కూటమి మేనిఫెస్టో కాపీ కొట్టారని గ్రామాల్లో చర్చ..
నెల రోజులుగా గులాబీబాస్ ప్రజలకు దూరంగా ఉండటంతో పాటు కాంగ్రెస్ ఎన్నికల హామీలను కాపీ కోట్టారనే చర్చ గ్రామ స్థాయి ప్రజల్లో ఉన్న విషయాన్ని కేంద్ర నిఘా అధికారులు పసిగట్టారని తెలిసింది.

మరింత +
Complete Plastic Ban in Tirumala Titupathi to maintain Clean and Green Temple

తిరుపతిలో ప్లాస్టిక్ కవర్లపై పూర్తి స్థాయిలో నిషేదం

పరిశుభ్రతలో జాతీయ స్ధాయి అవార్టులు దక్కించుకున్న టీటీడీ.. తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించేందుకు నడుం బిగించింది. ఈ నెల 2న గాంధీ జయంతి రోజు నుంచి తిరుపతినగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ కవర్లపై పూర్తి స్థాయిలో నిషేదం విధించారు. దీంతో తిరుపతి నగరంలో చాలా వరకు ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గిపోయింది. తిరుపతి వాసులు క్లాత్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ లాంటి ప్రత్యామ్నాయ వస్తువులకు అలవాటుపడుతున్నారు. ఈనేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా ప్లాస్టిక్ నిషేధంపై దృష్టిసారించింది టీటీడీ.  
ప్లాస్టిక్ బ్యాగుల వినియోగానికి చెక్..
తిరుమల.. నిత్యం భక్తుల రద్దీతో కిటికిటలాడే పుణ్యధామం. దేశ విదేశాల నుంచి తిరుమలకి వస్తుంటారు భక్తులు. అయితే భక్తులు తమతో తెచ్చుకునే లగేజీలో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు ఉంటున్నాయి. ఇక భక్తుల కోసం ఏర్పడిన హోటల్స్.. షాపులు కూడా ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ కవర్ల వల్ల నష్టాలపై అంతర్జాతీయ స్ధాయిలో విమర్షలు రావడంతో... అతి తక్కువ మైక్రాన్లు గల కవర్లను మాత్రమే టీటీడీ వినియోగిస్తోంది. అయితే తిరుమలలోని హోటళ్లు,దుకాణ సముదాయాల యజమానులు, భక్తులు ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నారు. ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల సంఖ్యతో పాటే.. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ పోగవుతున్నాయి. తిరుమలకి తూర్పువైపున శేషాచలం అడవుల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో టీడీపీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తోంది. అయితే ఈ ప్లాస్టిక్‌ కవర్ల ప్రభావం ఇప్పటికే తిరుమల శేషాచలం అడవులపై పడింది. వర్షపునీరు భూమిలోకి చేరకపోవడంతో తిరుమలలో భూగర్బ జలాల సంఖ్య ఇప్పటికే బాగా తగ్గింది.  
ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ కవర్ల సమస్యనే..
ప్లాస్టిక్ కవర్ల సమస్య ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. నేడు ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ కవర్ల సమస్య ఎదుర్కుంటోంది. ప్లాస్టిక్ క‌వ‌ర్లు మ‌ట్టిలో పూర్తిగా క‌లిసేందుకు 10 సంవ‌త్స‌రాల నుండి వెయ్యి సంవ‌త్స‌రాలు, వాట‌ర్ బాటిల్ భూమిలో క‌లిసేందుకు 450 సంవ‌త్స‌రాల కాలం ప‌డుతుంద‌ని అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. ఒక్క భార‌త‌దేశంలో రోజుకు 25 వేల ట‌న్నుల ప్లాస్టిక్ వ్య‌ర్థాలు పోగ‌వుతున్నాయని అంచనా. వీటిని తిరిగి పూర్తిగా సేక‌రించి రీసైక్లింగ్ చేయలేని ప‌క్షంలో ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ప్లాస్టిక్ క‌ప్పులు, క‌వ‌ర్లు, ప్లేట్ల‌లో ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌డం వ‌లన ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు వ‌చ్చే ప్ర‌మాద‌ం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  
గాంధీ జయంతి నుంచి తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్..
తిరుమలలో ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించి భక్తులకు మార్గదర్శకంగా ఉండాలని టీటీడీ భావిస్తుంది. ఇలా చేయడం వల్ల స్వతహాగా భక్తులు తమ తమ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ రెండు నుంచి తిరుపతి నగర పాలక సంస్థలోనూ ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించి విజయవంతంగా అమలు చేస్తున్నారు. మొత్తానికి రానున్న రోజులలో తిరుమలలో ప్లాస్టిక్ కంటికి కనిపించకుండా ఉండేలా టీటీడీ కఠినచర్యలు తీసుకుంటోంది.

మరింత +
High Court Gives Green Signal for TSPSC Group 2 Recruitment Process

సుదీర్ఘ విచారణ అనంతరం గ్రూప్ 2కు మోక్షం

ఉద్యోగాల నియామకాల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 ఇంటర్వ్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుదీర్గ విచారణ అనంతరం దీనిపై వాదనలు విన్న కోర్టు తుది తీర్పును ఇచ్చింది.  
ఏడాది ఎదురు చూపు...
2015 డిసెంబర్‌లో తెలంగాణా ప్రభుత్వం గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయడంతో టీఎస్పీఎస్సీ 1032 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. 2017 నవంబర్ 11,13 తేదిల్లో నిర్వహించిన రాత పరీక్షకు 5.65 లక్షల మంది హాజరయ్యారు. అయితే 2017 జూన్ 2న  ఫలితాలు విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఫలితాలు విడుదలైన తర్వాత 2017 అక్టోబర్ నెలలో 3వేల మందికి పైగా అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లను పరిశీలించింది.  
గ్రూప్-2 పరీక్షలో అక్రమాలు...
అయితే, గ్రూప్-2 పరీక్షల్లో పలు అక్రమాలు జరిగాయని, డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను, వైటనర్ ఉపయోగించిన వారి ఆన్సర్ షీట్లను కూడా లెక్కలోకి తీసుకున్నారంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే పరీక్షా పత్రంలో కూడా కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయనే అంశం పై కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో గతంలో వచ్చిన ఆరోపణల పై విచారణ చేసిన హైకోర్టు సర్టిఫికెట్ల పరిశీలన నిలిపేయాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి భర్తీ ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశించింది. దీంతో ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది.  
హైకోర్టు తీర్పు...
తాజగా జరిగిన విచారణలో అభ్యర్థుల ఇంటర్వ్యూలకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు నిచ్చింది. వైట్‌నర్‌, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన 267మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గ్రూప్‌-2లో అర్హత సాధించిన 3,147మంది అభ్యర్థులకు 1:2 పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. అలాగే ప్రశ్నాపత్రంలో తప్పుగా ఉన్న 19 ప్రశ్నలకు టీఎస్పీఎస్సీ గైడ్ లెన్స్ ప్రకారం అందరికి స్కేల్ పద్దతిలో మార్కులను జమ చేయాలని హైకోర్టు సూచించింది.  
ఆనందం వ్యక్తం చేసిన అభ్యర్థులు...
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు తమకి ఎంతో ఆనందంగా ఉందని గ్రూప్ 2 అభ్యర్థులు తెలిపారు. ఇక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.

మరింత +
Telangana assembly polls: High Court can extend date for voter list publication says SC

ఎన్నికల నోటిఫికేషన్‌కు ఓటర్ల జాబితా కేసు అడ్డు

ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఈనెల 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించాలన్న ఈసీఐ నిర్ణయానికి అడ్డంకి ఎదురైంది. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ‘ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ’ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేమంటూ జిల్లా కలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడు రోజులు గడువును పొడిగించాలని కోరుతూ సీఈఓ అధికారి రజత్ కుమార్‌కు జిల్లాల కలెక్టర్లు లేఖ రాశారు. షెడ్యూల్‌ ప్రకారం గత నెల 10 నుంచి 25 వరకూ కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు కలిపి 13,15,234 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఈ నెల 4 లోగా సరిచేసి ‘ఈఆర్వో నెట్‌’ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉండగా, సాంకేతిక లోపాల వల్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దరఖాస్తు స్వీకరించి 7 రోజులు గడవకముందే ఉత్తర్వులు జారీ చేయరాదు అని ఈఆర్వో నెట్‌ వెబ్‌సైట్‌ నుంచి అలర్ట్‌ వస్తుండడంతో గడువు ముగిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లో నిలిచిపోయాయి. ఓటర్ల జాబితా సవరణకు కనీసం మూడు నెలల సమయం అవసరం కాగా, రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కేవలం నెల రోజుల వ్యవధితో ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. నిజానికి జూలైలో ప్రారంభమైన ఓటర్ల జాబితా తొలి సవరణ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరిలో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాదే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్న ఈసీఐ ఓటర్ల జాబితా తొలి సవరణను నిలుపుదల చేసి రెండో సవరణ కార్యక్రమానికి కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బూత్‌ స్థాయి అధికారి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. కాగా, ఊహించని విధంగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆ ప్రక్రియ ఉన్నపళంగా నిలిచిపోయింది. షెడ్యూల్‌ ప్రకారం గడువులోగాచతుది ఓటర్ల జాబితాల ప్రకటన అసాధ్యమేనని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం గడువు పోడిగిస్తే ఈ నెలాఖరులో తుది ఓటర్ల జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది.

మరింత +
Vote for Note: ED Raids on Revanth Reddy

ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి..

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ఓటుకు కోట్లు కేసు మరోసారి చర్చనీయాంశమవుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసంలో ఐటి దాడుల నేపద్యంలో 2015 జూన్ లో జరిగిన ఓటుకు కోట్లు కేసుకు సంబంధం ఉందని పోలీసు వర్గాల సమాచారం.  
ఆనాడు ఏం జరిగిందంటే..?
పోలీసుల కధనం ప్రకారం 2015 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందంటే టిడిపి తరఫున ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్ రెడ్డి పోటీ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మిత్రుడు నరేందర్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని అప్పటి టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాన్ని రచించుకున్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీ సీటును గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం టిడిపికి లేదు. దాంతో రేవంత్ రెడ్డి ఎలాగైనా తన మిత్రుడు వేంనరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకుని, తెలంగాణ టిడిపిపై పట్టు సాధించాలనుకున్నారు. అధికార టిఆర్ ఎస్ కు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసే స్కెచ్ వేశారు. వేం నరేందర్ రెడ్డికి ఓటు వేస్తే స్టీఫెన్ సన్ కు ఐదు కోట్లు రేవంత్ రెడ్డి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా రేవంత్‌ రెడ్డి అడ్వాన్స్ గా స్టీఫెన్ సన్ కు 50 లక్షలు ఇస్తుండగా రెడ్‌ హ్యాండె‌డ్‌గా అవినీతి నిరోధకశాఖ పట్టుకుంది.  
2015 జూలై 28న మొదటి చార్జిషీట్‌
ఈ కేసులో రేవంత్ రెడ్డి సహా ముగ్గురు నిందితుల్ని ఏసీబి అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఇది ఓటుకు కోట్లు కేసుగా పాపులర్ అయింది. ఈ కేసులో ముందుగా అరెస్టయిన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర, ఉదయ్‌సింహలను విచారించిన ఏసీబీ అధికారులు 2015 జూలై 28న మొదటి చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఆడియో, వీడియో శాంపిల్స్, స్టీఫెన్‌సన్, సెబాస్టియన్, రేవంత్, తదితరుల ఫోరెన్సిక్‌ రిపోర్టులను 2017 మార్చిలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో పొందుపరిచారు.  
మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ..
స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపడానికి ముందే చంద్రబాబునాయుడు ఆయనకు ఫోన్‌ చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రలోభాలకు గురిచేసిన ఆడియో టేపులు అప్పట్లో సంచలనం రేపింది. మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ అంటూ చెప్పిన పదాలు చంద్రబాబువేనా..? కాదా..? అన్నదే సర్వత్రా ఉత్కంఠ.  
చంద్రబాబు ఆడియో కలకలం..
ఈ ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన FSL నివేదిక ఇటీవలే కోర్టుకు చేరినట్లు సమాచారం. అటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సిఎం టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడిన ఆడియోను ధ్రువీకరించుకునేందుకు ఏసీబీ చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి కాకుండా చండీగఢ్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో వాయిస్‌ను శాంపిల్‌ను పరీక్ష చేయించింది. అంతకుముందే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం చంద్రబాబు ఆడియో శాంపిల్స్‌ను ఓ ప్రైవేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో పరీక్ష చేయించారు.  
ఫోరెన్సిక్‌ విభాగం ఇటీవలే నివేదిక..
అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే ఈ కేసులో రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. రేవంత్‌ రెడ్డిని ఏ–1 నిందితుడిగా పేర్కొన్న ఏసీబీ మొదటి చార్జిషీట్‌లో ఏపీ సిఎం టిడిపి అధినేత చంద్రబాబు పేరు 22 సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ తర్వాత స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డులో ఆ వాయిస్‌ చంద్రబాబుదా కాదా అని నిర్ధారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టింది. ఆడియో టేపులను చండీగఢ్‌ ఫోరెన్సిక్‌ విభాగానికి పంపింది. అది చంద్రబాబు వాయిసేనంటూ ఫోరెన్సిక్‌ విభాగం ఇటీవలే నివేదిక ఇచ్చింది. కారణమేంటో గానీ మూడు సంవత్సరాలుగా ఈ కేసు ఏ మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పటివరకు ఈ కేసులో రేవంత్‌రెడ్డి ఏ–1గా ఉండగా, సెబాస్టియన్‌ ఏ–2గా, తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏ–3గా, ఉదయ్‌సింహ ఏ–4గా, జెరూసలెం మత్తయ్య ఏ–5గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో నిందితుడిగా చంద్రబాబు పేరు తెల్చుతారా తేలితే ఏ1గా చేర్చుతారా ఏ6గా తేల్చుతారా అన్నది దానిపై ఉత్కంఠ నెలకొంది.  
అప్రూవర్‌గా మారిన జెరూసలేం..
మరో వైపు ఇప్పటికే సుప్రీం కోర్టులో మత్తయ్య జెరూసలేం తాను అప్రూవర్‌గా మారానని అన్ని విషయాలు చెబుతానని సర్వోన్నత న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీ నుంచి చంద్రబాబు వాయిసేనని తేల్చి ACB కోర్టు నుంచి ఆయన్ను విచారణ జరపాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై ACB కోర్టు విచారించాలని అదేశించింది. అయితే ఆళ్ల పిటిషన్‌పై హైకోర్టులో స్టే కొనసాగుతోంది. స్టే ఎత్తివేయాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

మరింత +
Maoists out break in Vishaka Agency , High alert in AOB

మన్యంలో దాడి: నక్సలైట్లే లేరన్న నేతలకు షాక్

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి తగ్గిందని అనుకున్న ప్రతీసారి.. ఎక్కడో ఒకచోట.. హత్యాకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. తమ బలం నిరూపించేందుకు ఈసారి మావోలు విశాఖ మన్యంలో తెగబడ్డారు. ఓ ఎమ్మెల్యేను చంపడం మన్యంలో ఇదే తొలిసారి. దాంతో ఏజెన్సీ ప్రాంతంలో భయోత్పాతం నెలకొంది. నిజానికి విశాఖ మన్యంలో మావోయిస్టులు చాలాకాలం నుంచి స్తబ్దుగా ఉన్నారు. గ్రే హౌండ్స్‌ దళాలు, ఒడిశా పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు ఉనికే ప్రశ్నార్దకంగా మారింది. ఈ నేపథ్యంలో మావోలు మళ్లీ తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  
మావోల ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో...
విశాఖ జిల్లాలోనే కాదు ఆంధ్రా ఓడిస్సా సరిహద్దుల్లో మావోల ప్రాబల్యం తగ్గిందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గ్రేహౌండ్స్ బలగాలు భారి స్థాయిలో మోహరించడం వరుస కూంబింగ్ లతో అటు సరిహద్దు రాష్ట్రం ఓడిస్సా పోలీసులతో సంయుక్తంగా నిర్వహిస్తున్న గాలింపుతో మావోల ప్రాబల్య౦ తగ్గిందని ప్రచారం జరిగింది. దానికి తోడు వరుస ఎదురు దెబ్బలతో పాటు రిక్రూట్ మెంట్ నిలిచిపోవడంతో మావోయిస్టులు భారీ దాడులకు కూడా సాహసం చేసే పరిస్థితుల్లో వారు లేరనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి చంపడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
భద్రతా బలగాల కూంబింగ్‌తో జల్లెడ పట్టినా...
నిజానికి వరుస ఎదురు దెబ్బలతో సతమవుతున్న మావోలు ఇటీవలి కాలంలో బలం పుంజుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అటు చత్తీస్గఢ్ సహా ఓడిస్సా రాష్ట్రాల్లో, ఆంధ్రా ఓడిసా బోర్డర్ లో భద్రతా బలగాలు కూంబింగ్ ని విస్తృతం చేస్తున్న నేపధ్యంలో వెనక్కు తగ్గిన మావోలు ప్రజాప్రతినిధులే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెలలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అలజడి రేగింది. హిట్‌ లిస్ట్ తయారు చేశారంటూ అప్పుడే ప్రచారం జరిగింది.  
వారోత్సవాలు, పోస్టర్ల ద్వారా వార్తల్లోకి వచ్చిన మావోలు...
ఇటీవల మావోయిస్టులు వారోత్సవాలు జరపడం, పోస్టర్లు ఏర్పాటుచేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సీపీఐ ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ గ్రూప్‌, మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా లు విలీనమై 2004 సెప్టెంబర్‌ 21న సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించాయి. అప్పట్నుంచి ఏటా ఇదే రోజు నుంచి వారం రోజులపాటు మావోయిస్టులు విలీన వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వారోత్సవాల సమయంలో తమ ఉనికిని చాటుకోవడం కోసం.. హత్యలు.. విధ్వంసాలకు పాల్పడటం వంటి దుశ్చర్యలకు దిగుతుంటారు. ఆయా సమయాల్లో పోలీసులు అప్రమత్తమవుతారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ దళాలతో కూంబింగ్, గాలింపు చర్యలు వంటివి ఉధృతం చేస్తారు.  
ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసినా..
అయితే ఈసారి మావోల కదిలికలు అంతగా లేకపోవడంతో.. ప్రస్తుతం జరుగుతున్న విలీన వారోత్సవాలను పోలీసులు అంత సీరియస్ గా తీసుకోలేదు. పైగా ఏపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సర్వే చేసేందుకు తరలించింది. దీంతో ఇదే అదనుగా 65మందితో కూడిన మవో దళం ప్రజాప్రనిధులపై దాడికి పథక రచన చేసి కొద్ది రోజులుగా మన్యంలో సంచరిస్తూ.. ఈ ఘాతుకానికి తెగబడ్డారు.అయితే మావోల అలజడి నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు భద్రత లేకుండా పర్యటనలకు వెళ్లొద్దని ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఈ క్రమంలోనే భద్రత లేకుండా గ్రామ పర్యటనకు వెళ్లిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మావోయిస్టుల తూటాలకు బలయ్యారు.  
దేశచరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ జరిగినా..
మావోయిస్టులకు విశాఖ మన్యం పెట్టనికోట. ఖాకీ చొక్కా అటువైపు తొంగి చూడలేదనే మాటలు వినిపించేవి. రామ్‌గుడ పరిసరాల్లో 2016 అక్టోబర్‌ 24న మావోయిస్టులపై ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు 30 మంది నక్సల్స్‌ను హతమార్చారు.ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు కీలక నేతలు సైతం ప్రాణాలు కోల్పోవడంతో.. ఏవోబీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పోలీసులు భావించారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా పేర్కొనే.. పోలీసుల ఏకపక్ష యుద్ధంలో కీలక నేతలు నేలకొరగడం మావోలకు మింగుడు పడలేదు. ప్రతీకారంతో రగిలిపోయారు. అదనుకోసం ఎదురుచూశారు. ఏజెన్సీలో అడపాదడపా ఉనికి చాటుతూనే వచ్చారు. చివరకు ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా, మన్యంలో తమ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు తెగబడ్డారు.  
మన్యంలో జంట హత్యలతో మళ్లీ వెలుగులోకి..
మావోయిస్టులు మన్యంపై తమ పట్టు కోల్పోలేదని చాటడంతో పాటు భయం పుట్టించేందుకే ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధిపై విరుచుకుపడి హతమార్చినట్టు తెలుస్తోంది. గతంలో రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌ సమయంలో 11 మంది మహిళా మావోయిస్టులు మరణించారు. ఈ కారణంగానే ఈ జంట హత్యల వ్యవహారంలో సింహభాగం మహిళా యాక్షన్‌ టీమ్‌ సభ్యులే పాల్గొన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ ఘటన నేపథ్యంలో నక్సలైట్స్ తెలుగు రాష్ట్రాలపై పట్టుసాధించేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత +
Araku MLA Among 2 TDP Leaders Gunned Down by Maoists in Andhra Pradesh

విశాఖలో ఇద్దరు టీడీపీ నేతల కాల్చివేత

అడవిలో అలజడి మొదలైంది. ఆకుపచ్చటి భూమి నెత్తురోడింది. మావోయిస్టుల భయం మళ్లీ మొదలైంది. కొన్ని రోజులుగా వారోత్సవాలు జరపడం, పోస్టర్లు ఏర్పాటుచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు... విశాఖ మన్యంలో ఘాతుకానికి పాల్పడ్డారు. అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను దారుణంగా కాల్చి చప్పారు. డంబ్రిగూడ మండలం లిప్పిట్టిపుట్టు వద్ద సుమారు 60 మంది మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల దాడిని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ నిర్ధారించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.  
గ్రామ దర్శిని పోగ్రాంమ్ కు వెళ్లి వస్తుండగా..
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇవాళ ఉదయం 11 గంటల వరకూ అరకులోనే ఉన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శివేరు సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామ దర్శిని కార్యక్రమానికి బయలుదేరారు. మార్గమధ్యలో అడ్డుకున్న మావోయిస్టులు ఇద్దరు గన్ మెన్ల వద్ద ఉన్న వెపన్స్ ను స్వాధీనం చేసుకొని వారిని పంపించారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను దూరంగా తీసుకొళ్లి గంటసేపు విడివిడిగా చర్చించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు చెందిన గూడ క్వారీపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణం దెబ్బతింటున్నందున క్వారీని మూసివేయాలని హెచ్చరించారు. అయితే బెదిరింపులకు దిగడం సరి కాదనీ ఏమైనా ఉంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే వారించడంతో ఆగ్రహం చెందిన మావోయిస్టులు తుపాకులు ఎక్కుపెట్టి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ అక్కడికక్కడే నేలకొరిగారు.  
వార్నింగ్ ఇచ్చినా మాట వినడంల లేదని..
విశాఖ మన్యంలో కొంత కాలం మావోయిస్టులు సైలెంట్ అయ్యారు. గ్రే హౌండ్స్‌ దళాలు, ఒడిశా పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేయడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్దకంగా మారింది. అయితే కొంత కాలంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారోత్సవాలు, పోస్టర్ల ఏర్పాటు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే కిడారికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు నిఘా వర్గాలు సైతం నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సర్వేశ్వరరావు...మాజీ ఎమ్మెల్యే శివేరు సోమతో కలిసి గ్రామ పర్యటనకు వెళ్లడంతో మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.  
రామకృష్ణ నేతృత్వంలోనే ఈ దాడి..
ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టులను జల్లెడ పట్టేందుకు కూబింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  
చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి..
అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న ఆయన... అధికారులతో మాట్లాడి వివరాలు తెల్సుకున్నారు. ఇటీవలె కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుంచి టీడీపీ చేరారు. కిడారి మృతిపట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరింత +
Love marriage couple murdered by tragedy parents in Hyderabad

అదుపులోలేని పిల్లలు, దారి తప్పుతున్నపేరెంట్స్

మిర్యాలగూడ తరహా మరో ఉదంతం హైదరాబాద్ నగరంలో జరిగింది ప్రణయ్ వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే ఎర్రగడ్డ లోని గోకుల్ థియేటర్ సమీపంలో తండ్రి మనోహర్ ఆచారి కన్నకూతురిపైనే కత్తితో తెగబడ్డాడు. మనోహర్ ఆచారి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ కూతురుఅల్లుళ్లు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సందీప్ ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వటంతో అతనిని డిస్చార్జ్ చేశారు. మాధవి మాత్రం ఇంకా యాశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం మాధవి పరిస్తితి కొద్దిగా మెరుగుపడుతుంది. మూడు సర్జరీలు చేసిన యశోదా వైద్యులు అన్నీ కూడా విజయవంతమైనట్లు యశోద హాస్పిటల్ డాక్టర్స్ టీం హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. మాధవి భర్త సందీప్ మాత్రం మాధవిని వేరు చేయడానికి మధవి తండ్రితో పాటు తల్లికూడా ప్రయత్నించిందని తెలిపాడు. ఇంత ఘాతుకానికి పాల్పడిన మనోహర చారిని ఉరితీయాలని సందీప్ డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఇద్దరిపై దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పరారైన మనోహర చారి పోలీసుల ముందు లొంగిపోయాడు. తాగిన మైకంలోనే దాడికి తెగబడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్నాడని అనుమానించి చూడగా, 353 పాయింట్ల ఆల్కహాల్ని సేవించినట్లు తేలింది. పోలీసులు విచారించడంతో మనోహర చారి తాను చేసిన తప్పును పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుని రిమాండ్కు తరలించారు. కులాంతర వివాహాలపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాధవిని మందకృష్ణ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మందకృష్ణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. వరుసగా ఇలాంటి కులాంతర ఘటనలు జరుగుతున్న క్రమంలో శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. వరుస ఘటనలపై దేశం మొత్తం చర్చించుకుంటే కేసీఆర్ మాత్రం మౌనం వహించడం దేనికి నిదర్శనం అని మందకృష్ణ ధ్వజమెత్తారు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అటు పిల్లల్ని తల్లితండ్రులు, అలాగే తల్లిదండ్రుల ప్రేమను పిల్లలు అర్థం చేసుకుంటే ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగవు.

మరింత +
MLC Raja Gopal reddy fire on Telangana Congress in-charge Kuntiya

సేవ్ కాంగ్రెస్ ఉద్యమం: టీపీసీసీలో గుబులు

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సేవ్ కాంగ్రెస్ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ ల‌పై ఎదురుదాడికి దిగారు. ఆది నుంచి పార్టీకి అండగా ఉంటున్న త‌మ‌కు స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని ఆయన ఆవేశపడ్డారు. పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలందరూ.. కమిటీ కూర్పుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కమిటీల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తామ‌ని ఇప్పుడు మాట మార్చార‌ని మండిప‌డ్డారు. అయితే అనూహ్యంగా అధిష్టానం ఈ పదవిని మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ కమిటీలో కోమటిరెడ్డికి స్థానం కల్పించక పోవ‌డం విడ్డూరం అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మేనిఫెస్టో కమిటీతో పాటు పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించగా ఆ పదవులు వారి సేవకు తగిన విధంగా లేవని కోమటిరెడ్డి అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఎన్నికల కమిటీలో రాజగోపాల్‌రెడ్డికి అవకాశం కల్పించారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై అధిష్టానం కొంత అభిమానాన్ని చూపించినప్పటికీ, పూర్తిగా సంతృప్తికర పదవులను ఇవ్వలేకపోయిందన్న చర్చ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఉంది. అందుకే అసంతృప్త నేత‌లతో క‌ల‌సి సేవ్ కాంగ్రెస్ ఉద్య‌మాన్ని ముందుకు తెస్తున్నారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.
పార్టీలో బ్రోకర్లకు కమిటీలో స్థానమా?
కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన కమిటీల కూర్పు.. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రాజ్ గోపాల్ రెడ్డితోపాటు మరికొందరు  నేతల్లోనూ ఆగ్రహాన్ని తెప్పించింది. నియామకాలను తప్పుబడుతూ.. అధిష్టానం పెద్దలపై నిప్పులు చెరిగారు. సూటిగా మాట్లాడే రాజగోపాల్‌ రెడ్డి నేరుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియానే టార్గెట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కుంతియా శనిలా దాపురించారంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కమిటీల్లో బ్రోకర్లకు స్థానం కల్పించారని.. కనీసం వార్డు మెంబర్లుగా కూడా గెలవని వారికి కమిటీల్లో చేర్చడమేంటని కుంతియాని నిలదీశారు. కాంగ్రెస్‌ తప్పుడు నిర్ణయాల వల్లే... గతంలో అధికారంలోకి రాలేకపోయామని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  
పైరవీకార్లను పక్కన పెట్టాలన్న కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం ధారపోస్తే తమను రెండున్నర ఏళ్లు పక్కన పెట్టారని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన చెందారు. తమను అడుగడునా అవమానించారని చెప్పుకొచ్చారు.  పార్టీ కోసం కష్టపడితే ఇదా ఫలితం అని ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. ప్రజల కోసమే బతుకుతున్నామన్నారు.  కోమటిరెడ్డి బ్రదర్స్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా పైరవీకార్లను పక్కన పెట్టి.. పార్టీ కోసం కష్టపడే వారికి టిక్కెట్లు ఇస్తేనే పార్టీ గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.   
తెలంగాణ కాంగ్రెస్‌లో గుబులు..
రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌నే టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. పార్టీలో కమిటీల కూర్పు తలనొప్పిగా మారగా దీనిపై అధిష్టానం పెద్దలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత +
Rahul Gandhi South India Election Campaign starts from Kurnool Today

టార్గెట్ 2019: విభజన హామీలే రాహుల్ అస్త్రాలు

ఏపీ పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలే అస్త్రాలుగా అడుగులు వేస్తున్నారు. ఏఐసీసీ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడి రాహుల్‌ గాంధీతోనే హామీలు ఇప్పిస్తే ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రణాళికలు రచించారు. కార్యకర్తల్లో జవసత్వాలు నింపి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది.  
తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ ప్రచార పర్వం..
తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకున్న పార్టీకి జవసత్వాలు నింపి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆగస్టులో రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ.. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలీయమైన శక్తిగా మార్చడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందుకు కర్నూలు సభనుంచే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బలమైన అడుగులు వేస్తున్నారు.. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుపై వంచించబడ్డ ఆంధ్రాకు వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్న భరోసా ఇచ్చేలా రాహుల్‌ పర్యటన దోహదం చేస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడైన తర్వాత మొట్టమెదటిసారిగా రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ పర్యటించడం చాలా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ఎన్నికలకు సమాయత్తం చేయడానికే ఈ సమావేశం అని, దీనిలో దాపరికమేమీ లేదని రఘువీరా పేర్కొన్నారు.  
ప్రత్యేక హోదా కాంగ్రెస్ నినాదం..
2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రులకు మాట ఇచ్చామనీ, దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. తెలంగాణ పర్యటనలోనూ జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇచ్చిన మాటను అంత తేలిగ్గా తీసుకోం. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని ఏపీ ప్రజలకు తాను మాటిస్తున్నా’ అని రాహుల్ తెలిపారు. ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలపై దృష్టి సారిస్తూ బీజేపీయేతర రాష్ట్రాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.ప్రత్యేక హోదా విషయంలో ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడటం సరికాదని.. అధికారంలోకి వస్తే వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికే సిడబ్ల్యూసీలో నిర్ణయించారు. కర్నూలు సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తమ వైఖరిని తెలుపుతూ రాహుల్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.  
వ్యతిరేక పవనాలకు చెక్ పెడుతూ..
2014తో పోలిస్తే.. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గిందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న కోపం, కసి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ మీదకు మళ్లాయని అంచనా వేస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడంతోపాటు మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారు.  
ఏపీ, తెలంగాణలో పొత్తులపై క్లారిటీ..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌చాందీ చెప్పారు. అక్టోబరు 2 నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పేర్కొన్నారు. మా పొత్తు ప్రజలతోనే అని తెలిపారు. కర్నూలులో సభకు సత్యమేవ జయతే అని నామకరణం చేశారు. అటు 25 ఎంపీ సీట్లు గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విన్నవించేందుకు అక్టోబర్‌ 2 నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది.. ఈనెల 24న రాష్ట్ర నేతలతో సమావేశమై యువత, మహిళలు, రైతులు, ప్రజలకు భవిష్యత్తుపై ఎలాంటి భరోసా ఇవ్వాలనే విషయంపై చర్చించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లనున్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌ బలోపేతం కావాలనే రాహుల్‌గాంధీ సూచించారన్నారు. తెలంగాణలో పొత్తులున్నంత మాత్రాన ఆంధ్రాలో ఉండాలన్న నిబంధనేమీ లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి ఏపీలో రాహుల్ గాంధీ పర్యటన కాంగ్రెస్ లో నూతోత్సాహం నింపుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరింత +
TRS Operation Akarsh failure in Nalgonda due to increasing rebels

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కాస్తా వికర్షిస్తోంది..!

టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ వికర్షిస్తుందా..? నాడు పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నేడు తలనొప్పిగా మారిందా..? పరిస్థితులు చూస్తే నిజమేననిపిస్తోంది. కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత నియోజక వర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. ప్రత్యేక సమావేశాలు సవాళ్లతో గులాబీ పార్టీ అట్టుడుకుతుంది. నల్గొండ జిల్లాలో వర్గపోరు ఎక్కువైంది.  
నల్గొండ జిల్లా గులాబీ నేతల్లో టికెట్ల లొల్లి..
నల్గొండ జిల్లాలోని గులాబీ నేతల్లో వర్గ పోరు రాజుకుంది. అధిష్టానంపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి పేరును ఖరారు చేయడంపై సీనియర్ నేతలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ కేటాయించడమేంటని అధిష్టానంపై నాయకులు, కార్యకర్తలు గుర్రు మీద ఉన్నారు. కంచర్ల భూపాల్ రెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి రాకముందు నుంచి పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం పని చేసిన నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్... నియోజకవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న దుబ్బాక నర్సింహారెడ్డి... చాడ కిషన్ రెడ్డి.. తిప్పర్తి జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, కంచర్ల భూపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న వారంతా తమ అనుచర వర్గంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం తిప్పర్తి జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని పిలుపునివ్వడం టీఆర్ఎస్‌లో చర్చకు దారితీసింది.  
నాగార్జునసాగర్ లో అసంతృప్తి జ్వాలలు..
అలాగే నాగార్జునసాగర్ నియోజవకర్గంలో కూడా అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ ఇంచార్జ్‌గా కొనసాగుతున్న నోముల నర్సింహయ్యకు టికెట్ కేటాయించడంతో, ఎంసీ కోటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదువేల మంది కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నోముల నర్సింహ్మయ్య లోకల్ వ్యక్తి కాదని , జానారెడ్డి లాంటి సీనియర్ నేతను ఢీ కొట్టాలంటే ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తి ఉండాలని ఎంసీ కోటిరెడ్డి అంటున్నారు.  
దేవరకొండ నియోజకర్గంలో సుధీర్ఘ చర్చ..
ఇక దేవరకొండలో సీపీఐ పార్టీ నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన రవీంద్రకుమార్‌కు టికెట్ కేటాయించడంతో... ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్న బాలు నాయక్ కూడా అసంతృప్తితో ఉన్నారు. తమ కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. అవరమైతే బాలు నాయక్ పార్టీని వీడిన ఆశ్చర్యపోనవసరం లేదని దేవరకొండలో చర్చ సాగుతోంది. మునుగోడు నియోజకవర్గం నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై.. ఉన్నవేనేపల్లి వెంకటేశ్వరరావు కినుక వహించారు. తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కూసుకుంట్లకు టికెట్ ఇవ్వడంపై వ్యతిరేకతను తెలియజేశారు.  
మిర్యాలగూడెంలో బాస్కర్ రావుకు వ్యతిరేకంగా..
అలాగే మిర్యాలగూడెంలో బాస్కర్ రావుకు వ్యతిరేకంగా అల్గుబెల్లి అమరేందర్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలో గాదరి కిషోర్‌కు వ్యతిరేకంగా మందుల సామేల్ వర్గీయులు ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలో అసంతృప్తులు ఎక్కువ కావడానికి మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాన కారణమని పార్టీలో పలువురు నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను కాదని వేరే వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడంతో.. ఇప్పుడు ఆ ప్రాధాన్యమే తలనొప్పిగా మారిందని నేతలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాలలో తాను ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తులకు టికెట్లు రాకపోవడంతో మంత్రికి అసంతృప్తుల సమస్య తలనొప్పిగా మారింది.  
ఉద్యమకారులను పక్కన పెట్టిన టీఆర్ఎస్..
పార్టీని బలోపేతం చేసుకోవడానికి టీఆర్ఎస్ వెనుకా ముందు చూడకుండా పదవులు ఆశ చూపించి వివిధ పార్టీలకు చెందిన నాయకులకు అడ్డగోలుగా చేర్చుకుంది. ఇపుడు వివిధ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులను సంతృప్తి పరచడానికి ఉద్యమకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని, పార్టీకి పనిచేసి వారిని పక్కనపెట్టింది. దీంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి.. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత ఒక్కసారిగా బయటపడింది. దీంతో టీఆర్ఎస్ నాయకులు ఈ అసంతృప్తిని చల్లార్చడానికి మల్లగుల్లాలు పడుతున్నారు.

మరింత +
Nizamabad TRS leaders fire on KCR over Assembly candidates

నిజామాబాద్ జిల్లాలో గులాబీ కలవరం

టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. సిట్టింగులకే టికెట్లు కేటాయించడంపై అసంతృప్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ వస్తుందని ఆశించిన వారు నిరాశ చెందారు. ఇప్పటివరకూ ఒకే పార్టీలో ఉన్నవారు పక్క పార్టీలకి వెళ్లేందుకు మొగ్గుచూపడంతో.. గులాబీలో కలవరం మొదలైంది.  
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు.. నేతల గుర్రు
గ‌త ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లాలో ప్ర‌జ‌లు టిఆర్ఎస్‌కు ప‌ట్టం క‌ట్టారు. 9 అసెంబ్లీ 2 పార్ల‌మెంట్ స్ధానాల్లో టిఆర్ఎస్ అభ్య‌ర్ధుల‌నే ఇక్క‌డి ఓట‌ర్లు గెలిపించారు. అయితే ఈ సారి ముంద‌స్తు ఎన్నికల్లోనూ 9 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు. అయితే సిట్టింగులకే టికెట్లు కేటాయించ‌డం పై పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా త‌మ‌కు అవకాశం లభిస్తుందని ఎదురుచేసిన వారికి నిరాశే మిగిలింది. దీంతో అసంతృప్తి నేత‌లు ఇత‌ర పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.  
టీఆర్ఎస్ లో పెరిగిన అసంతృప్తులు..
ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో 5 నియోజ‌క‌వ‌ర్గాల్లోని టీఆర్ఎస్ అసంతృప్తలు పక్క పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ నేత రాజ్య‌స‌భ స‌భ్యులు డిఎస్ ఇప్ప‌టికే పార్టీ వీడేందుకు సిద్ద‌మ‌య్యారు. ఆయ‌న పై స‌స్పెన్ష‌న్ కోరుతూ లేఖ రాసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న టిఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. మ‌రోవైపు ఎమ్మెల్సీ భూప‌తిరెడ్డి సైతం.. డిఎస్ బాట‌లోనే న‌డుస్తున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జోరందుకుంది.  
డీఎస్ రంగంలోకి..
నిజామాబాద్ అర్బన్ నుంచి ఒకరు, రూరల్ నుంచి మరొకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. అటు రూరల్ లో భూపతిరెడ్డిని రంగంలోకి దింపి బాజిరెడ్డి గోవర్థన్ ను ఓడించాలని, అర్బన్ లో డిఎస్ స్వయంగా పోటీ చేయాలని టీఆర్ఎస్ అభ్య‌ర్ధి గ‌ణేష్ గుప్తాను ఓడించి త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  
బాల్కొండ నియోజ‌కవ‌ర్గంలోనూ..
మ‌రోవైపు బాల్కొండ నియోజ‌కవ‌ర్గంలోనూ సీనియ‌ర్ నేత ముత్యాల సునీల్ రెడ్డి కూడా అస‌మ్మ‌తి రాగం వినిపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌శాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌డం పై ఆయ‌న గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవ‌ల నియోజ‌కవర్గంలో ర్యాలీ నిర్వ‌హించి అనుచ‌రులు కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం కూడా నిర్వ‌హించారు. అయితే సునీల్ రెడ్డిని బిజెపి త‌ర‌పున పోటిచేయించాల‌ని ఆ పార్టీ పెద్ద‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత +
Is TRS sabha going to postpone?

టీఆర్ఎస్ భారీ బహిరంగ సభపై నీలినీడలు

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సమయంలో సభ నిర్వహించడం అంటే అంత సులువు కాదు. సభ ఏర్పాట్లతో పాటు జన సమీకరణకు ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. సభ లోపు పూర్తి చేయాల్సిన పనులు ఇంకా పూర్తి కాలేదు. సెప్టెంబర్ 2న నగర శివారుల్లో 20 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, సీనియర్లతో భేటీ అయి సభ విజయవంతం కోసం కార్యచరణ రూపొందించాలనుకున్నారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున.. ప్రజా ప్రతినిధులు సహయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించడంతో ఈ సమావేశం వాయిదా పడింది. దీంతో పన్నెండు రోజుల్లో జరగాల్సిన భారీ బహిరంగ సభ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. అయితే సభ వాయిదాకు వర్షాలే అడ్డంకి కాదు. సభ లోపు పూర్తి చేయాలనుకున్న పనులు పూర్తి కాలేదు. సభలోనే 90 శాతం అభ్యర్ధులను ప్రకటిస్తానని కేసీఆర్ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గాల వారిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌ల పనితీరు, పార్టీ పరిస్థితి, విపక్షాల పనితీరుపై సమగ్ర నివేదికలు అందచేయాలని పార్టీ కార్యదర్శులను ఆదేశించారు. అయితే పార్టీ యంత్రాంగం మొత్తం కంటివెలుగు, రైతు భీమా పనుల్లో బీజీగా ఉండటంతో సమాచార సేకరణ పూర్తి కాలేదు. నివేదికలు సిద్దం కాలేదు. దీంతో బహిరంగ సభలో వచ్చే ఎన్నికల అభ్యర్ధులను ప్రకటించడం సాధ్యం అయ్యేలా లేదు. అయితే సభలోనే అభ్యర్దులను ప్రకటించడం ద్వారా రాజకీయ వేడిని పెంచాలని కేసీఆర్ భావించారు. సభలో అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల ప్రచార శంఖాన్ని పూరించాలనుకున్నారు. కాని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అసలు మొదలే కాలేదు. కేకే నేత్రుత్వంలో ఏర్పడిన స్క్రీనింగ్ కమిటీకి ఆశావాహుల జాబితా అందలేదు. ఈ పనులన్నీ పూర్తి అయ్యేందుకు కనీసం 20 రోజుల సమయం పడుతుందంటున్నారు. అందుకే సెప్టెంబర్ మూడో వారానికి సభను వాయిదా వేసే యోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటిలోపు అసెంబ్లీ రద్దుపై మరింత స్పష్టత వస్తుందని గులాబీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో సెప్టెంబర్ 2న జరగాల్సిన సభ వాయిదా పడినట్లేనని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత +
7 things to know about Atal Bihari Vajpayee

రాజకీయాల్లో నిష్కళంకుడు వాజ్‌పేయి

దేశ రాజకీయనాయకుల్లో నిష్కళంక, నిర్వివాద రాజకీయ నాయకులు చాలా కొద్దిమందే ఉంటారు. అటువంటి వారు ఈ లోకంలో వేళ్ళమీద లెక్కబెట్టినా దొరకరు. అలాంటి రాజకీయ నాయకుల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఒకరు. ప్రధానమంత్రి పదవిని ఆయన మూడుసార్లు చేపట్టారు. వాజ్ పేయి పాలనలో దేశ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకూ కేంద్రంలో ఐదేళ్ళ పూర్తి పదవీకాలం కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానమంత్రి వాజ్‌పేయి ఒక్కడే కావడం విశేషం. బీజేపీ వ్యవస్థాపకుడైనప్పటికీ లౌకిక తత్వంతో వ్యవహరిస్తారు వాజ్ పేయి. పార్టీలకు అతీతంగా దేశంలోని రాజకీయనాయకులందరూ ఆయనకు ఎంతో గౌరవం ఇస్తారు. ఒక మధ్యతరగతి బ్రాహ్మణ ఉపాధ్యాయుడి కుటంబంలో పుట్టిన వాజ్ పేయి దేశాధినేత స్థాయికి ఎదగటం వెనక ఎంతో కృషి, అంకితభావం, పట్టుదల ఉన్నాయి. ఆరెస్సెస్ లో ప్రచారక్ గా చేరిన వాజ్ పేయి, ఆ సిద్ధాంతాల ప్రాతిపదికన భారతీయ జనతాపార్టీని స్థాపించటమేకాకుండా, దానిని జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్యాయ శక్తిగా నిలబెట్టారు.  
పేద కుటుంబంలో పుట్టి...
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్ పేయి జన్మించారు. వారిది ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. తండ్రి కృష్ణ బిహారీ వాజ్‌పేయి ఒక ఉపాధ్యాయుడు, కవి. అటల్ డిగ్రీవరకు గ్వాలియర్‌లోనే చదువుకున్నారు. కాన్పూర్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. బాబా సాహెబ్ ఆప్టే అనే నేత ప్రభావంతో అటల్ 1939లో ఆరెస్సెస్‌లో చేరారు. 1942లో తన అన్న ప్రేమ్‌తో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 23 రోజులు జైలుశిక్ష అనుభవించారు. 1944లో ఆర్యసమాజ్ యువజన విభాగానికి జనరల్ సెక్రటరీ అయ్యారు. 1947లో ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారారు. తర్వాత ఆరెస్సెస్ విస్తారక్‌గా మారి యూపీకి పంపబడ్డారు. అక్కడ ఆరెస్సెస్ నేత దీనదయాళ్ ఉపాధ్యాయకు చెందిన రాష్ట్రధర్మ, పాంచజన్య, స్వదేశ్, వీర్ అర్జున్ వంటి పత్రికలకు పనిచేశారు. 1948లో మహాత్మాగాంధి హత్య తర్వాత ఆరెస్సెస్‌ను నిషేధించారు. దీనితో వాజ్‌పేయి, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆరెస్సెస్‌కు అనుబంధంగా కొత్తగా ఏర్పాటైన రాజకీయపార్టీ జనసంఘ్‌కు పనిచేయటం ప్రారంభించారు. జనసంఘ్‌లో అటల్ జాతీయ కార్యదర్శి పదవిని చేపట్టారు. అతి త్వరలోనే ఆయన పార్టీ ముఖ్యనేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ప్రధాన అనుచరుడయ్యారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ చనిపోవటంతో జనసంఘ్ నాయకత్వ బాధ్యతలను వాజ్‌పేయి భుజానికెత్తుకోవలసి వచ్చింది. 1968లో ఆయన జనసంఘ్ అధ్యక్షుడయ్యారు.  
జనసంఘ్ లో సభ్యుడిగా...
1957లో వాజ్‌పేయి మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బలరాంపూర్ లోక్ ‌సభ నియోజకవర్గాలలో ఆయన జనసంఘ్ అభ్యర్థిగా నిలుచున్నారు. మధురలో ఓడిపోగా, బలరాంపూర్‌లో విజయం సాధించారు. 1975 - 1977 మధ్యకాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధి ఎమర్జెన్సీ విధించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అటల్, జైలుకెళ్ళాల్సివచ్చింది. 1977లో జయప్రకాష్ నారాయణ పిలుపును మన్నించి జనసంఘ్‌ను కొత్తగా ఏర్పాటైన జనతాపార్టీలో విలీనం చేశారు. 1977 ఎన్నికల్లో జనతాపార్టీ ఘనవిజయం సాధించటంతో నాడు ఏర్పడిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వాజ్‌పేయి విదేశాంగశాఖను చేపట్టారు. విదేశాంగమంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ఉపన్యాసం ఇచ్చి ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు. 1979లో జనతా ప్రభుత్వం కుప్పకూలిపోవటంతో వాజ్‌పేయి 1980లో తన ఆరెస్సెస్ సహచరులు అద్వానీ, భైరన్ సింగ్ షెకావత్‌లతో కలిసి భారతీయజనతాపార్టీని స్థాపించారు. ఆ పార్టీకి మొదటి అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఏర్పడిన ఇందిరా గాంధి ప్రభుత్వ విధానాలను వాజ్‌పేయి తీవ్రంగా వ్యతిరేకిస్తుండేవారు... విమర్శిస్తుండేవారు.  
రాజకీయాల్లో తనదైన ముద్ర...
1984లో ఇందిర హత్య తదనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండే సీట్లు లభించాయి. అయినాగానీ వాజ్‌పేయి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రను చూపేవారు. ఆ తర్వాతికాలంలో బీజేపీ రామజన్మభూమి ఉద్యమాన్ని ఎత్తుకుంది. 1994లో కర్ణాటకలో, 1995లో గుజరాత్, మహారాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించటంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీ ప్రాధాన్యత మరింత పెరిగింది.  
భారత రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడు..
ప్రధానమంత్రిగా వాజ్ పేయికి ఎన్నో ఘనతలు ఉన్నాయి. పొఖ్రాన్ అణుపరీక్షలతో భారత అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పటం, కార్గిల్ పోరులో పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పటం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ నిర్మించటం వంటి పరిణామాలతో వాజ్ పేయి తన రాజనీతిజ్ఞతను, పాలనా సామర్థ్యాన్ని చాటుకున్నారు. మరోవైపు, బీజేపీకి మతతత్వ పార్టీగా పేరున్నప్పటికీ, ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్ పేయి... ఏనాడూ అతివాదిలాగా, ఛాందసవాదిలాగా వ్యవహరించకపోవటం ఆయన ఉదాత్త స్వభావానికి నిదర్శనం. ఆరెస్సెస్ మూలస్తంభాలుగా పరిగణించే రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి అంశాలకు వాజ్ పేయి ప్రాధాన్యం ఇవ్వలేదు. గుజరాత్ లో 2002లో జరిగిన మతకల్లోలాల సమయంలో, నాడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడిని రాజధర్మం పాటించాలని సూచించి వాజ్ పేయి తన లౌకిక తత్వాన్ని చాటుకున్నారు.  
13 రోజుల పాలనలో..
1984లో కేవలం రెండు స్థానాలు గెలిచిన బీజేపీ, 1996 పార్లమెంట్ ఎన్నికల సమయానికి 161 స్థానాలకు ఎదిగింది. నాడు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవటంతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచిన బీజేపీనే రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెజారిటీ నిరూపించుకోవటానికి ఇచ్చిన రెండువారాల గడువులో... విఫలం కావటంతో వాజ్‌పేయి 13 రోజుల తర్వాత రాజీనామా చేశారు. తర్వాత వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంకూడా 1998లో కుప్పకూలిపోవటంతో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 182 స్థానాలు లభించాయి. బీజేపీ మిత్రపక్షాలతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టింది. ఈ ప్రభుత్వం 13 నెలలు అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వ హయాంలోనే పొఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ పోరు, లాహోర్ సదస్సు జరిగాయి. వీటితో వాజ్‌పేయి ఖ్యాతి ఎన్నోరెట్లు పెరిగింది. ముఖ్యంగా పొఖ్రాన్ అణుపరీక్షలతో భారత్ అణ్వస్త్ర సామర్థ్యం ప్రపంచానికి తెలిసివచ్చింది. అణ్వస్త్ర సామర్థ్యం కల అతికొద్దిదేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. మరోవైపు పాకిస్తాన్ తో శాంతి ప్రక్రియను వాజ్ పేయి మరింత ముందుకు తీసుకెళ్ళారు. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీనుంచి లాహోర్ కు చరిత్రాత్మక బస్సు సర్వీసు ప్రారంభించారు.  
ఆయన హయాంలోనే కార్గిల్ పోరు..
వాస్తవాధీన రేఖవద్ద చొరబాట్లకు ప్రయత్నిస్తున్న పాక్ సేనలకు వాజ్ పేయి కార్గిల్ పోరు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. 1999 జూన్‌లో ఆపరేషన్ విజయ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ పోరులో భారత దళాలు వందలమంది పాక్ తీవ్రవాదులను, సైనికులను హతమార్చి తరిమికొట్టాయి. అయితే 1996నాటి వాజ్ పేయి ప్రభుత్వం 13 నెలల తర్వాత అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించటంతో 1999 ఏప్రిల్ 7న కుప్పకూలిపోయింది. వెంటనే రాష్ట్రపతి లోక్ సభను రద్దు చేసి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కార్గిల్ పోరులో విజయం ప్రభావంతో 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ 303 సీట్లతో మంచి మెజారిటీని చేజిక్కించుకుంది... సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు. ఈ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగింది.  
లౌకికవాది వాజ్ పేయి అతివాది అద్వానీ..
సంఘ్ పరివార్ మూల సిద్ధాంతాలైన రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలకు వాజ్ పేయి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రభుత్వంలో అతివాదులను పక్కనబెట్టి మితవాదులైనవారికి ప్రాధాన్యత కల్పించారు. హిందూత్వ రాజకీయాలంటే పడని బ్రజేష్ మిశ్రాను ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకున్నారు. మితవాదులైన జస్వంత్ సింగ్, అరుణ్ శౌరిలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనిపై ఆరెస్సెస్ లో అసంతృప్తి పెరిగిపోతుండటంతో 2002లో అతివాదిగా పేరుబడ్డ అద్వానీకి ఉప ప్రధానమంత్రి పదవి ఇచ్చి సమతూకం చేశారు.  
2004లో బీజేపీ ఓటమి..
వాజ్‌పేయి తన మూడో హయాంలో నేషనల్ హైవేస్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ప్రారంభించారు. అయితే 1999 డిసెంబర్ లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ సందర్భంగా ప్రయాణీకులకోసం తీవ్రవాదులను వదిలిపెట్టటం, 2002లో గుజరాత్ మతకల్లోలాలు వంటి ఘటనలు వాజ్‌పేయి ప్రభుత్వానికి మచ్చలుగా మిగిలాయి. 2004 ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పలేదు. సంఘ్ పరివార్ మూడు మూలసిద్ధాంతాలను వాజ్ పేయి పక్కన పెట్టటంవల్లే బీజేపీ ఓడిపోయిందని ఆరెస్సెస్ ఆరోపించింది.

మరింత +
More young people going to marriage in this season (Sravana Masam) in Telangana and Andhrapradesh states soon

ఈ శ్రావణ మాసంలో అన్నీ శుభ ముహూర్తాలే..!

శ్రావణ మాసం వచ్చింది. పెళ్లి కళను తీసుకొచ్చింది. ప్రతి ఇంట ఇక బాజాల సందడి మొదలుకానుంది. కల్యాణం కమనీయమంటూ పెళ్లిలకు సిద్దమయ్యారు తెలంగాణ ప్రజలు. పెళ్లి పిలుపుల కోసం పెళ్లి కార్డులకు బయలుదేరారు. కొత్త జంటలను ఒక్కటి చేసేందుకు మండపాలు కూడా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. 
పెళ్లి కల వచ్చేసిందండోయ్..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ శ్రావణ మాసంలో అన్నీ శుభ ముహూర్తాలే ఉండడంతో పెద్ద సంఖ్యలో పెళ్లిల్లు జరగనున్నాయి. ఆగష్టు నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెప్పడమే ఆలస్యం కుటుంబాలలో పెళ్లీడుకొచ్చిన యువతీయువకులకు వివాహాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈనెల 16, 22, 24, 25, 26, 27, 30 తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరగబోతున్నాయి. తెలంగాణ, ఏపీల్లో కలిపి లక్షకుపైగా జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నాయని అంచనా.  
ఫంక్షన్ హాల్లకు భలే గిరాకీ...
ఉమ్మడి జిల్లాలో కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్, ఫొటో, వీడియో, పురోహితులు టెంట్‌ హౌస్‌లకు డిమాండ్‌ పెరిగింది. పట్టణాల్లో ట్రావెల్స్, ప్లవర్స్‌ డెకరేషన్‌ ట్రూప్స్, బ్యాండ్‌ వాలాలను ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. చిన్న, పెద్ద హోటళ్లలో గదులు ఇప్పటికే హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. ట్రావెల్‌ ఏజెన్సీలు బిజీబిజీగా మారాయి. ఇప్పటికే పెళ్లి పనులను షురూ చేశారు. ఫంక్షన్‌హాళ్లు, కళ్యాణ మండపాలు ఎక్కడికక్కడ బుక్కయిపోయాయి. దీంతో కొందరికి హాళ్లు దొరకడం కష్టంగా మారింది. అలాగే చాలా చోట్లా ఒకే ఫంక్షన్‌ హాల్లో రెండు పూటలా పెళ్లిళ్లు జరగనున్నాయి. పంక్షన్‌హాళ్లు దొరకని వధూవరుల కుటుంబసభ్యులు కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల కోసం పరుగులు పెడుతున్నారు. కాగా ఒక్కో మండపానికి రోజుకు రూ.25 వేలు నుంచి రూ.2 లక్షల వరకు ఆ రోజుకుచేసే ఏర్పాట్లను బట్టి అద్దెలు ఉంటున్నాయి. 
బరువెక్కిన బంగారం..
పెళ్లిళ్ల సందడితో మార్కెట్ కు కొత్త శోభ సంతరించుకుంది. బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. షాపింగ్ మాల్స్ రద్దీగా మారాయి. కొత్త బట్టల కొనుగోళ్లులో పెళ్లి పెద్దలు బిజీబిజీగా మారారు. పెళ్లి ముహూర్తాల కారణంగా అన్నింటి ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

మరింత +