రీల్ న్యూస్

Vishal wedding: Hero vishal to tie the knots with anisha reddy

త్వరలో అనీశాతో విశాల్ నిశ్చితార్థం

హైదరాబాద్ వ్యాపారవేత్త కూతురు అనీశాతో తమిళ సినీ నటుడు విశాల్‌ నిశ్చితార్థం జరుగనుంది. త్వరలో హైదరాబాద్‌లోనే ఈ వేడుక జరుగుతుందని సమాాచారం. ఈ పెళ్లిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనీశాతో విశాల్ వివాహం గురించి గతంలో విశాల్‌ తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ తొలి చిత్రం పెళ్లి చూపులు సినిమాలో ప్రేయసిగా నటించిన అనీశాని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. విజయ్‌ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలోనూ స్నేహితుడి ప్రేయసిగా అనీశా నటించింది. విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను అనీశా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. విశాల్‌ మంచి మనసు తనకెంతో నచ్చిందని తెలిపింది అనీశా. విశాల్‌తో జీవితం పంచుకుని ఆయన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. ఈ నెలలోనే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగబోతోందని విశాల్‌ తండ్రి వెల్లడించారు. పెళ్లి కూడా నగరంలోనే నట.

మరింత +
Vijay Sethupathi first look in Syeraa Narasimhareddy biopic movie

సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్

భారత స్వాతంత్య్ర సమరయోధుడు కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా భారీ అచంనాలతో వస్తున్నారు. ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విజయ్‌ రాజా పాండి అనే పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మోషన్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో వీరుడిలా కనిపిస్తున్న విజయ్‌ సేతుపతి లుక్‌ మరింత ఆకట్టుకుంటోంది.

మరింత +
Director Shankar's Indian-2 movie first look out

భారతీయుడు-2 ఫస్ట్ లుక్ విడుదల

కమల్ హసన్ నటించిన భారతీయుడు-2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారతీయుడు-2 సినిమాను గతేడాది తీయాలనుకున్నా.. నటుడు కమల్‌హాసన్ రాజకీయాలతో అటు శంకర్ రోబో-2 సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యం అయింది. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఇండియన్-2 సినిమా జనవరి 18న సెట్స్‌పైకి వెళ్లనుంది. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు పోస్ట‌ర్‌లో కనబడుతోంది. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత +
Vishwasam Vs Petta: Rajini, Ajith Fans Fight at Rohini Theatre in Tamilnadu

రజనీకాంత్, అజిత్ అభిమానుల మధ్య ఘర్షణ

తమిళనాడులో సినీ హీరోలపై అభిమానం తారాస్థాయికి చేరుకుంది. ప్రముఖ హీరోలు రజనీకాంత్, అజిత్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. రజనీకాంత్ నటించిన మూవీ పేట, అజిత్ నటించిన విశ్వాసం ఓకే రోజు విడుదలయ్యాయి. తమ అభిమాన హీరోల సినిమాలు విడుదల కావడంతో నాలుకపై కర్పూరం వెలిగించుకుని డ్యాన్స్‌లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మద్యం మత్తులో థియేటర్ల వద్ద రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడి చేసుకున్నారు. దాడుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరింత +
Rakesh Roshan Is A Fighter: PM Modi Tweets To Hrithik After He Reveals Dad's Cancer Diagnosis

బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ తండ్రికి మోడీ ట్వీట్

గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న, బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాక్షించారు. రాకేష్‌ను ఆయన ఫైటర్‌గా అభివర్ణించారు. రాకేష్‌ జీ ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి. ఆయన ఈ చాలెంజ్‌ను ధీటుగా ఎదుర్కొంటారని మోడీ హృతిక్‌కి ట్వీట్‌ చేశారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, నాన్నకు క్యాన్సర్‌ ప్రారంభ స్థాయిలోనే ఉందన్నారు హృతిక్‌. తన తండ్రి కోలుకోవాలని విష్ చేసినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని హీరో హృతిక్‌ రోషన్‌ రీట్వీట్‌ చేశారు.

మరింత +
Hero Bala Krishna attends benfit show at Bramaramba Theatre in Hyderabad along with fans

భ్రమరాంబ థియేటర్‌లో బాలయ్య సందడి

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రం విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ఆయన అభిమానులతో కలసి సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానులు కెరింతలు కొట్టరు. బెనిఫిట్ షో చూసిన అభిమానులు సినిమా అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

మరింత +
NTR Biopic Team visits Nimmakur in Krishna district along with Hero Bala Krishna and Vidya Balan

నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రబృందం కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో పర్యటించారు. కథనాయకుడు చిత్రబృందానికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా, బాలకృష్ణతో పాటు హీరో కల్యాణ్ రామ్, నటి విద్యాబాలన్ కూడా వచ్చారు.

మరింత +
Confirmed! Vivek Oberoi will feature in PM Narendra Modi biopic, first poster to be out on January 7

మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవితాధారంగా బాలీవుడ్‌లో మరో బయోపిక్ రాబోతోంది. ఈ బయోపిక్‌కు ‘పీఎం నరేంద్రమోడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ను మోడీ పాత్రకు ఎంపికచేసుకున్నారు. ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈనెల 7న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల కానుంది. జనవరి 15 నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఇప్పటికే రాజకీయ నేతల జీవితాధారంగా నందమూరి తారక రామారావు మూవీ ‘యన్‌టిఆర్‌’ విడుదలకు సిద్దం కాగా, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం త్వరలో విడుదల కానుంది. మరోపక్క దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ‘ది ఐరన్‌ లేడీ’ అనే బయోపిక్‌ నిర్మాణమవుతోంది. ఇందులో జయలలిత పాత్రలో నిత్యా మీనన్ నటించింది.

మరింత +
Jagapathi babu as YSR father in Yatra Movie first look out

యాత్ర మూవీలో జగపతిబాబు ఫస్ట్ లుక్ రిలీజ్డ్

టాలీవుడ్ విలక్షణ నటుడు జ‌గ‌ప‌తి బాబు మరో పాత్రలో కనిపించబోతున్నాడు. వైఎస్ జీవిత కథాంశంతో తెరెక్కుతున్న యాత్ర మూవీలొ వైఎస్ఆర్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. ఇదివరకు లెజెండ్ సినిమాతో విల‌న్‌గా టర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో జ‌గ‌ప‌తి బాబు త‌న‌ సెకండ్ ఇన్నింగ్స్‌ని మొద‌లు పెట్టాడు. ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ అన్నీ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో వస్తున్న వెబ్ సిరీస్ లో జగ్గూభాయ్ గా న‌టిస్తున్నాడు. మ‌హీ వి రాఘ‌వ దర్వకత్వంలో తెర‌కెక్కిస్తున్న యాత్ర సినిమాలో జగపతిబాబు వైఎస్ఆర్ తండ్రి యెడుగూరి సందింటి రాజా రెడ్డి పాత్ర‌ని పోషిస్తున్నాడట. ఆయ‌న ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లైంది. మరో లెజండ‌రీ న‌టుడు మ‌మ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల కానుందని సమాచారం.

మరింత +
IT sleuths raid homes of Kannada film stars including Puneet Rajkumar, Yash

కర్ణాటక సినీ ఇండస్ట్రీపై ఐటీ దాడులు

కర్ణాటక సినీ ఇండస్ట్రీపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజామునుంచే కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్, విజయ్‌, జయన్న‌తో పాటు.. హీరోలు శివరాజ్‌కుమార్‌, పునీత్ రాజ్‌కుమార్‌, సుదీప్, కేజీఎం ఫేం యష్‌ ఇళ్లలోనూ తనిఖీలు చేపడుతున్నారు. కర్ణాటక, గోవా అధికారులతో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత +
Mega Star Chiranjeevi Becomes Grand Father Again,  Srija delivered a beautiful baby girl

క్రిస్మస్ రోజు మెగాస్టార్ చిరు ఇంట ఆనందం

క్రిస్మస్‌ రోజు మెగాస్టార్‌ ఇంట పండగ వాతావరణం చోటు చేసుకుంది. చిరంజీవి కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించడంతో వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఈ విషయాన్ని చిరు,కల్యాణ్‌దేవ్‌ లు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను షేర్‌ చేశారు షేర్ చేశారు. 2018 క్రిస్మస్‌ పండుగ తన జీవితాంతం గుర్తుండి పోతుందని తెలిపారు. అభిమానులందరికీ సూపర్‌ మెర్రీ క్రిస్మస్‌ అని పోస్ట్‌ చేశారు చిరు అల్లుడు కల్యాణ్ దేవ్.

మరింత +
TDP Leaders challenges Ram Gopal Varma for open debate on Lakshmi's NTR Vennupotu Song

ఫేస్ బుక్, ట్విట్టర్ లో కాదు బహిరంగ చర్చకు రా..

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని వెన్నుపోటు పాటపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చంద్రబాబును కించపరిచేలా ఉందంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. రాజకీయ కారణాలతోనే వర్మ చంద్రబాబును టార్గెట్ చేశారని ఆరోపిస్తూ వర్మ పోస్టర్లను దగ్ధం చేశారు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆదర్శవంతమైన ఘట్టాలున్నాయని వాటిని వర్మ ఎందుకు చూపించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో కాదు వర్మకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

మరింత +
TDP MLA files case on Lakhsmi's NTR Movie Director Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మపై టీడీపీ ఎమ్మెల్యే కేసు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వెన్నుపోటు పాట వివాదంగా మారింది. దీనిపై ఏపీ వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నేత కేసు పెట్టారు. ఈ పాట చంద్రబాబును కించపరిచేలా ఉందని టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మపై కర్నూలు పీఎస్‌లో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ పోస్ట‌ర్ మాత్ర‌మే విడుద‌ల కాగా, తాజాగా వెన్నుపోటు అనే సాంగ్‌ని విడుద‌ల చేశాడు వర్మ. చంద్రబాబును విమర్శిస్తూ రాసిన లిరిక్స్‌పై సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. బాల‌కృష్ణ‌ నిర్మిస్తున్న‌ ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో వేడుక‌కి గంట ముందే వెన్నుపోటు సాంగ్‌ని విడుద‌ల చేశాడు. దీంతో ప్రేక్షకుల అటెన్ష‌న్‌ని త‌న‌వైపుకి తిప్పుకోగలిగాడు వ‌ర్మ‌. రిలీజ్‌ చేసిన గంటలోనే ఈ సాంగ్‌కి దాదాపు లక్ష వ్యూస్‌ రావడం విశేషం.

మరింత +
Nandmuri Balakrishna's Multi starrer movie NTR new poster released with all characters

ఎన్టీఆర్ మూవీ పోస్టర్ అదుర్స్

ఎన్టీఆర్ బయోపిక్‌ చిత్రం విడుదలకు చిత్రయూనిట్ రంగం సిద్దం చేస్తోంది. శుక్రవారం ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజా పోస్టర్‌లో రావణాసురుడి గెటప్‌లో ఎన్టీఆర్‌లా బాలకృష్ణ ఆహార్యం ఆకట్టుకుంటోంది. బాలయ్యతో పాటు సినిమాలో వివిధ పాత్రల్లో నటిస్తున్నవారి లుక్స్‌ను కూడా పోస్టర్ లో చూపించారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మాతగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోంది. అలనాటి దిగ్గజాల పాత్రల్లో పేరున్న నటీనటులు నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీ 2019 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత +
Tamil Film Producers Council President Vishal detained after complaints

తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో రచ్చకెక్కిన వివాదాలు

తమిళనాడు నిర్మాతల మండలిలో అంతర్గతంగా సాగిన వర్గ పోరు రచ్చకెక్కింది. తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఉన్న విశాల్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం నిర్మాతలు ఆందోళన చేశారు. టీనగర్‌లోని నిర్మాతల సంఘం కార్యాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. ఆ తాళం చెవులను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. శుక్రవారం తమిళనాడులో 9 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకే రోజు ఇన్ని సినిమాలు విడుదల చేస్తే చిన్న సినిమాలను నిర్మించిన నిర్మాతల పరిస్థితేంటని విశాల్ వ్యతిరేక వర్గం ప్రశ్నిస్తోంది. తన కార్యాలయానికి తాళం వేయడంపై తీవ్రంగా మండిపడ్డ విశాల్, తన అనుచరులతో రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో విశాల్‌ను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

మరింత +